ప్రపంచములోని అత్యంత సృజనాత్మక మీడియా కంపెనీలలో కొన్నింటి నుండి మా కమ్యూనిటీ అత్యంత ఉన్నతమైన కంటెంట్ ఆస్వాదించడానికై ఒక కొత్త మార్గముగా Snapchat పై పబ్లిషర్ స్టోరీస్ ప్రారంభించి ఇప్పటికి దాదాపుగా మూడు సంవత్సరాలు అయింది.
నేడు, మేం పబ్లిష్టర్ స్టోరీస్‌ని స్కూలు న్యూస్‌పేపర్‌ల్లో చేర్చడానికి విస్తరిస్తున్నాం. తమ క్యాంపస్ కమ్యూనిటీలకు తెలియజేయడం మరియు వినోదం కల్పించడంలో స్కూలు న్యూస్‌పేపర్‌లు ఒక కీలక భూమికను పోషిస్తాయి, మరియు తరచుగా మేము పని చేస్తున్న అనేకమంది అగ్రస్థాయి పాత్రికేయులు మరియు సంపాదకులు తమ వ్యాసంగాన్ని అక్కడే ప్రారంభించారు.
మేము డజన్ల కొద్దీ కాలేజీలు మరియు యూనివర్సిటీలతో భాగస్వామ్యం కలిగి ఉన్నాం, వారి సంపాదకీయ టీములు ప్రతివారం పబ్లిషర్ స్టోరీస్ ఉత్పత్తి చేయడం మొదలుపెట్టి వాటిని Snapchatపై పంపిణీ చేస్తారు. ప్రతి స్కూలు, రాబడి పంచుకొనే ఒప్పందం ద్వారా తన న్యూస్‌పేపర్ నిధులు సమకూర్చుకొని ఎదగడానికి సహాయపడేందుకై ఈ స్టోరీస్‌లో Snap యాడ్స్ ఉంటాయి.
తర్వాతి తరం పాత్రికేయులను సాధికారపరచడానికి గాను దేశవ్యాప్తంగా ప్రతిభావంతులైన విద్యార్థులతో భాగస్వామ్యం వహించడం పట్ల మేము గౌరవం పొందాము, మరియు వాళ్ళు ఏమి రూపొందిస్తారనే దాని కొరకు చాలా ఆతురతగా ఎదురుచూస్తున్నాం!