11 ఫిబ్రవరి, 2020
11 ఫిబ్రవరి, 2020

Here For Youని పరిచయం చేస్తున్నాము

రాబోయే నెలల్లో ప్రారంభించబడే Here For You, Snap చాటర్‌లు ఆందోళన, డిప్రెషన్, ఒత్తిడి, దుఃఖం, ఆత్మహత్య ఆలోచనలు మరియు బెదిరింపులకు సంబంధించిన కొన్ని అంశాల కోసం శోధించినప్పుడు స్థానిక నిపుణుల నుండి భద్రతా వనరులను చూపుతుంది.

మన నిజమైన స్నేహితులతో ఫోటోలు మరియు వీడియోలతో మాట్లాడడం అనేది టెక్ట్సింగ్ కంటే మరింత వ్యక్తిగతంగా మరియు వినోదాత్మకంగా ఉంటుందనే అనే నమ్మకంపై Snapchat స్థాపించబడింది. మేము మా ఫ్లాట్‌ఫారాన్ని నెలకొల్పి కొనసాగిస్తున్న సమయం నుండీ, ఆప్తమిత్రులు తమకు తాము స్వేచ్ఛగా వ్యక్తీకరించుకోవడం మరియు కలిసి సృజనాత్మకంగా ఉండటం – మరియు దీనిని వారు సురక్షితంగా చేయగలిగేలా సాయపడాలనే మా కీలకమైన మిషన్ నుంచి మేం ఎన్నడూ దూరంగా జరగలేదు.

గోప్యత, భద్రత మరియు మా కమ్యూనిటీ యొక్క సంక్షేమాన్ని చూసుకోవడం అనేవి మా విలువలు మరియు ఉత్పాదన సిద్ధాంతములో వేళ్ళూనుకుపోయి ఉన్నాయి. Snapchat తన మూలం నుండి గోప్యతతో నిర్మించబడింది — అశాశ్వతంతో మొదలుపెట్టి — వ్యక్తులు ఇతరులచే నియంత్రణ ఒత్తిడిలో ఉండకుండా తమకు తాముగా ఉండేందుకు రూపొందించబడింది. ఉదాహరణకు, మేము, గోప్యత-మరియు భద్రత డిజైన్ విధానమును ఉపయోగించి కొత్త ఉత్పత్తులు మరియు ఫీచర్లను అభివృద్ధి చేస్తాం, మేం Snapచాటర్స్ డేటాతో జాగ్రత్తగా మరియు సున్నితంగా వ్యవహరిస్తాం, మా ఫ్లాట్‌ఫారాన్ని నకిలీ వార్తలు మరియు తప్పుడు సమాచారము నుండి రక్షించుటకు పనిచేయుటలో మేం సానుకూలంగా ఉన్నాం.

ఇదంతా, మా ఫ్లాట్‌ఫారం ఉపయోగించే వ్యక్తుల జీవితాలపై ఒక సానుకూల ప్రభావం చూపేందుకు సహాయపడాలని మేము భావించే బాధ్యతను తెలియజేస్తుంది. ఈ రోజున, సురక్షిత ఇంటర్నెట్ దినోత్సవాన్ని గౌరవ సూచకంగా, ఈ బాధ్యతను కొనసాగించడానికి మేం అనేక వనరులు ప్రకటిస్తున్నాం. మేం Here For You అనే కొత్త ఫీచర్ ప్రారంభిస్తున్నాం, ఇది మానసిక ఆరోగ్యం లేదా భావోద్వేగ సంక్షోభాన్ని అనుభవిస్తున్న, లేదా ఈ సమస్యల గురించి మరియు వాటితో వ్యవహరించుటకు స్నేహితులకు ఎలా సహాయపడాలనే దాని గురించి మరింత తెలుసుకోవాలనే ఉత్సాహంతో ఉన్న Snapchattersకు ముందస్తు చొరవతో ఇన్-యాప్ మద్దతును అందిస్తుంది.

రాబోవు నెలల్లో అమలులోని రానున్న Here For You, ఉత్సుకత, క్రుంగుబాటు, ఒత్తిడి, విచారము, ఆత్మహత్య ఆలోచనలు మరియు బెదిరింపుతో సహా కొన్ని అంశాల కొరకు Snapచాటర్స్ సర్ఫ్ చేసినప్పుడు స్థానికనిపుణుల నుండి భద్రతా వనరులను చూపిస్తుంది.

ఈ రోజున, Snapచాటర్స్, భద్రత మరియు గోప్యతను పెంపొందించే సృజనాత్మక టూల్స్ మరియు Lensesతో నిమగ్నం కాగలుగుతున్నారు, వాటిలో కొత్త ఫిల్టర్లు మరియు మా మొట్టమొదటి Snappable క్విజ్ ఉంటాయి.

ఈ కొత్త ఫిల్టర్లు మరియు క్విజ్ పరిశీలించాల్సిందిగానూ — ఒక సురక్షితమైన ఇంటర్నెట్ ఏర్పరచడానికి మా వంతు కృషి చేయడంలో మాతో చేరాల్సిందిగానూ మేం Snapchatters అందరినీ ప్రోత్సహిస్తున్నాం!

వార్తలకు తిరిగి వెళ్లు