Snapchat అనేది ప్రజలు తమను తాము సాధికారికంగా వ్యక్తీకరించుకోవడానికి, తమ నిజమైన స్నేహితులతో సంబంధం ఏర్పరచుకోవడానికి, తమ చుట్టుపక్కల ఉన్న ప్రపంచం గురించి మరింత తెలుసుకొనేందుకు ఒక అనువైన ప్రదేశాన్ని సృష్టించుకొనేందుకు సహాయం చేస్తుంది. ఇది వెనిస్‌లోని 523 ఓషన్ ఫ్రంట్‌లో ఉన్న ఒక చిన్నకార్యాలయంలో ప్రారంభమైన ఒక పెద్ద ఆలోచన.
మేము మా వ్యాపారం నడపడం నుండి, మేము రూపకల్పన చేసే ఉత్పత్తులవరకు, మేము అందించే అనుభవాలు, సృష్టించే కంటెంట్ వరకు అన్నీ - మేము Snap వద్ద చేసే ప్రతిదానికీ DEI ప్రాథమికం చేసేందుకు కట్టుబడివున్నాము. ఉద్దేశ్యపూర్వకంగా మేము క్యూరేట్ చేసే మా డిస్కవర్ కంటెంట్ ప్లాట్‌ఫారం, మా Snapchat కమ్యూనిటీ యొక్క వైవిధ్యతను ప్రదర్శించే మా భాగస్వాముల అందించే కంటెంట్‌ను కలిగివుండాలన్నది మా ఆశయం. ప్రతినెలా డిస్కవర్‌పై వినోద కార్యక్రమాలు వీక్షించే దాదాపు 100 మిలియన్లకు Snapchatters (2021) తో, వారి విభిన్న గుర్తింపును, భిన్నమైన ఆసక్తులను వెల్లడించే వైవిధ్యభరితమైన కంటెంట్ అందించడం మా సమిష్టి బాధ్యత.
ఈ రోజు మేము మా మొట్టమొదటి కంటెంట్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ 523 ను ఎంతో ఉత్సుకతతో ప్రకటిస్తున్నాము. ఇది ప్రధానంగా పెద్ద పోటీదారులు మరియు పబ్లిషర్లతో పోలిస్తే అవసరమైన యాక్సెస్ మరియు వనరులు లేని చిన్న, మైనారిటీ-యాజమాన్య కంటెంట్ సంస్థలు మరియు సృజనాత్మకత కలిగివున్నవారికి మద్దతు అందించడంతోపాటు, వారిని వెలుగులోకి తీసుకొనిరావడాని రూపొందించబడినది. డిస్కవర్‌పై కంటెంట్‌ను పంపిణీ చేయడం ద్వారా వారు తమ వ్యాపారాలను మరియు వీక్షకులను పెంపొందించుకొనేలా చేయడం దీని లక్ష్యం.
నేటినుండి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం ఫిబ్రవరి 1 వరకు దరఖాస్తులను అంగీకరిస్తుంది. మరింత తెలుసుకోవడానికి మరియు దరఖాస్తు చేయడానికి చూడండి https://523.snap.com/
ఆరునెలల కాలంలో, విజయవంతమైన 20 మంది వరకు దరఖాస్తుదారులకు Snap క్రిందివి అందజేస్తుంది:
ఫండింగ్ మరియు వనరులు - డిస్కవర్‌కు కంటెంట్‌ను ఆలోచనచేయడం మరియు చిత్రీకరించేందుకు, దరఖాస్తుదారులకు ఆర్థికంగా సహాయం అందించేందుకు నెలకు $10,000 USD అందజేయబడుతుంది.
1:1 మార్గదర్శకత్వం -- దరఖాస్తుదారుల నిమగ్నత మరియు వ్యాపార లక్ష్యాలను పెంపొందించేందుకు Snapchat వేదికను ఎంత ఉత్తమంగా ఉపయోగించికోగలరు అనేదాని గురించి మా కంటెంట్ + మీడియా భాగస్వామ్య బృందాలనుండి మార్గదర్శకత్వం.
భాగస్వామ్య విద్య -- విజయం సాధించేందుకు అవసరమైన ఉత్తమ విధానాల పట్ల మరింత అవగాహన కల్పించే సన్నిహితమైన వర్క్‌షాప్‌లు, - సృజనాత్మక విధానం, మానెటైజేషన్, మరెన్నింటితోపాటు Snapchatలోని నిపుణుల నుండి సెషన్స్ నిర్వహించబడతాయి.
ఎక్స్ పోజర్ మరియు మార్కెటింగ్ -- 523 కార్యక్రమానికి సంబంధించిన ప్రకటనలు మరియు ప్రజా కార్యక్రమాలలో చేర్చడం. ఈ కార్యక్రమానికి సమయం మరియు వనరులందించే ప్రాయోజకులతో సంబంధాలు ఏర్పరచుకొనేందుకు భాగస్వాములకు అవకాశం కలుగుతుంది. ప్రాయోజకులలో: AT&T, నిస్సాన్, టార్గెట్, స్టేట్ ఫార్మ్, యూనిలివర్, Uber ఈట్స్, మరియు మెక్‌డొనాల్డ్స్ సంస్థలు ఉన్నాయి.
కమ్యూనిటీ నిమగ్నం - 523 కార్యక్రమంలోని ఇతర కంపెనీలతో సంబంధం ఏర్పరచుకోవడానికి మరియు Snapchat ద్వారా బలమైన నెట్‌వర్క్ నిర్మించుకొనే అవకాశం.
మేము 523 వద్ద ఉన్నప్పటి నుండి నేటివరకు ఎంతో దూరం వచ్చాము, కాని సంఖ్య అనేది మాకు చాలా ముఖ్యం. మేము ఈ కార్యక్రమానికి ఈ పేరు పెట్టడానికి ప్రధాన కారణం, ఇది మేము సాధించాలనుకొన్న ప్రతిదానికీ ప్రాతినిధ్యం వహిస్తుంది: ఇది మా గతానికి ఒక గుర్తింపుగా, దేన్నైనా సాధించవచ్చు అని ఇతరులకు స్ఫూర్తినిచ్చేలా ఉంటుంది.
ఇక మీ నుండి వినేందుకు మేము నిరీక్షించలేము!