ఈ రోజున, సంస్కృతి, వయస్సు, మరియు సాంకేతికతలు స్నేహం చుట్టూ ప్రాధాన్యతలు మరియు దృక్పథాలను ఎలా తీర్చిదిద్దుతాయో తెలుసుకోవడానికై, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, మలేషియా, సౌదీ అరేబియా, యుకె మరియు యుఎస్ వ్యాప్తంగా 10,000 మంది యొక్క ఒక ప్రపంచ అధ్యయనమును విడుదల చేశాము. స్నేహంపై ప్రపంచవ్యాప్తంగా పది మంది నిపుణులు డేటాను సందర్భోచితం చేయడానికి రిపోర్టుకు దోహదపడ్డారు.
“మీ నిజమైన స్నేహితులతో స్వీయ-వ్యక్తీకరణ మరియు లోతైన సంబంధ బాంధవ్యాలను సక్రియపరచడానికై ఒక వేదికగా చేసుకునే ఉద్దేశ్యముతో Snapchat రూపొందించబడింది, అది స్నేహం లోని సంక్లిష్టతలు మరియు సంస్కృతుల వ్యాప్తంగా వ్యత్యాసాలలో మా ఆసక్తిని ముందుకు తీసుకు వెళ్ళింది,” అన్నారు ఎమీ మౌస్సవీ, వినియోగదారు గ్రాహ్యతల అధిపతి, Snap Inc. “ప్రపంచవ్యాప్తంగా స్నేహం చాలా భిన్నమైనదిగా కనిపిస్తుండగా, మన సంతోషంలో అది కీలక పాత్ర పోషిస్తుందని మాకు తెలుసు మరియు Snapchat ద్వారా దానిని జరుపుకొని పెంచడానికి కొత్త మార్గాలను కనుక్కోవడానికి మేము ఎంతగానో నిబద్ధులై నిలిచి ఉంటాము"
సర్వే చేసిన అన్ని విపణుల వ్యాప్తంగా, ప్రజల సగటు సామాజిక వలయము 4.3 ఉత్తమ స్నేహితులు, 7.2 మంచి స్నేహితులు మరియు 20.4 సహచరులను కలిగి ఉంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధికులు తమ జీవితాంతపు ఉత్తమ స్నేహితుల్ని సగటు వయసు 21. లో కలుసుకుంటారు. “నిజాయితీ” మరియు “అధీకృతం” అనేవి ఒక ఉత్తమ స్నేహితుని యొక్క అతి ముఖ్యమైన లక్షణాలుగానూ మరియు స్నేహితుల్ని చేసుకునేటప్పుడు “గ్రాహ్యత కోసం ఒక పెద్ద సామాజిక నెట్‌వర్క్ కలిగి ఉండడం” అనేది అత్యల్ప ప్రాముఖ్యత కల విషయం అని రెస్పాండెంట్లు పేర్కొన్నారు.
స్నేహం రిపోర్టు వీటితో సహా స్నేహం యొక్క స్వభావముపై కొత్త కాంతిని వెదజల్లుతుంది:
స్నేహముపై విభిన్న సంస్కృతుల యొక్క భాష్యం స్నేహ వలయాలు మరియు విలువలను ఎలా ప్రభావితం చేస్తుంది.
సంతోషానికి స్నేహం ఎలా లింక్ చేయబడింది, ఐతే మనం పంచుకునే సూక్ష్మ నైపుణ్యాలు ఏవి మరియు స్నేహితులతో మాట్లాడేటప్పుడు మనకు ఏమనిపిస్తుంది అనేవి గణనీయంగా మన వలయపు పరిమాణం, లింగం, తరం మరియు మరెన్నింటిపైనో ఆధారపడి ఉంటాయి.
