ప్రతిరోజూ మిలియన్లకొద్దీ ప్రజలు తమ స్నేహితుల్ని కలవడానికి మరియు ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన కథల్ని చూడడానికి Snap మ్యాప్ ఉపయోగిస్తున్నారు. ఈరోజు మేము Explore ని పరిచయం చేస్తున్నాము — ఇది మీ Snap Map పై ఏమి జరుగుతుందో తెలియజేసే మీ పర్యటన మార్గదర్శి. మొదలుపెట్టడానికి కేవలం ‘న్యూస్ అప్‌డేట్’లపై తట్టండి.
స్నేహితులు ఒక రోడ్ పర్యటనకు వెళ్లినా, ఒక కొత్త చోటుకు విహరించినా, ఇంకా - ఒక ల్యాండ్‌మార్క్‌ని సందర్శించినా లేదా ఒక పెద్ద పండుగకు హాజరైనా Explore అప్‌డేట్‌లు ఆటోమేటిక్ గా ప్రత్యక్షమవుతాయి. ఒక్కసారి తట్టడం ద్వారా ట్యాప్ తో, మీరు ఒక కొత్త సంభాషణను మొదలుపెట్టవచ్చు. బ్రేకింగ్ న్యూస్, వేడుకలు మరియు పోకడలు వంటి వాటిని చూడాలనుకున్న ఇతర క్షణాల కోసం కూడా మీకు అప్‌డేట్‌లు వస్తాయి.
Snap మ్యాప్ పై మీతో తమ లొకేషన్ పంచుకునే స్నేహితుల నుండి మాత్రమే అప్‌డేట్‌లను ఎక్స్‌ప్లోరర్ కలిగి ఉంటుంది. Snap మ్యాప్‌పై మీ లొకేషన్ పంచుకోవడమనేది ఎంచుకునేది — కాబట్టి మీరు ఇంతకుముందు Snap మ్యాప్ సందర్శించకుంటే లేదా ఈరోజున ఘోస్ట్ మోడ్‌లో ఉంటే, మీ స్నేహితులు మీ లొకేషన్ చూడలేరు.
తర్వాతి కొద్ది వారాలలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న Snapచాటర్‌లకు ఎక్స్‌ప్లోరర్ అందుబాటులోనికి వస్తుంది.
సంతోషంగా ఎక్స్‌ప్లోర్ చేయండి!