27 డిసెంబర్, 2013
27 డిసెంబర్, 2013

ఫోన్ నంబర్‌లతో స్నేహితులను కనుగొనడం

గత సంవత్సరంలో మేము ఫోన్ నంబర్‌ల ద్వారా స్నేహితులను కనుగొనడానికి వివిధ రక్షణలను అమలు చేసాము. మేము ఇటీవల అదనపు ప్రతిఘటన చర్యలను జోడించాము మరియు స్పామ్, దుర్వినియోగాన్ని ఎదుర్కోవడానికి మెరుగుదలలు చేస్తూనే ఉన్నాము.

అప్పుడప్పుడూ కంప్యూటర్ భద్రతా నిపుణులు మరియు ఇతర సహాయకర వ్యక్తులు Snapchat లో సంభావ్య బగ్స్ మరియు బలహీనతల గురించి మమ్మల్ని అడుగుతుంటారు. బాధ్యతాయుతమైన వెల్లడింపును ఆచరిస్తున్న నిపుణుల సహాయం పట్ల మేము కృతజ్ఞులుగా ఉంటాము మరియు మమ్మల్ని సంప్రదించిన వ్యక్తులతో సాధారణంగా మేము బాగా పని చేశాము.

ఈ వారం క్రిస్మస్ సందర్భంగా, మా ప్రైవేటు API కోసం ఒక సెక్యూరిటీ గ్రూపు డాక్యుమెంటేషన్ పోస్టు చేసింది. ఈ డాక్యుమెంటేషన్‌లో, Snapchat యూజర్‌నేమ్‌లు మరియు ఫోన్ నెంబర్‌ల డేటాబేస్‌ని సంగ్రహించుకోగల ఒక సంభావ్య దాడికి సంబంధించిన ఒక ఆరోపణ ఉంది.

మా ఫైండ్ ఫ్రెండ్స్ ఫీచర్, యూజర్‌లు తమ అడ్రస్ బుక్ కాంటాక్టులను Snapchatకు అప్‌లోడ్ చేయడానికి వీలు కలిగిస్తుంది, తద్వారా, అడ్రస్ బుక్ లోని ఫోన్ నెంబర్‌తో సరిపోయే Snapchatters ఖాతాలను మేం ప్రదర్శించవచ్చు. మీ Snapchat ఖాతాకు ఫోన్ నెంబరును జోడించడమనేది ఆప్షనల్, అయితే మీ స్నేహితులు మిమ్మల్ని కనుక్కోవడానికి ఇది సహాయకారిగా ఉంటుంది. మేము ఫోన్ నెంబర్‌లను ఇతర యూజర్‌లకు చూపించం మరియు ఒకరి యూజర్‌నేమ్ ఆధారంగా ఫోన్ నెంబర్‌లను చూడగల సామర్థ్యానికి మేం మద్దతు ఇవ్వం.

సిద్ధాంతపరంగా, ఎవరైనా ఏరియా కోడ్‌లోని ప్రతి నెంబర్ వలే, లేదా U.S.లో సాధ్యమైన ప్రతి నెంబర్‌లాగా భారీ సంఖ్యలో ఫోన్ నంబర్లను అప్‌లోడ్ చేయగలిగి ఉంటే, వాళ్ళు ఫలితాల డేటాబేస్ రూపొందించవచ్చు, ఆ విధంగా ఫోన్ నెంబర్‌లకు యూజర్‌నేమ్‌లను జత చేయవచ్చు. అలా చేయడం మరింత కష్టమయ్యేలా చేయడానికి గడచిన సంవత్సరంలో మేం వివిధ రక్షణ పద్ధతులను అమలు చేశాం. స్పామ్ మరియు దుర్వినియోగాన్ని ఎదుర్కోవడానికి మేము ఇటీవల అదనపు ప్రతిచర్యలను జోడించాము, మెరుగుదలలు చేయడం కొనసాగిస్తున్నాము.

సంతోషంగా Snapping చేయండి!

వార్తలకు తిరిగి వెళ్లు