మనం జన్మించిన తరం స్నేహం పట్ల మన దృక్పథాలను భారీగా ప్రభావితం చేస్తుంది—మరియు Gen Z తమ చేరువను ఒక చిన్న సమూహం యొక్క సన్నిహితత్వం మరియు సాన్నిహిత్యం తరఫున విస్తృత వ్యాప్త నెట్‌వర్క్ ల కొరకు సహస్రాబ్ది ఆకాంక్ష నుండి దూరంగా సర్దుబాటు చేస్తోంది.
“ఇతర సంబంధబాంధవ్యాల నుండి స్నేహాలను వ్యత్యాసం చేసి చూపే పెద్ద విషయం, అవి స్వచ్ఛందం అనే వాస్తవం,” అన్నారు, థెరపిస్టు మరియు స్నేహ పరిశోధకులు మిరియం కిర్మాయేర్. “మన కుటుంబము, భాగస్వాములు, మరియు పిల్లలతో సంబంధబాంధవ్యాల వలె కాకుండా, మన స్నేహితులతో ఎటువంటి టోకు ఆకాంక్ష ఉండదు, అది మనం పరస్పరం ఇముడ్చుకొని ఉండాల్సిన విషయం. మనం మన స్నేహాలలో పెట్టుబడి చేయడాన్ని నిరంతరం ఎంచుకోవాల్సి ఉంది—నిమగ్నమై ఉండేందుకు మరియు చూపించుకునేందుకు. ఇది మన స్నేహాలను సంతోషం మరియు ఆత్మగౌరవం దిశగా ఎక్కువ ప్రభావితం చేసేందుకు గాను నిరంతరం కొనసాగే నిర్నిబంధమైన ఎంపిక అవుతుంది."
ఈ ప్రపంచవ్యాప్త సర్వే నుండి పొందిన గ్రాహ్యతల యొక్క నమూనాలో ఇవి ఉన్నాయి:
సాంస్కృతిక ప్రభావం
ఇండియా, మధ్యప్రాచ్యం మరియు ఆగ్నేయాసియాలో, ప్రజలు యూరోపియన్ దేశాలు, యు.ఎస్., మరియు ఆస్ట్రేలియా కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉత్తమ స్నేహితులు ఉన్నట్టు చెబుతుంటారు. సౌదీ అరేబియా 6.6, తో ఉత్తమ స్నేహితుల యొక్క అత్యధిక సంఖ్యను కలిగి ఉండగా, యు.కె. అత్యల్పంగా 2.6. కలిగి ఉంది. 3.1 ఉత్తమ స్నేహితులతో యుఎస్ లోని ప్రజలు రెండవ అత్యల్ప సగటు సంఖ్యను కలిగి ఉన్నారు, మరియు కేవలం ఒక్క ఉత్తమ స్నేహితుడిని రిపోర్టు చేసే మరే ఇతర దేశము కంటే ఎక్కువ కలిగి ఉన్నారు.
"తెలివైన మరియు సంస్కృతి గల" స్నేహితులను కలిగి ఉండడానికి ఇండియా, మధ్య ప్రాచ్యం, మరియు ఆగ్నేయాసియాలో ఎక్కువ విలువ ఇవ్వబడుతోంది, కాగా "నిర్ణయాత్మకంగా లేకుండడం" అనేదానికి యుఎస్, యూరప్ మరియు ఆస్ట్రేలియాలో ఎక్కువ విలువ ఉంది.
ఒక ఉత్తమ స్నేహితుడిని కలిగి ఉండేందుకు ఒక "పెద్ద సామాజిక నెట్‌వర్క్" ఒక ఆవశ్యక లక్షణము అని చెప్పే ఇతర ప్రాంతాల కంటే దాదాపుగా నాలుగురెట్లు ఎక్కువ ఇండియా, మధ్య ప్రాచ్యం, మరియు ఆగ్నేయాసియాలో ఉన్నారు. వాస్తవానికి, ప్రపంచవ్యాప్త సగటుపై, "పెద్ద సామాజిక నెట్‌వర్క్ కలిగిఉండడం" అనేది ఉత్తమ స్నేహితుడిని పొందడానికి అత్యల్ప ప్రాముఖ్యత కలిగిన లక్షణము.
