22 ఏప్రిల్, 2024
22 ఏప్రిల్, 2024

రెడీ, సెట్, ఓట్ చేయండి! Snapchattersను 2024 US ఎన్నికలకు సిద్ధం చేస్తోంది

2024 U.S. ఎన్నికలకు ముందు, ఈ రోజు మేము Snapచాటర్లు ఎన్నికల ప్రక్రియలో భాగమయ్యేందుకు మరియు Snapchat అనేది ఖచ్చితమైన మరియు సహాయకారిగా ఉండే సమాచారాన్ని అందించే ఒక విశ్వసనీయమైన ప్రదేశమని చెప్పేందుకు మేము వారిని ఏవిధంగా సశక్తులము చేస్తాము అనే విషయాన్ని పంచుకొంటున్నాము.

పౌర నిమగ్నత

Snapchatలో, ఓటు వేయడమనేది తమను తాము వ్యక్తపరచుకోవడానికి ఉపయోగించే అత్యంత శక్తివంతమైన రూపాలలో ఒకటని మేము విశ్వసిస్తాము. U.S. ఓటర్లతో గణనీయమైన బంధాన్ని కలిగివున్న ఒక వేదికగా - దాదాపు 100M+ ఉన్న Snapఛాటర్లలోని 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సున్న వారిలో దాదాపు 80% మందికి మేము చేరువవుతున్నందున 1- మన కమ్యూనిటీకి సంబంధించిన సమస్యలను గురించి తెలుసుకోవడానికి మరియు ఓటుకు నమోదు చేసుకోవడాన్ని మేము మరింత సులభతరం చేయదలచుకొన్నాము.

Snapఛాటర్లు తమ స్థానిక సమస్యలు మరియు పౌర నిమగ్నత గురించి తెలుసుకోవడానికి 2016లో మేము మొదటిసారి ఇన్-యాప్ వనరులను అందించడం ప్రారంభించాము. 2018లో దాదాపు 450,000 మంది Snapచాటర్లు ఓటు వేయడానికి నమోదు చేసుకొనేందుకు మేము సహాయపడ్డాము, 2020లో మేము దాదాపు 1.2 మిలియన్ల Snapచాటర్లు ఓటు వేసేందుకు నమోదు చేసుకొనేందుకు మరియు 30 మిలియన్లమందికి ఓటింగ్ సమాచారాన్ని అందించేందుకు మరియు గత U.S. మధ్యంతర ఎన్నికలకుముందు, వారు పోటీ చేసేందుకు అవకాశాల గురించి 4 మిలియన్లమందికి సహాయంచేశాము.

2024లో, మా కమ్యూనిటీ సామాజికపరంగా నిమగ్నమయ్యేందుకు సహాయపడటంలో మా నిబద్ధతను కొనసాగిస్తూ, Vote.orgతో భాగస్వామ్యంలో, ఓటరు నిమగ్నతను మరింత క్రమబద్ధీకరణ చేసేందుకు మేము ఒక ఇన్-యాప్ టూల్స్ ప్రారంభించాము. ఇది Snapచాటర్లు యాప్‌ను విడిచివెళకుండా తమ రిజిస్ట్రేషన్ స్థితిని తనిఖీ చేసుకోవడానికి, ఓటు వేసేందుకు నమోదు చేసుకోవడానికి, ఎన్నికల రిమైండర్లకు సైనప్ చేసుకోవడానికి మరియు ఎన్నికలరోజుకు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది.

Snapchatపై ఎన్నికల కంటెంట్

Snapచాటర్లు ఖచ్చితమైన సమాచారానికి మరింత యాక్సెస్ కల్పించేందుకు మేము మరోసారి Snapchatపై ఎన్నికలను కవర్ చేస్తున్నాము. మా ప్రధాన వార్తా సమాహారం గుడ్ లక్ అమెరికా, Snapchattersకు 2016 నుండి రాజకీయ సంబంధ వార్తలను అందిస్తోంది మరియు ఈ సంవత్సరంకూడా, ముఖ్యమైన ఎన్నికల కార్యక్రమాలు మరియు వివరణలను నవంబర్ వరకు అందించడం కొనసాగిస్తుంది.

