21 జులై, 2023
21 జులై, 2023

2023 మహిళల ప్రపంచ కప్ సంబరాలు జరుపుకొంటున్నాము

కొత్త AR, క్రియేటివ్ టూల్స్ మరియు కంటెంట్‌తో Snapchat, మహిళా ప్రపంచ కప్ జట్లు మరియు ఆటగాళ్ళను మీకు మరింత సన్నిహితంగా చేస్తోంది.

2023 ప్రపంచ కప్ ఈ వారంలో ప్రారంభమవుతుంది, మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న Snapచాటర్లకు, అందమైన ఈ క్రీడను ఆస్వాదించేందుకు, వేడుక జరుపుకొనేందుకు మరియు దానిలో నిమగ్నమయ్యేందుకు కొత్త మార్గాలు.

ఈ వారంనుండి ప్రారంభమవుతున్న, 750 మిలిు్యన్లకు పైగా ప్రజలు ఉన్న Snapచాట్ గ్లోబల్ కమ్యూనిటీ, మహిళా సాకర్ పట్ల తమ అభిమానాన్ని, మద్దతును ఈవేదికపై లభ్యమయ్యే హత్తుకొనే అనుభవాల ద్వారా ప్రదర్శించవచ్చు. U.S. మహిళల జాతీయ జట్టు (USWNT)తో ఈ రకపు మొదటి AR అనుభవంనుండి, మహిళా లెన్స్ సృష్టికర్తలు నిర్మించిన నూతన AR లెన్స్ వరకు, ఆకర్షణీయమైన క్రియేటివ్ టూల్స్ వరకు, మహిళలు ఈ ప్రపంచ కప్‌ను మర్చిపోలేని ఒక గొప్ప సంఘటనగా జరుపుకొనేందుకు Snapchat కమ్యూనిటీని మేము ప్రోత్సహిస్తున్నాము.

"మహిళా క్రీడలను ప్రోత్సహించడానికి మా నిబద్ధతను కొనసాగిస్తూ, అభిమానులను తమకిష్టమైన జాతీయ జట్లు మరియు క్రీడాకారులు, ఈ ప్రపంచస్థాయి వేదికలో ఒకరితో మరొకరు తలపడుతున్నప్పుడు వారికి మరింత చేరువగా తెచ్చేందుకు Snapchat, 2023 ప్రపంచ కప్‌లో ఒక భాగంకావడం గర్వంగా భావిస్తోంది. మరింతగా నిమగ్నంచేసే కంటెంట్, సృష్టికర్త సహకారాలు మరియు నూతన, సృజనాత్మకమైన AR అనుభవాల ద్వారా, Snapచాటర్లు, ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా తమ ఫుట్‌బాల్ అభిమానాన్ని వెల్లడించేందుకు ఒక అసమానమైన అవకాశాన్ని పొందుతారు." ఎమ్మా వేక్లీ, స్పోర్ట్స్ పార్ట్‌నర్‌షిప్స్, Snap Inc.

AR అనుభవాలు

ఈ సంవత్సరం Snapchat, U.S. సాకర్ మరియు USWNT సహకారంతో నిర్మించిన ఒక సృజనాత్మక AR లెన్సెస్ ప్రవేశపెడుతోంది. ఈ సృజనాత్మక USWNT 'టీమ్ ట్రాకర్' లెన్సెస్, USWNT రోస్టర్, గణాంకాలు, వార్తలు, సరదా వాస్తవాలు, మరియు వాస్తవ సమయంలో అప్‌డేట్ చేయబడే ముఖ్యాంశాల 3D Bitmoji అవతారాలతో అభుమానులను జట్టుకు మరింత దగ్గరగా తీసుకొని వచ్చేందుకు AR టెక్నాలజీని ఉపయోగిస్తుంది.

ప్రపంచ కప్‌లో పాల్గొనే ప్రతి జట్టుకు గ్లోబల్ AR లెన్సెస్ లభ్యమవుతాయి, దీనివల్ల ఎక్కడవున్న Snapచాటర్లు అయినా తమ దేశం గురించి గర్వంగా చెప్పుకోగలరు.

