ఈ వారాంతములో యునైటెడ్ స్టేట్‌లోని Snap చాటర్స్ కోసం మేము “ఇటీవల అప్డేట్స్” లో ఒక వ్యాపారప్రకటన ఇవ్వబోతున్నాము. మేం ఇలాంటిది చేయడం ఇదే మొదటిసారి, ఎందుకంటే ఆ ప్రదేశంలో కంటెంట్ ఉంచడానికి మాకు చెల్లింపు చేయడం ఇదే మొదటిసారి. మొదట్లో మాకు ఇది కాస్త అసహజమనిపించినా, మేం ప్రయత్నిస్తున్నాం.
అత్యుత్తమ వ్యాపారప్రకటనలు మీకు వాస్తవంగా ఆసక్తి కలిగించే విషయం గురించి చెబుతాయి. దాన్ని ఖరారు చేయడానికి కొన్ని కంపెనీలు ఎంతో సమయాన్ని గడుపుతాయి మరియు మీ గురించి ఎంతో ఎక్కువ డేటాను సేకరిస్తాయి. ఈరోజు మేము విడుదల చేయబోతున్న ప్రొడక్ట్ చాలా సులువైనది. ఎప్పటికప్పుడు మీ ఇటీవలి అప్డేట్స్ లో ఒక వ్యాపారప్రకటన కనిపిస్తుంది, మీరు దాన్ని చూడాలనుకుంటే ఎంచుకోవచ్చు. బలవంతం లేదు. మీరు దాన్ని చూసిన తర్వాత లేదా 24 గంటల లోపున, స్టోరీల లాగానే అది వెళ్ళిపోతుంది.
మీ వ్యక్తిగత కమ్యూనికేషన్ – Snaps లేదా చాట్స్ వంటి విషయాల్లో మేము వ్యాపారప్రకటనల్ని ఉంచబోము. అది పూర్తిగా మొరటుగా ఉంటుంది. యాడ్ పాతుకోవడం మరియు లక్ష్యం చేయడానికి ముందు, మేం వినోదం మరియు సమాచారయుతమైన అనుభవాన్ని ఇవ్వగలమా అని యాడ్స్ ఉపయోగించే రీతిని చూడాలని కోరుకుంటున్నాం. మేధస్సు గల సృజనాత్మక మనస్సులు అన్నీ అద్భుతమైన కంటెంట్‌తో మా ధ్యాసను ఆకర్షించినప్పుడు చాలా బాగుంటుంది.
అర్థం చేసుకునేలాగా, మేము మా సేవకు వ్యాపారప్రకటనల్ని ఎందుకు పరిచయం చేస్తున్నామోనని అనేకమంది తెలుసుకోవాలనుకుంటారు. జవాబు బహుశా ఆశ్చర్యం కలిగించేదేమీ కాదు – మేం డబ్బు సంపాదించాల్సిన అవసరం ఉంది. Snapchatters కు చక్కని కంటెంట్ అందిస్తూనే మా సేవకు మద్దతు ఇవ్వడానికి అడ్వర్టైజింగ్ మాకు వీలు కలిగిస్తుంది. మేం సంపాదించే డబ్బును మేం Snapchat కమ్యూనిటీని మరిన్ని అద్భుతమైన ప్రొడక్ట్‌లతో ఆశ్చర్యపరచడానికి ఉపయోగిస్తామని వాగ్దానం చేస్తున్నాము- అదే మాకు ఇష్టమైన పని!