మీరు మరియు మీ స్నేహితులు ప్రపంచాన్ని చూసే మార్గాన్ని Snapchat ఎల్లప్పుడూ సంబరంగా జరుపుకొంది. స్నాప్స్, స్టోరీస్ మరియు మా కథ ద్వారా విభిన్న దృక్కోణాలను అనుభవించడమనేది ఒక వినోదం.
ఈరోజు మేం డిస్కవరీని పరిచయం చేస్తున్నాం.
Snapchat డిస్కవరీ అనేది, విభిన్న సంపాదకవర్గ బృందాల నుండి కథలను వెలికితీయడానికి ఒక కొత్త మార్గము. ఇది, మొదట వృత్తాంతాన్ని ఉంచే స్టోరీ టెల్లింగ్ ఫార్మాట్ రూపొందించడానికి మీడియాలోని ప్రపంచ శ్రేణి దిగ్గజాలతో సమన్వయ ఫలితము. ఇది సోషల్ మీడియా కాదు.
ఏది అత్యంత తాజాయో లేదా ఏది అత్యంత ప్రముఖమో అనేదాని ఆధారంగా ఏది చదవాలో సోషల్ మీడియా కంపెనీలు మనకు చెబుతాయి. దానిని మేము విభిన్నంగా చూస్తాము. ఏది ముఖ్యమో నిర్ణయించడానికి క్లిక్‌లు లేదా షేర్‌లపై కాకుండా మేం ఎడిటర్‌లు మరియు ఆర్టిస్ట్‌లను పరిగణనలోకి తీసుకుంటాం.
డిస్కవరీ అనేది సృజనాత్మకత కొరకు రూపొందించబడింది కనుక ఇది విభిన్నమైనది. ఆర్టిస్ట్‌లు తమ వర్క్‌ని పంచుకోవడానికి తరచుగా కొత్త టెక్నాలజీలను అలవరచుకోవలసిందిగా ఒత్తిడి చేయబడతారు. ఈసారి మేము కళకు సేవ చేయడానికి టెక్నాలజీని నిర్మించాము: ప్రతి ఎడిషన్ పూర్తి స్క్రీన్ ఫోటోలు మరియు వీడియోలు, అద్భుతమైన సుదీర్ఘ లేఅవుట్‌లు మరియు అందమైన వ్యాపారప్రకటనలు ఉంటాయి.
డిస్కవరీ కొత్తది, ఐతే సుపరిచితమైనది. అందువల్లనే స్టోరీలు కీలకమైనవి - అక్కడ ప్రారంభం, మధ్య మరియు ముగింపు ఉంటుంది, తద్వారా సంపాదకులు ప్రతిదీ క్రమంగా ఉంచగలుగుతారు. ప్రతి ఎడిషన్ 24 గంటల తర్వాత రీఫ్రెష్ చేయబడుతుంది - ఎందుకంటే ఈ రోజు కొత్త విషయం రేపటి చరిత్ర అవుతుంది.
డిస్కవరీ ఉపయోగించడం వినోదం మరియు సులభం. ఒక ఎడిషన్ ఓపెన్ చేయడానికి తట్టండి, Snaps బ్రౌజ్ చేయడానికి ఎడమవైపుకు స్వైప్ చేయండి లేదా మరిన్ని కొరకు ఒక Snapపై పైకి స్వైప్ చేయండి. ప్రతి ఛానల్ మీకు కొంత ప్రత్యేకతను అందిస్తుంది - ఒక అద్భుతమైన రోజువారీ ఆశ్చర్యం!