  • గ్లోబల్ ఫ్యాన్ సెల్ఫీ అనుభవంళ్ : పాల్గొనే ప్రతి దేశానికి ఉండే ఒక భిన్నమైన సెల్ఫీ లెన్సెస్‌ను చూసేందుకు Snapచాటర్లు ’ఎక్రాస్ ది గ్లోబ్’ ను స్క్రోల్ చేయవచ్చు. ఈ లెన్సెస్, ARలో ప్రత్యేకత కలిగివున్న మహిళచే నడపబడుతున్న ఒక డచ్ XR డిజైన్ స్టూడియో, VideOrbitలో, మహిళా లెన్సెస్ సృష్టికర్తలచే సృష్టించబడింది మరియు ఉత్పత్తి చేయబడిందని మీతో పంచుకొనేందుకు మేము గర్విస్తున్నాము.

  • FIFA లెన్సెస్: FIFA Fancestry క్విజ్‌ను కలిగివుండే ఒక కొత్త AR లెన్సెస్, దీనితో Snapచాటర్లు తాము మద్దతిచ్చేందుకు అత్యుత్తమమైన ఏదేశాలు సరైనవో కనుక్కోగలరు!

  • USWNT జెర్సీ ట్రై-ఆన్ లెన్సెస్: Snap యొక్క దుస్తులను లైవ్‌లో బదిలీచే అందించే సాంకేతికతతో Snapచాటర్లు, అధికార 2023 USWNT జెర్సీలో వారు ఎలా ఉంటారో చూసుకోగలరు.

  • Togethxr AR లెన్సెస్: సమానత్వం, వైవిధ్యం, మరియు పెట్టుబడులతో మహిళా అథ్లెట్లు మరియు మహిళా క్రీడలను ప్రోత్సహించే, అలెక్స్ మోర్గాన్, క్లో కిమ్, సిమోన్ మాన్యుయెల్ మరియు స్యూ బర్డ్ స్థాపించిన మీడియా మరియు కామర్స్ కంపెనీ, Togethxr భాగస్వామ్యంలోని ఒక కొత్త లెన్సెస్. Togethxr లెన్సెస్, VideOrbitచే నిర్మించబడింది మరియు మహిళా క్రీడలకు మద్దతు మరియు వత్తాసు పలుకుతుంది.

క్రియేటివ్ టూల్స్

క్రియేటివ్ టూల్స్ యొక్క ఒక పూర్తి సెట్, టోర్నమెంట్‌లో ఎవరైనా తమ అభిమాని అనుభవాన్ని పెంచుకొనేందుకు దోహదం చేస్తుంది!

  • Bitmoji: అడిడాస్ సహకారంతో, Snapచాటర్లు Bitmoji అవతారాలను ఎంచుకొన్న, అధికార ఫుట్‌బాల్ కిట్లలో డ్రెస్ చేసుకొని, తమ స్వంత జట్టుకు మద్దతు ఇవ్వవచ్చు.

    • అధికార జట్టు కిట్లు, అడిడాస్ ఫ్యాన్ గేర్‌ విభాగంలో: కొలంబియా, కోస్టారికా, ఇటలీ, జమైకా, ఫిలిప్పీన్స్, స్వీడన్, అర్జెంటీనా, జర్మనీ, జపాన్, మరియు స్పెయిన్ జట్లకు లభ్యమవుతున్నాయి.

    • అధికార జట్టు కిట్లు ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, దక్షిణ కొరియా, నెదర్లాండ్స్, న్యూజీలాండ్, నైజీరియా, నార్వే, పోర్చుగల్ మరియు USA లకు లభ్యమవుతున్నాయి.

    • అదనపు దేశాల కిట్లు Bitmoji ఫ్యాన్ గేర్‌లో ఈ దేశాలకు లభ్యమవుతున్నాయి: చైనా, డెన్మార్క్, ఐర్లాండ్, హైతి, మొరాకో, దక్షిణ ఆఫ్రికా, స్విట్జర్లాండ్, వియత్నాం, మరియు జాంబియా.

  • స్టిక్కర్లు మరియు ఫిల్టర్లు: ఫ్రెండ్స్‌తో చాట్ చేయండి మరియు ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, నార్వే, USA, స్వీడన్, నైజీరియా, న్యూజీలాండ్ మరియు స్పెయిన్‌ల మహిళా జాతీయ జట్టు స్టిక్కర్లు మరియు ఫిల్టర్లతో సహా పాల్గొనే ప్రతిదేశానికి ఉండే స్టిక్కర్లు మరియు ఫిల్టర్లతో మీ Snaps అలంకరించండి.

