Snapవద్ద ఉండే గోప్యత, భద్రత, మరియు పారదర్శకతలు మేము వీటిపట్ల ఎల్లప్పుడూ ఎంత శ్రద్ధ వహిస్తామో తెలియజేస్తాయి. మేము మా కమ్యూనిటీ సభ్యులందరికీ రక్షణ కల్పిస్తూ, మా టీనేజ్ Snapచాటర్లకు అదనపు రక్షణలను అందిస్తున్నాము. యూరోపియన్ యూనియన్ యొక్క డిజిటల్ సేవల చట్టం (DSA) సూత్రాలు, మా దీర్ఘకాలిక విలువలతో అలైన్ చేయబడి ఉన్నాయి మరియు ఒక సురక్షితమైన ఆన్‌లైన్ పర్యావరణాన్ని సృష్టించేందుకు వాటి లక్ష్యాలను పంచుకొంటాము.
ఆగస్ట్ 25 నాటికి, మేము మా DSA అవసరాలకు కట్టుబడి ఉంటామని మేము హామీ ఇస్తున్నాము, మరియు యూరోపియన్ యూనియన్ (EU) లోని మా Snapచాటర్లకు దిగువ వాటితో సహా అనేక అప్‌డేట్లను చేస్తున్నాము:
1. Snapచాటర్లకు, వారికి చూపించే కంటెంట్‌ను నియంత్రించేందుకు సామర్థ్యాన్ని ఇవ్వడం.
Snapchat అనేది ప్రధానంగా ఒక దృశ్య సందేశ వేదిక. Snapchatలో, విస్తృత స్థాయిలోని ఆడియన్స్‌కు మేము చూపించే పబ్లిక్ కంటెంట్‌లో భాగంలో రెండు భాగాలు ఉంటాయి - స్టోరీస్ ట్యాబ్‌లోని డిస్కవర్ సెక్షన్ మరియు స్పాట్‌లైట్ ట్యాబ్. ఈ విభాగాలలో చూపించే కంటెంట్ వీక్షకులకు పర్సనలైజ్ చేయబడినది, ఇది ప్రజలకు వారికి సంబంధించిన అనుభవం అందిస్తుంది. మా కమ్యూనిటీకి చూపించేందుకు అర్హమైన కంటెంట్ ఏది అనేదానిపై మేము పారదర్శకంగా ఉన్నాము - మరియు సిఫారసు చేయడానికి అర్హమైన కంటెంట్‌కు మేము ఉన్నత ప్రమాణాన్ని నిర్ధారిస్తున్నాము.
మా DSA ప్రతిస్పందనలో భాగంగా, EUలోని Snapచాటర్లందరూ, వారికి ఇప్పుడు కంటెంట్ ఎందుకు చూపబడుతోందో సరిగ్గా అర్థం చేసుకొనే సామర్థ్యాన్ని కలిగివుంటారు మరియు పర్సనలైజ్ చేయబడిన డిస్కవర్ మరియు స్పాట్‌లైట్ కంటెంట్ అనుభవంనుండి చూడకుండా ఉండే ఐఛ్ఛికాన్ని కలిగి ఉంటారు. Snapchat పై పర్సనలైజేషన్ ఏవిధంగా పనిచేస్తుందో వివరించడానికి మేము ఒక సాధారణ మార్గదర్శిని రూపొందించాము.
2. కంటెంట్ లేదా అకౌంట్ తొలగించేందుకు ఒక కొత్త నోటిఫికేషన్ మరియు అప్పీల్స్ ప్రక్రియ
Snapchatను ఉపయోగించేటప్పుడు ప్రతి ఒక్కరూ మేము కలిగివున్న ఖచ్చితమైన కమ్యూనిటీ మార్గదర్శకాలను అందరూ అనుసరిస్తారని మేము ఆశిస్తున్నాము. ఈ మార్గదర్శకాలను ఉల్లంఘించే కంటెంట్ లేదా ఖాతాలు వేటిగురించైనా మా ఇన్-యాప్ లేదా ఆన్‌లైన్ రిపోర్టింగ్ టూల్స్ ద్వారా ఎవరైనా సులభంగా రిపోర్ట్ చేయవచ్చు.
ఇప్పుడు మేము ప్రజలకు వారి అకౌంట్ మరియు కొంత కంటెంట్ ఎందుకు తొలగించబడినదో మేము తెలియజేస్తాము మరియు ఈ నిర్ణయం గురించి అప్పీల్ చేయడానికి సులభంగా అనుమతిస్తాము. ఈ ఫీచర్లు, రాబోయే నెలల్లో మా ప్రపంచ కమ్యూనిటీకి అందజేయడానికి ముందు, ప్రారంభంలో EUలోని Snapచాటర్లకు అందుబాటులో ఉంటాయి.
