జర్మన్ పునరేకీకరణ దినం: Snapchat ఆగ్మెంటేడ్ రియాలిటీ ద్వారా కొత్త దిగంతాలను తెరుస్తుంది
సంస్కృతి మరియు పౌర సమాజ భాగస్వామ్యంతో Snapchat వైవిధ్యం, సహనం మరియు ఐక్యతా సందేశాన్ని పంపిస్తోంది.
జర్మన్ పునరేకీకరణ దినోత్సవం, తూర్పు మరియు పశ్చిమ జర్మనీల పునరేకీకరణను జాతిమొత్తం సంబరంగా జరుపుకొనే ఒక ప్రముఖ కార్యక్రమం. ఈ సంవత్సరపు కార్యక్రమం హాంబర్గ్‌లో "దిగంతాలను తెరవండి" అనే ప్రధానోద్దేశ్యంతో జరుగుతుంది. ఈ వేడుకలలో భాగంగా, Snapchat, వైవిధ్యం, సహనం మరియు ఐక్యత అనే సందేశాన్ని పంపుతోంది - ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR) కి ధన్యవాదాలు.
ఈ సంవత్సర సందేశం "దిగంతాలను తెరవండి" ని ప్రతిబింబిస్తూ, కమ్యూనిటీ AR లెన్స్ ఉపయోగించి తమ పేరుతోపాటు "నేను జర్మన్ ఐక్యతలో భాగం" అనే సందేశాన్ని ప్రదర్శించేందుకు AR లెన్స్ సాధికారతను అందిస్తుంది. ఈ లెన్స్, జర్మనీలో పెరిగిపోతున్న సామాజికంగా జరుగుతున్న ఏకీకరణపట్ల మరింత అవగాహన కల్పించేందుకు మరియు ఐక్యతకు సంకేతంగా రూపొందించబడింది. విద్యా ఉద్యమం GermanDream వ్యవస్థాపకుడు Düzen Tekkal మరియు SCORING GIRLS* ప్రాజెక్టుకు సాధికారత కల్పించేందుకు కృషి సలిపిన మాజీ Bundesliga ఆటగాడు Tuğba Tekkalతో కలిసి, Snapchat కమ్యూనిటీ, "నేను ఐక్యమైన జర్మనీలో భాగం" అనే సందేశాన్ని ఒక AR లెన్స్ సహాయంతో దిగంతాలపై ప్రదర్శించి, తద్వారా, జర్మనీలో పెరుగుతున్న సామాజిక ఏకీకరణపట్ల అవగాహన పెంపొందించేందుకు దోహదం చేస్తుంది.

"జర్మన సమాజం ఐక్యంగా ఉండటమనేది, ఇంతకుముందుకంటే ఇప్పుడు ఎంతో ముఖ్యం. 15 మిలియన్ల నెలవారీ క్రియాశీల వినియోగదారులు, యువత మరియు వైవిధ్యభరితమైన కమ్యూనిటీని కలిగివున్న జర్మనీలో, గౌరవప్రదమైన మరియు స్నేహపూర్వక సంభాషణలను ప్రోత్సహించేందుకు Snapchat అంకితమై ఉంది. Snap Inc.లో పబ్లిక్ పాలసీ DACH హెడ్ Lennart Wetzel ఈ సందర్భంగా మాట్లాడుతూ, మా ఆగ్మెంటేడ్ రియాలిటీ సాంకేతికత, సామాజికపరమైన చారిత్రాత్మక మరియు ప్రస్తుత అంశాలను తీసుకొనివచ్చేందుకు మరియు వాటి ప్రాధాన్యతను తిరిగి జ్ఞాపకం చేసుకొనేందుకు, ఈ సందర్భంలో అక్టోబర్ 3 - జనరేషన్ Z కోసం" యొక్క ప్రాశస్త్యాన్ని వివరించేందుకు అవకాశాన్ని కల్పిస్తుంది" అన్నారు.
AR అనుభవం ఆకాశంలో ఒక సందేశాన్ని సృష్టిస్తుంది.
AR లెన్స్, Snapఛాటర్లు, తమ పేరుతోపాటు తమ సందేశం "నేను జర్మన్ ఐక్యతలో భాగం" అనే సందేశాన్ని ఆకాశంలో వర్చువల్ పద్ధతిలో చూసేందుకు మరియు దానిని తమ కమ్యూనిటీతో షేర్ చేసుకోవడానికి స్కై సెగ్మెంటేషన్ సాంకేతికతను ఉపయోగిస్తుంది. ప్రధానంగా సెలవులకొరకు అభివృద్ధి చేయబడిన ఈ లెన్స్, ఈ AR అనుభవంలో, "I"ని "We”గా మార్చడంద్వారా, వినియోగదారుల ఫ్రెండ్స్‌ను మిళితంచేసే ఇతర ఇంటరాక్టివ్ అంశాలను ఉపయోగిస్తుంది.

Snapఛాటర్లు, ఈ లెన్స్‌ను వారందరీకీ పంపబడే అక్టోబర్ 3న పంపబడే ఒక పుష్ నోటిఫికేషన్ పొందడంద్వారా, మరియు Snapchat న్యూస్‌రూమ్, హాంబర్గ్ నగర కేంద్రంలో మరియు వివిధ సృష్టికర్త ప్రొఫైల్స్‌పై ప్రదర్శించబడే ప్రకటనలద్వారా కనుగొనవచ్చు.

మేము హాంబర్గ్‌లో జర్మన్ పునరేకీకరణ దినోత్సవం జరుపుకోవడానికి మరియు వైవిధ్యం, సహనం మరియు ఐక్యతా సందేశాన్ని వైవిధ్యభరితమైన మా కమ్యూనిటీద్వారా జర్మనీ మొత్తం వ్యాపింపజేసేందుకు ఎదురుచూస్తున్నాము.