స్నేహ వలయాలు మరియు కమ్యూనికేషన్
ప్రపంచవ్యాప్తంగా 88% ప్రజలు తమ స్నేహితులతో ఆన్‌లైన్ లో మాట్లాడటం ఆనందిస్తారు. మా రెస్పాండెంట్లు ఆన్‌లైన్ కమ్యూనికేషన్ లో ఏమి ఆనందిస్తున్నారో వివరించడానికి అనేక ఆప్షన్లను ఎంపిక చేసుకోగలుగుతున్నారు, మరియు ప్రయోజనాల గురించి ఒక అంగీకారం ఉంది. అన్ని ప్రాంతాల వ్యాప్తంగా, 32% ప్రజలు తమకు ఇష్టమైన వివరణగా "తమ స్నేహితులతో వేగంగా మరియు మరింత సులభంగా మాట్లాడే"సమర్థతను ఎంచుకుంటున్నారు.
ముఖాముఖీగా గానీ ఆన్‌లైన్ లో కానీ స్నేహితులతో మాట్లాడడం మనల్ని అత్యంత సానుకూల భావోద్వేగాలలో లీనం చేస్తుంది: “సంతోషంగా,” “ఇష్టంగా,” మరియు “మద్దతునిచ్చింది” అనే మూడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమందిచే చెప్పబడ్డాయి. అయినప్పటికీ, ఆన్‌లైన్ సంభాషణలను అనుసరించి పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఈ భావోద్వేగాలను అనుభూతి చెందుతున్నారు.
స్నేహితుల రకాల సగటు సంఖ్య విషయానికి వచ్చినప్పుడు, ఎక్కువ బహిరంగ వేదికల వాడుకదారులు పెద్ద సమూహాల కనెక్షన్లను కలిగినట్లుగా, ఐతే ప్రైవేటు కమ్యూనికేషన్ వేదికలను అనుసరించే వారికంటే తక్కువ నిజమైన స్నేహితుల్ని కలిగియున్నట్లుగా మనం చూస్తున్నాము. Snapchat యూజర్లు అత్యధిక సంఖ్యలో “ఉత్తమ స్నేహితులు” మరియు “ఆప్త మిత్రులు,” మరియు స్వల్ప సంఖ్యలో “పరిచయస్థుల”ను కలిగి ఉన్నారు, కాగా Facebook యూజర్లు స్వల్ప సంఖ్యలో “ఉత్తమ స్నేహితులు;” మరియు Instagram యూజర్లు అత్యధిక సంఖ్యలో “పరిచయస్థులను” కలిగి ఉన్నారు.
తరానికి సంబంధించిన ప్రభావాలు
ప్రపంచవ్యాప్తంగా, Gen Z మరియు మిలీనియల్స్ తమ స్నేహితులతో ఆన్‌లైన్ మాట్లాడడానికి ఇష్టపడడంలో ఆశ్చర్యం లేని రీతిలో ధృఢంగా ఉన్నారు—Gen X 13% తో మరియు బేబీ బూమర్స్ 26% తో పోలిస్తే వరుసగా కేవలం 7% మరియు 6% మంది మాత్రమే దానిని ఆనందించనట్లు చెప్పారు. యువతరం కూడా దృశ్య సమాచార వినిమయములో విలువను చూస్తున్నారు—తాము మాటల్లో చెప్పలేని రీతిలో తాము చెప్పాలనుకుంటున్న దానిని వ్యక్తపరచడానికి వీడియో మరియు ఫోటోలు సహాయపడుతున్నాయని 61% మంది నమ్ముతున్నారు.
