మేం టెక్ట్సింగ్ కంటే తక్కువ మరియు మరింత ఎక్కువగా హ్యాంగ్అవుట్‌లా అనిపించేలా Chatని రూపొందించాం. అందుకనే ఒక స్నేహితుడు చాట్ ఓపెన్ చేసినప్పుడు, "నేనిక్కడ ఉన్నాను" వారి Bitmoji పాప్అప్ అవుతుంది —మరియు అందువల్లనే డిఫాల్ట్‌గా మీ సంభాషణలు ఎప్పటికీ సేవ్ చేయబడవు..
నేడు, మేము చాట్‌ని మరింత వినోదదాయకంగా చేస్తున్నాము. ఇప్పుడు మీరు ఒకేసారి 16 మంది స్నేహితుల వరకు వీడియో చాట్ చేయవచ్చు. మీ స్నేహితుల్ని కలపడానికి ఒక గ్రూప్ చాట్‌లో కేవలం వీడియో కెమెరా ఐకాన్‌పై తాకండి! గ్రూప్ చాట్‌లో చేరాల్సిందిగా గ్రూప్‌లోని స్నేహితులను ఆహ్వానిస్తూ వారికి ఒక నోటిఫికేషన్ వస్తుంది.
మీరు ఎలా వ్యక్తీకరిస్తారనేది మీ ఇష్టం. మీరు Lenses వాడవచ్చు, కేవలం మీ వాయిస్‌తో చేరవచ్చు, లేదా ఇతరులు మాట్లాడేటప్పుడు కేవలం వారు వినేలా సందేశాలు పంపించవచ్చు. ప్రతి సంభాషణ ప్రత్యేకమైనది!
ప్రపంచవ్యాప్తంగా Snapchatters ని చేరుకునేలా గ్రూప్ వీడియో చాట్ ఈ వారం మొదలవుతుంది.
సంతోషంగా చాటింగ్ చేయండి!