  • కేమియోలు: Snapchat సంభాషణలు మరింత వ్యక్తిగతంగా మరియు ఆహ్లాదకరంగా చేసేందుకు మీ కేమియోను చేర్చడి. కేమియోలు ప్రతి జట్టుకు లభ్యమవుతున్నాయి మరియు అడిడాస్‌తో మా భాగస్వామ్యంతో ఈ దేశాలకు అధికార జాతీయ జట్టు కిట్లు అందుబాటులో ఉన్నాయి: అర్జెంటీనా, కొలంబియా, కోస్టారికా, జర్మనీ, ఇటలీ, జమైకా, జపాన్, ఫిలిప్పీన్స్, స్పెయిన్ మరియు స్వీడన్.

కంటెంట్

మీడియా భాగస్వాములు మరియు కంటెంట్ సృష్టికర్తల నుండి అన్ని గోల్స్, హైలైట్స్, మరియు తెర వెనుక జరిగే దృశ్యాల యాక్షన్ చూడండి.

  • U.S. సాకర్ యాప్ ఇంటిగ్రేషన్: అభిమానులు, ఒక కొత్త లెన్సెస్ ఉపయోగించి, ఆర్టికల్‌ని ప్రివ్యూ చేయడానికి మరియు వారి స్పందనలను తీసుకోవడానికి, U.S. సాకర్ యాప్ నుండి నేరుగా, తమ Snapchat స్టోరీకి U.S. సాకర్ వార్తలు పోస్ట్ చేయవచ్చు.

  • షోలు: స్టోరీస్ పేజీలో ‘ఆఫ్‌సైడ్ స్పెషల్’ అనే ఒక నూతన మరియు వారానికి రెండు సార్లు ఉండే షోను Togethxr ప్రొడ్యూస్ చేస్తుంది. మహిళా సాకర్‌కు సంబంధించిన ఆన్-ఫీల్డ్ మాయాజాలంనుండి ఆఫ్-ఫీల్డ్ క్షణాలవరకు మరియు స్టోరీలైన్స్ ఆస్వాదించండి.

    • UKలో ITV మరియు ఆస్ట్రేలియాలో ఆప్టస్ స్పోర్ట్ , స్టోరీస్ టాబ్‌లో అధికారిక ప్రపంచ కప్ హైలైట్స్ అందిస్తాయి.

  • Snap స్టార్స్ మరియు సృష్టికర్తలు: Snapchatters, Alisha Lehmann, Asisat Oshoala, Jordyn Huitema, Julia Grosso, Madison Hammond, Megan Reyes, Ryann Torrero, మరియు Antonioలతో సహా తమకిష్టమైన ఫుట్‌బాలర్లు, ప్రొఫెషనల్ అథ్లెట్లను అనుసరిస్తూ ప్రత్యేకమైన, ఆన్-ది-గ్రౌండ్ కంటెంట్ మరియు స్టోరీస్ మరియు స్పాట్‌లైట్‌ల సృష్టికర్తలను యాక్సెస్ చేయవచ్చు.

    • U.S. సాకర్ కూడా ఈ టోర్నమెంట్‌ జరిగినంతకాలం తమ Snap స్టార్ ప్రొఫైల్‌కు నిరంతర అప్‌డేట్లు మరియు కంటెంట్ పోస్ట్ చేస్తుంటుంది.

  • స్పాట్‌లైట్ సవాళ్లు: USలోని Snapchatters, మహిళా సాకర్-ఆధారిత స్పాట్‌లైట్ సవాళ్లకు తమ ఉత్తమ Snapsకు సమర్పించినందుకు $30,000 భాగాన్ని గెలుచుకొనే అవకాశం కలిగివుంటారు. వీటిలో:

    • #TeamSpirit (19-25 జులై) - మీకిష్టమైన మహిళా సాకర్ జట్టుకు మీ అభిమానాన్ని ప్రదర్శించండి!

    • #గోల్‌సంబరం (జులై 31-ఆగస్ట్ 6) - ఒక ఐకానిక్ మహిళా సాకర్ గోల్ సంబరాన్ని తిరిగి సృష్టించేందుకు డైరెక్టర్ మోడ్ ఉపయోగించండి!

    • #SoccerWatchParty (ఆగస్ట్ 17-21) - మీ మహిళా సాకర్ వాచ్ పార్టీని ప్రదర్శించేందుకు ఒక లొకేషన్ ట్యాగ్ ఉపయోగించండి!

  • Snap మ్యాప్: ప్రతి మ్యాచ్, వాచ్ పార్టీ, సంబరం మరియు మరెన్నింటికో Snap మ్యాప్‌పై క్యురేట్ చేయబడిన స్టోరీస్.


మిమ్మల్ని అక్కడ కలుస్తాం! 👻⚽

వార్తలకు తిరిగి వెల్దాం