మేము మొదట Chat ని ప్రారంభించినప్పుడు, ముఖాముఖి సంభాషణలోని అత్యుత్తమ భాగాలను అనుకరించడం మా లక్ష్యంగా ఉండేది. చాట్ 1.0 ఇక్కడ ఉండే సంతోషాలన్నింటి గురించి — మీ స్నేహితుడు టైపింగ్ అని అనేక యాప్స్ మీకు చెప్పినప్పుడు, మీ స్నేహితుడు వింటున్నారని చాట్ మీకు తెలియజేసింది. రెండు సంవత్సరాల తర్వాత, వ్యక్తులు ఎలా మాట్లాడతారనే దాని గురించి మేము ఎంతో తెలుసుకున్నాము, ఐతే మా లక్ష్యం ఏ మాత్రం మార్పు లేకుండా అలాగే ఉండిపోయింది. సంభాషించుకోవడానికి చాట్ అత్యుత్తమ మార్గం కావాలని మేము అనుకున్నాము — రెండోది మాత్రమే ముఖా-ముఖిగా తగ్గట్టు నిలిచింది.
ఈరోజు చాట్ 2.0 పరిచయం చేయడానికి మేం ఎంతగానో సంతోషిస్తున్నాం. కొన్ని చాట్స్ పంపించడం ద్వారా మీరు మొదలుపెట్టవచ్చు, మీ స్నేహితుడు కనిపించినప్పుడు, ఒక్కసారి తట్టడం ద్వారా మాట్లాడడం లేదా వీడియో చాటింగ్ మొదలుపెట్టండి. మీరు ఒక పాట వినిపించాలనుకుంటే మీ స్నేహితుడు దాన్ని వినవచ్చు, లేదా మీరు వారికి కొత్త పప్పీని చూపించాలనుకుంటే చూడవచ్చు. వారు అక్కడ లేకుంటే, మీరు చెప్పాలనుకున్న విషయాన్ని త్వరగా ఒక ఆడియో నోట్ పంపించొచ్చు. మరి కొన్నిసార్లైతే దాన్ని ఒక స్టిక్కర్ బాగా చెబుతుంది :)
కొత్త చాట్ గురించి మాకు బాగా ఇష్టమైనది ఏమిటంటే, కమ్యూనికేట్ చేసే ఈ మార్గాలన్నింటి మధ్య —మీరు వ్యక్తిగతంగా చేసేవిధంగా ఎంతో సులభంగా మారవచ్చు. అది సాధ్యమైనప్పుడు, మీరు టెక్ట్స్ చేయరు, కాల్ చేయరు లేదా వీడియో చాటింగ్ చేయరు...కేవలం మాట్లాడతారు, అంతే. మేము ఈ రీడిజైన్ మీద కొంతవరకు పని చేస్తున్నాము — మీరు ఏమనుకుంటున్నారో వినేందుకు మేం ఆతురతగా ఎదురు చూస్తున్నాం!
మీ స్నేహితుల్ని పట్టుకోవడానికి అత్యంత వేగవంతమైన మార్గమైన ఆటో-అడ్వాన్స్ స్టోరీస్‌ని కూడా మేం పరిచయం చేస్తున్నాము. మీరు ఒక స్టోరీని పూర్తి చేసినప్పుడు, తర్వాత దానంతట అదే మొదలవుతుంది — వదిలి ముందుకు వెళ్ళడానికి కేవలం స్వైప్ చేయండి లేదా బయటికి వెళ్ళడానికి క్రిందికి లాగండి.
చివరగా, కొన్ని విషయాలను స్పష్టం చేస్తూ, రాబోయే అద్భుతమైన కొత్త ఉత్పత్తులకు పునాదులు వేస్తూ, మా సేవా షరతులు మరియు గోప్యత పాలసీని పునరుద్ధరిస్తున్నాము. దానిపై మరింత కోసం గోప్యతా సెంటర్ చెక్ చేయండి!