పరిశోధన వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా మిలీనియన్లు అత్యధికంగా తరాల యొక్క "సంతోషాన్ని పంచుకుంటున్నారు" కాబట్టి అగ్రస్థానములో వస్తున్నారు. సర్వే చేయబడిన వర్గాలన్నింటి పైకీ, "నేను దానిని పంచుకోను" అని చెప్పేందుకు మిలీనియన్లు అతితక్కువ అవకాశం ఇస్తున్నారు. మరే ఇతర తరం కంటే కూడా ఎక్కువగా మిలీనియన్లు ఇన్‌స్టాగ్రామ్ లేదా ఫేస్‌బుక్ వంటి వేదికల ద్వారా సమస్యలను బహిరంగంగా పంచుకుంటారు. పైపెచ్చుగా, వాళ్ళు విస్తృతమైన సోషల్ నెట్‌వర్క్ కలిగియున్న ఒక మంచి స్నేహితుణ్ణి మరింత ఎక్కువగా కోరుకుంటున్నారు. మరే ఇతర తరం కంటే కూడా ఎక్కువగా మిలీనియన్లు "సాధ్యమైనంత ఎక్కువ మంది స్నేహితులు" ఉండాలని కోరుకుంటున్నారు.
Gen Z మిలీనియన్ల అడుగుజాడల్లో నడుస్తున్నట్లు అగుపించడం లేదు, బదులుగా వాళ్ళు తమ స్నేహములో సాన్నిహిత్యం కోరుకుంటున్నారు, మరియు మరే ఇతర తరం కంటే కూడా స్వేచ్ఛాయుత మరియు నిజాయితీ సంబంధాలను ఆశపడుతున్నారు.
తమ ప్రాణస్నేహితులతో చర్చించే అంశాలకు సంబంధించి బూమర్లు అత్యంత సాంప్రదాయంగా ఉంటారు, అది మళ్ళీ మిలీయన్లకు విరుద్ధం. బూమర్లలో మూడో వంతుకు పైగా తమ ప్రాణ స్నేహితుడితో తమ ప్రేమ జీవితం (45%), మానసిక ఆరోగ్యం (40%), లేదా డబ్బు సమస్యలు (39%) గురించి మాట్లాడేందుకు ఇష్టపడనట్లు చెబుతారు. మిలీనియన్లలో వరుసగా కేవలం 16%, 21%, మరియు 23% మాత్రమే ఇవే అంశాల గురించి తమ ప్రాణ స్నేహితులతో మాట్లాడరు.
పూర్తి Snap గ్లోబల్ స్నేహం రిపోర్టును చదవడానికి, ఇక్కడ క్లిక్ చేయండి.
రిపోర్టు గురించి
ప్రొటీన్ ఏజెన్సీ తో భాగస్వామ్యములో రూపొందించబడిన స్నేహం రిపోర్టు, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, మలేషియా, సౌదీ అరేబియా, యుఎఇ, యు.కె. మరియు యు.ఎస్. లలోని 13 నుండి 75 మధ్య వయస్కులు 10,000 మంది జాతీయవ్యాప్త ప్రాతినిధ్యమును పోల్ చేసుకొంది. యు.ఎస్. లో, 2019 ఏప్రిల్ నెలలో 2,004 మంది రెస్పాండెంట్లు ఈ సర్వేలో పాల్గొన్నారు. రెస్పాండెంట్లు Snapchat వాడే వినియోగదారుల నుండి యాదృచ్ఛిక నమూనాగా ఎంపిక చేసుకోబడ్డారు; వారు ప్రధానంగా ఆయా తరాల బృందాలు Gen Z, మిలీనియల్స్, Gen X మరియు బేబీ బూమర్స్ గా విడగొట్టబడ్డారు, మరియు స్నేహంపై వారి ఆలోచనలపై సర్వే చేయబడ్డారు. స్నేహం రిపోర్టు ప్రపంచవ్యాప్తంగా మరియు తరాల వ్యాప్తంగా కొత్తగా కనుగొన్న అంశాలను విడుదల చేసింది, కాగా మన జీవితాలపై టెక్నాలజీ యొక్క ప్రభావమును కూడా ఎత్తి చూపింది.