SnapKit
31 మార్చి, 2020
31 మార్చి, 2020

యాప్ స్టోరీస్ పరిచయం

ఈ రోజు, మేము ఒక కొత్త డెవలపర్ ఉత్పత్తిని ప్రారంభిస్తున్నాము, ఇది Snapchat యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన ఫీచర్లలో ఒకటైన యాప్ స్టోరీస్‌ను ఇతర యాప్‌లలోకి తీసుకువస్తుంది. కంటెంట్ పర్యావరణ వ్యవస్థను నిర్మించడంలో సహాయపడటానికి, వారి ప్లాట్‌ఫామ్‌పై ఎంగేజ్‌మెంట్‌ను పెంచడానికి, మరియు ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగించే కెమెరాలలో ఒకదాన్ని ఉపయోగించుకోవడానికి, యాప్ స్టోరీస్ డెవలపర్‌లను వారి యాప్‌కి స్టోరీలను సులభంగా జోడించడానికి అనుమతిస్తాయి.

ఈ రోజున, మేము ఒక కొత్త డెవలపర్ ఉత్పాదనను ప్రారంభిస్తున్నాము, అది Snapchat యొక్క అత్యంత ప్రముఖ ఫీచర్లలో ఒకదానిని ఇతర యాప్స్ లోనికి తీసుకొస్తుంది: యాస్ స్టోరీస్

వ్యక్తులు తమకు తాముగా వ్యక్తీకరించడానికి ఒక కాన్వాస్‌ని అందిస్తూ స్టోరీస్ అగ్రస్థాయి మొబైల్ ఫార్మాట్‌గా తయారవుతున్నాయి. డెవలపర్లు ఒక కంటెంట్ అనుకూల వ్యవస్థను నిర్మించుకోవడంలో సహాయపడేందుకు, తమ వేదికపై నిమగ్నతను నడపడానికి, మరియు ప్రపంచములో అత్యధికంగా ఉపయోగించబడుతున్న కెమెరాలలో ఒకదానిలోనికి ట్యాప్ చేయడానికై తమ యాప్ కు సులభంగా Stories జోడించేందుకు App Stories వీలు కలిగిస్తుంది.

App Stories తో, మా టెక్నాలజీని అందజేయడం మరియు వారి వేదికలపై కమ్యూనిటీ నిమగ్నతను ముందుకు నడపడం, ప్రతిరోజూ Snapchat కెమెరాను ఓపెన్ చేసే 218MM వ్యక్తులలోనికి ట్యాపింగ్ చేయడం డెవలపర్‌లకు సులభతరం చేస్తుంది.

మరియు Snapచాటర్స్ కోసం, ఉదాహరణకు వారి Triller ప్రొఫైల్‌పై తమ ఇంటి వర్క్‌అవుట్ నుండే Snaps పంపించడం మరియు స్ట్రీమ్ లైన్ చేయడం సులువవుతుంది. లేదా, Snapchat పై కనెక్ట్ కాని ఇతర వ్యక్తులతో Snaps పంచుకోవడం, Hily పై ఒక డేటింగ్ ప్రొఫైల్ కు కంటెంటును జోడించడంలాగా.

మేము అనేక భాగస్థులతో ప్రారంభిస్తున్నాము:

  • Triller - ఇప్పుడు Triller కమ్యూనిటీ తమ అభిమాన కళాకారులు, రూపకర్తలు, మరియు స్నేహితుల నుండి Snapchat Stories నిమగ్నతకు ప్రాప్యతను కలిగి ఉంటారు.

  • Squad - వారి వాడుకదారులు కలిసి ఒక కాల్ లో ఉన్నప్పుడు Snapchat Stories ని సహ-వీక్షణ చేయగలిగి ఉంటారు. Squadలో పబ్లిక్ రూమ్‌లు ఉన్నందు వల్ల, ఆ అనుసంధానత కూడా వాడుకదారులు తమ పరస్పర జీవితాలపై స్టోరీలను చూడడానికి వీలు కలిగిస్తుంది.

  • Hily - Hily ని Snapchat కు కనెక్ట్ చేసే ప్రతి యూజర్ యొక్క ప్రొఫైల్ పై ఒక బార్‌‌లో యాప్ స్టోరీస్ కనిపిస్తాయి. Snapchat Lenses మరియు Filters తో, యాప్ స్టోరీస్ Hily స్టోరీస్‌‌కి గొప్ప జోడింపు అవుతాయి, అవి యాప్‌పై అత్యంత తరచుగా ఉపయోగించబడే ఫీచర్లు అయి ఉంటాయి.

  • Octi - ఇప్పుడు, Snapచాటర్స్ తమ Octi AR ప్రొఫైల్స్ కి నేరుగా కస్టమ్ స్టోరీలను పోస్ట్ చేస్తారు. Snapchat వాడుకదారులు Snapchat యాప్‌లోనే ఉన్న ఒక కొత్త "మై Octi స్టోరీ"ఆప్షన్ కి కేవలం ఒక Snap పంపించవచ్చు. అప్పుడు స్టోరీ ఆటోమేటిక్‌గా Octi AR బెల్ట్‌పై ఒక కథానికగా కనిపిస్తుంది, అది ప్రతి ఒక్కరూ తమ Octi AR బెల్ట్‌పై వీక్షించదగినదిగా ఉంటుంది.

యాప్ స్టోరీస్ అనేది Snap Kit లో భాగము, మూడో పక్షాలు Snapchat తో అనుసంధానతలు నిర్మించుకోవడానికి సహాయపడే డెవలపర్ టూల్స్ యొక్క మా సేకరణ.  అన్ని Snap ప్రొడక్ట్‌ల్లానే, యాప్ స్టోరీస్ గోప్యతా కేంద్రిత విధానముతో డిజైన్ చేయబడింది: Snap మూడో-పక్షం డెవలపర్లతో స్థానిక భౌగోళిక సమాచారము లేదా స్నేహితుల జాబితాలను పంచుకోదు.

వార్తలకు తిరిగి వెళ్లు