టీమ్ Snapchat ఈ నెల ఒడిదుడుకులు లేకుండా ఎదుగుతోంది. వేసవి రాక తనతో పాటుగా టీమ్‌కు వేసవి ఇంజనీరింగ్ ఇంటెర్న్‌లు మరియు ఇతర కొత్త సభ్యులను తీసుకువచ్చింది. అభివృద్ధి వేగాన్ని పుంజుకున్నందుకు మేం ఉత్తేజితం అయ్యాం!
నేడు App Storeలో ఒక కొత్త iOS వెర్షన్ అందుబాటులో ఉంది. ఇందులో బగ్స్ మరియు క్రాష్‌లకు సంబంధించిన కొన్ని కీలకమైన ఫిక్స్‌లున్నాయి, కనుక మీరు సమస్యలను ఎదుర్కొంటూ ఉంటే దయచేసి దానిని డౌన్‌లోడ్ చేసుకోండి.
మేము కూడా ఈ విడుదలలో కొంత కొత్తదనానికి ప్రయత్నిస్తున్నాం. బహుశః మీకు తెలిసినట్లుగా, Snapchat వయోజనులు మరియు పెద్దవాళ్ళ కోసం – 13 సంవత్సరాల లోపు పిల్లలు ఖాతా ఏర్పాటుకు అనుమతించబడరు. మునుపటి iOS అప్‌డేట్ వయస్సు - పరిమితిని ప్రవేశపెట్టింది, అందులో మేం రిజిస్ట్రేషన్ స్క్రీన్ మీద వ్యక్తుల వయస్సును అడిగాము మరియు వయస్సు గనక 13 లోపున ఎంటర్ చేస్తే ముందుకు వెళ్ళడానికి అనుమతించలేదు. ఇది విషయాలను హ్యాండిల్ చేయడానికి మంచి ప్రామాణిక మార్గము, అయితే ఇది చాలా మంచి అనుభవాన్ని ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు, వయస్సు-పరిమితికి అదనంగా, కాస్త భిన్నమైనది ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాము.
కొత్త iOS వెర్షన్‌లో, 13 సంవత్సరాల లోపు పిల్లలు రిజిస్ట్రేషన్ ఫారాన్ని నింపగలుగుతారు, అయితే వారి యూజర్ సమాచారం మాకు పంపించబడదు మరియు ఖాతా ఏర్పాటు చేయబడదు. బదులుగా వాళ్ళు Snapchat వెర్షన్ అయిన “SnapKidz” ఉపయోగించుకోగలుగుతారు, అందులో ఫోటోలు తీసుకోవడం, టైటిల్ పెట్టడం మరియు ఉపకరణముపై స్థానికంగా సేవ్ చేసుకోవడానికి ఒక ఇంటర్‌ఫేస్ ఉంటుంది, అయితే snaps పంపించడానికి లేదా అందుకోవడానికి లేదా స్నేహితుల్ని జోడించడానికి మద్దతు ఇవ్వదు. మేము దానిని మొదట iOS పై ప్రయత్నిస్తున్నాము మరియు అంతా సజావుగా ఉంటేే, రాబోవు Android అప్‌డేట్‌లో దాన్ని చేర్చాలని ఆశిస్తున్నాము.
మేము దాని వద్ద ఉన్నప్పుడు, మేము మా గోప్యతా విధానం నవీకరించాము మా విధానాల కొత్త వెర్షన్ మరింత వివరమైన సమాచారం ఇస్తుందని మేం ఆశిస్తున్నాం. చింతించకండి, Snapలను నిల్వ చేయడం మరియు తొలగించడం సహా మీ సమాచారాన్ని మేము నిర్వహించే విధానాన్ని మేము మార్చలేదు.
మేము కూడా మా ఉపయోగ నిబంధనలుమరియు అప్ డేట్ చేయాల్సిన కొన్ని ఇతర విషయాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. మేము వాడుక షరతులను చదవడానికి మరియు అర్థం చేసుకోవడానికీ సులభతరం చేయడాన్ని కొనసాగిస్తాం కాబట్టి వాటిని సమయానుగుణంగా సవరిస్తూ ఉంటాము.
సంతోషంగా Snapping చేయండి!