గుడ్ లక్ అమెరికా, - అధ్యక్ష పదవికి పోటీపడే ప్రముఖ అభ్యర్థులు, రాబోయే జాతీయ సమావేశాల కవరేజ్, మరియు ఎన్నికలరోజుతో సహా ప్రచారపు జోరులోని ముఖ్యమైన సంఘటనలను కవర్ చేస్తుంది. ఈ కార్యక్రమం ఒక కొత్త సిరీస్ కూడా ప్రారంభిస్తోంది: గుడ్ లక్ అమెరికా క్యాంపస్ టూర్, ఇది HBCUs మరియు కమ్యూనిటీ కళాశాలలతోసహా, ఎన్నికల పోరు జరిగే రాష్ట్రాలకు వెళ్ళి, ఎన్నికల గురించి యువత ఏమనుకొంటున్నారు, వారికి సంబంధించినంతవరకు ముఖ్యమైన అంశాలు ఏవి అనేవాటిని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది.

Snapchatపై ఎన్నికల కవరేజ్ అందించడానికి, మేము విశ్వసించే మీడియా భాగస్వాములను కూడా మేము కలిగివున్నాము. మా భాగస్వామ్య వార్తల కవరేజ్‌కు యాంకర్ అయిన NBC న్యూస్ 'స్టే ట్యూన్డ్’ అందించే 24 ఆన్ ’24, 24 ముఖ్యమైన గొంతుకల సమాహారమైన స్థానిక, రాష్ట్ర, మరియు ఫెడరల్ ఎన్నికల గురించి Gen Z ఓటర్లతో మాట్లాడుతూ 2024 ఎన్నికలకు ఒక రూపమిచ్చేందుకు దోహదం చేస్తుంది. 2024 ఎన్నికల సమయమంతటా, స్టే ట్యూన్డ్, సమావేశాలు, ర్యాలీలు, ప్రసంగాలతో సహా మరెన్నింటితో సహా క్షేత్రస్థాయి కవరేజ్ కూడా అందజేస్తుంది.

కంటెంట్ మోడరేషన్ మరియు రాజకీయ ప్రకటానలు

మేము ఈ సంవత్సరం, Snapchattersకు విశ్వసనీయమైన వార్తలు మరియు సమాచారాన్ని అందించడంలో అప్రమత్తంగా ఉంటాము. ఏదైనా ప్రజా సంబంధ సమాచారం విస్తృత స్థాయిలోని ప్రజలు వీక్షించడానికి ముంది దానిని మోడరేట్ చేయడంద్వారా తప్పుడు సమాచారం వ్యాప్తికాకుండా నివారించేందుకు ఖచ్చితంగా పరీక్షించబడిన మీడియా సంస్థలతో భాగస్వామ్యాన్ని కొనసాగిస్తాము.

మేము రాజకీయ సంబంధ ప్రకటనలను కూడా ఒక కఠినమైన మానవ సమీక్షా ప్రక్రియ ద్వారా అందిస్తాము, వీటిలో తప్పుద్రోవ పట్టించే సమాచారమేదైనా ఉందా, AI ఉపయోగించి ప్రతిష్టకు భంగం కలిగించే చిత్రాలను సృష్టించడంవంటివి కూడా ఉంటాయి. వీటికితోడు. రాజకీయ సంబంధ ప్రకటనలలోని వ్యాఖ్యలను వాస్తవాలను స్వతంత్రంగా తనిఖీ చేసేందుకు ఒక నిష్పక్షపాత సంస్థ పోయింటర్ ఇన్‌స్టిట్యూట్‌తో మేము జట్టుకట్టాము. ఇవికాక, రాజకీయ సంబంధ ప్రకటనల సంభావ్య కొనుగోలుదారులను తనిఖీ చేసేందుకు ఒక నమోదు మరియు సర్టిఫికేషన్ ప్రక్రియను ఉపయోగిస్తాము. Snapchatపై పౌర సంబంధ కంటెంట్ యొక్క సమగ్రతను సంరక్షించేందుకు మేము కొనసాగించే చర్యల గురించి మీరు మరింత తెలుసుకోవచ్చు.

ఈ శరదృతువులో తమ స్వరాలను వినిపించేందుకు అవసరమైన టూల్స్ మరియు సమాచారాన్ని అందించడానికి మా భాగస్వాములతో కలసి పనిచేసేందుకు మరియు పౌర నిమగ్నతను ప్రోత్సహించడంలో మా వంతు పాత్ర పోషించడానికి మేము నిబద్ధులమై ఉన్నాము.

- Team Snapchat

వార్తలకు తిరిగి వెల్దాం

1

Snap Inc. అంతర్గత డేటా, ఫిబ్రవరి 26, 2024.

1

Snap Inc. అంతర్గత డేటా, ఫిబ్రవరి 26, 2024.