ఈ వారం, భఆరతదేశంలో ఎదుగుతున్న మా Snap చాటర్స్ కమ్యూనిటీ మరియు మేం రూపొందించిన బలమైన భాగస్వామ్యాలను వేడుక చేసుకునేందుకు మేం ఒక వర్చువల్ ఈవెంట్ నిర్వహించాం.
మీరు ప్రపంచంలో ఎక్కడ ఉన్నప్పటికీ, Snapchat సాంస్కృతికంగా తమకు తగినదనే భావన కలిగించాలని మేం ఎల్లప్పుడూ విశ్వసిస్తాం. భాషల నుండి కంటెంట్ వరకు, క్రియేటర్ల నుంచి AR వరకు, మా టీమ్ గత సంవత్సరకాలంలో మా భారతీయ కమ్యూనిటీ స్వీకరించగల అనుభవాన్ని రూపొందించడంలో ఎంతో కష్టపడి పనిచేస్తోంది.
వర్చువల్ ఈవెంట్‌లో, మా ప్రస్తుత భాగస్వాముల అద్భుతమైన పనిని హైలైట్ చేశాం, అలానే కొంతమంది కొత్త వారి గురించి కొన్ని ఆసక్తికరమైన వార్తలను మేం పంచుకున్నాం.
Discover విషయానికి వస్తే, మేం Snap ఒరిజినల్ సిరీస్, ఫోన్ స్వాప్ హిందీ అనుసరణను మేం రూపొందిస్తున్నాం, మరియు అనుష్క సేన్, రఫ్తార్, రుహి సింగ్ మరియు వీర్ దాస్ వంటి ప్రముఖులతో కూడిన కొత్త ప్రత్యేక కార్యక్రమాలున్నాయి. ఈ షోలు 2021లో వస్తాయి.
అందరికీ తెలిసిన మరియు ఇష్టపడే -Ludo Club కస్టమ్ వెర్షన్ సృష్టిస్తున్న మా మొదటి భారతదేశపు Snap గేమ్స్ భాగస్వామి MoonFrog ల్యాబ్స్‌కు స్వాగతం పలుకుతున్నందుకు మాకు సంతోషంగా ఉంది. మా హిట్ గేమ్ Ready Chef Goకు ఇండియన్ కిచెన్ ఛాలెంజ్ ‘Dosa Dash’ని జోడించడానికి మేం Mojiworksలోని బృందంతో కలిసి పని చేస్తున్నాం!
చివరగా, NDTV మరియు Alt Balajiతో Snap కిట్ ఇంటిగ్రేషన్‌లతో, Snapచాటర్స్ బ్రేకింగ్ న్యూస్, వారు చూస్తున్న షోలు, ధర పోలిక సమాచారం, చివరికి దేశవ్యాప్తంగా రైలులో ప్రయాణించేటప్పుడు వారి రియల్ టైమ్ ETA వరకు ప్రతిదీ పంచుకోగలుగుతారు!
గత సంవత్సరం దాదాపు 150% రోజువారీ యాక్టివ్ యూజర్ గ్రోత్‌తో*, ఇది కేవలం ప్రారంభం మాత్రమే. మా కమ్యూనిటీ ఈ కొత్త ఫీచర్లు మరియు అనుభవాలను ఆస్వాదిస్తుందని మేం ఆశిస్తున్నాం మరియు మేం సహకారం అందించే సృజనాత్మక భాగస్వాములందరికీ ధన్యవాదాలు చెప్పాలని అనుకుంటున్నాం.
* Snap Inc ఇంటర్నల్ డేటా, Q3 2019 vs Q3 2020