DSAలో భాగంగా, మేము EU-ఆధారిత అకౌంట్స్ లేదా కంటెంట్ గురించి అమలుపరచే నిర్ణయాలపై నిర్ధారిత సమాచారాన్ని అందించే యూరోపియన్ కమిషన్ యొక్క ట్రాన్స్‌పరెన్సీ APIతో ఇంటిగ్రేషన్‌ను కూడా నిర్మిస్తున్నాము.
3. మా అడ్వర్టైజింగ్‌ను అప్‌డేట్ చేయడం
ఈ నెల ప్రారంభంలో మేము ప్రకటించిన విధంగా, EU మరియు UKలోని Snapచాటర్లకు మా అడ్వర్టైజింగ్‌కు సంబంధించి మేము ఎన్నో అప్‌డేట్లు చేస్తున్నాము, వీటిలో:
1. EU మరియు UKలోని 13 - 17 సంవత్సరాల వయస్సు ఉన్న Snapచాటర్లకు పర్సనలైజేషన్ చేయబడిన అడ్వర్టైజింగ్‌ను పరిమితం చేయడం - EU మరియు UKలోని 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న Snapచాటర్లకు, ప్రకటనలను పర్సనలైజ్ చేసేందుకు అడ్వర్టైజర్లకు, లక్ష్యం చేసుకొనే మరియు ఆప్టిమైజేషన్ టూల్స్ వారికి లభ్యతలో ఉండవు.
EUలోని 18+ సంవత్సరాల వయస్సు ఉన్న Snapచాటర్లకు ఒక కొత్త స్థాయి అడ్వర్టైజింగ్ పారదర్శకత మరియు నియంత్రణను అందిస్తున్నాము - "నేను ఈ యాడ్ ఎందుకు చూస్తున్నాను" పై ట్యాప్ చేయడమనేది, EUలోని Snapచాటర్లు ఇప్పుడు వారికి ఆ యాడ్ ఎందుకు చూపబడుతోందో అనేదాని గురించి మరిన్ని వివరాలను అందజేయడంతో పాటు, ఈ Snapచాటర్లు వారికి చూపించబడే యాడ్స్ యొక్క పర్సనలైజేషన్‌ను పరిమితం చేసుకోగలుగుతారు. ఇది, Snapచాటర్లు కలిగివున్న, యాడ్స్ మెనూలోని కొన్ని రకాలైన యాడ్స్ దాచివేయడం మరియు వారికి కేటాయించబడిన Snap జీవనశైలి ఆసక్తి వర్గాలను ఎడిట్ చేసుకోవడంవంటి ప్రస్తుతమున్న అడ్వర్టైజింగ్ నియంత్రణలకు అదనంగా చేర్చబడుతోంది.
EU లక్షిత అడ్వర్టైజ్‌మెంట్లకు ఒక లైబ్రరీ సృష్టించడం - ఈ డిజిటల్ లైబ్రరీలో EUలో చూపబడే యాడ్స్ ఎవరైనా శోధించబచ్చు మరియు యాడ్‌కు ఎవరు చెల్లించారు, సృజనాత్మక దృశ్యాన్ని, ప్రచారం పొడవు, EU దేశంవారీగా అది పొందిన వీక్షణలు, మరియు వర్తింపజేసిన లక్ష్యం గురించి సమాచారంవంటి వివరాలను చూడవచ్చు.
బాధ్యతలకు కట్టుబాటు
మేము DSAకు కట్టుబడి ఉంటామని నిర్ధారించడానికి, మా DSA అవసరాలకు బాధ్యతవహించే మరియు వ్యాపారంలోని వివిధ భాగాలకు బాధ్యతను నియంత్రించేందుకు మేము DSA అధికారులను నియమించాము.
సాధారణంగా, సరైన పని చేస్తూ, వారి ఉత్పత్తులకు మరియు ప్లాట్‌ఫార్మ్స్‌కు బాధ్యత వహిస్తూ, వ్యాపారాలను నిర్వహించడమనేది ఏవిధమైన నియంత్రణలకు సరిపోవన్నది మా విశ్వాసం.
అందువల్లనే, మేము మా ప్లాట్‌ఫామ్స్ మరియు ఫీచర్లను నిర్మించే సమయంలో ఒక భద్రత మరియు గోప్యతా డిజైన్ విధానాన్ని అనుసరిస్తాము మరియు ప్రజలు సురక్షితంగా, దృశ్యరూపంలో తమను తాము వ్యక్తపరచి, అందరూ కలిసి ఆనందాన్ని ఆస్వాదించేందుకు ఒక ప్లాట్‌ఫామ్‌గా ఉండేందుకు మేము కట్టుబడి ఉన్నాము.