08 జులై, 2012
08 జులై, 2012

100 మిలియన్ చిత్రాలు

Snapchatకు మీరు అందిస్తున్న మద్దతుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నాము. మా సేవ ద్వారా 110 మిలియన్లకు పైగా చిత్రాలు పంపబడ్డాయి! వూహూ! మీరు లేకుండా మేము ఇది చేసి ఉండేవాళ్ళం కాదు.

గత కొన్నివారాల్లో చాలా విషయాలు జరిగాయి. ఇద్దరు అద్భుతమైన మరియు ప్రతిభావంతులైన ఇంజనీర్లు (మరియు స్నేహితులు) టీమ్‌లో చేరినట్లుగా ప్రకటించడానికి మేం ఎంతో సంతోషిస్తున్నాం – డేనియల్ మరియు డేవిడ్‌కు స్వాగతం! మేము ఒక అద్భుతమైన కమ్యూనిటీ మేనేజర్ డెనాని ఇప్పటికే నియమించాం, ఆమె మా అసంఖ్యాకంగా పేరుకుపోయిన మా ఇమెయిల్ దొంతరల క్రిందినుండి మమ్మల్ని బయటికి తీయడంలో ఇప్పటికే మాకు సహాయపడుతున్నారు. మీరు ఇంకా మద్దతు కోసం వేచి చూస్తున్నారా (మన్నించాలి!) సాయం త్వరలో లభిస్తుందని వాగ్దానం చేస్తున్నాం.

మేము ప్రస్తుతం అత్యంత వేగవంతమైన మరియు వినోదాత్మక అప్‌డేట్‌ని పరీక్షిస్తున్నాము, అది ఈ నెలాఖరుకు బయటికి వస్తుంది. పాస్‌వర్డ్ రికవరీ, బగ్ ఫిక్స్‌లు, వేగవంతమైన కెమెరా మరియు డ్రాయింగ్ మీకు దగ్గర్లోని iOS ఉపకరణానికి త్వరలో రాబోతున్నాయి. ఈ పనుల్లో మాకు కొన్ని అత్యంత రహస్య విషయాలు కూడా ఉన్నాయి.

మా Android అభిమానుల కోసం - మీ ఉపకరణాలన్నింటికీ ఒక గొప్ప Snapchat అనుభవాన్ని వృద్ధి చేయడానికి మేము కష్టపడి పనిచేస్తున్నాం! ఇదంత సులభమేమీ కాదు, ఐతే ఇదొక గొప్ప ప్రొడక్ట్ అని మేము గట్టిగా చెప్పాలనుకుంటున్నాము. విడుదల-ముందస్తు వెర్షన్ పరీక్షించే ఆసక్తి మీకు ఉంటే మాకు ఒక ఇమెయిల్ పంపించండి.

అయితే చివరిగా – Snapchat పట్ల కొనసాగుతున్న మద్దతుకు మీ అందరికీ మేం ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నాం. మా సర్వీస్ ద్వారా 110 మిలియన్ చిత్రాలకు పైగా పంపించబడ్డాయి! ఓహో! మీరు లేకుండా ఉంటే దీన్ని మేం చేయలేకపోయే వాళ్ళం.

వార్తలకు తిరిగి వెల్దాం