29 నవంబర్, 2017
29 నవంబర్, 2017

కొత్త Snapchatని పరిచయం చేస్తున్నాము

ఈ రోజు మేము కొత్త మరియు మెరుగైన Snapchatని ప్రకటిస్తున్నాము - ఇది మీ సంబంధాల చుట్టూ నిర్వహించబడుతుంది మరియు మీ కోసం వ్యక్తిగతీకరించబడింది! ఇప్పటి వరకు, సోషల్ మీడియా ఎల్లప్పుడూ మీ స్నేహితుల నుండి ఫోటోలు మరియు వీడియోలను ప్రచురణకర్తలు మరియు సృష్టికర్తల కంటెంట్‌తో మిళితం చేసింది.

ఈ రోజున మేము ఒక కొత్త మరియు మెరుగైన Snapchat ని ప్రకటిస్తున్నాము - మీ సంబంధాల చుట్టూ ఏర్పాటు చేయబడినది, మీ కోసమే వ్యక్తిగతీకరించబడింది!

ఇప్పటివరకూ, సోషల్ మీడియా ఎప్పుడూ మీ స్నేహితుల నుండి ఫోటోలు మరియు వీడియోలను పబ్లిషర్‌లు మరియు క్రియేటర్‌‌ల నుంచి కంటెంట్‌తో ఎప్పుడూ కలిపేసింది. నిపుణులైన కంటెంట్ క్రియేటర్‌లు మరియు మీ స్నేహితుల మధ్య తేడా ఒక ఆసక్తిదాయకమైన ఇంటర్నెట్ ప్రయోగము కాగా, అది కొన్ని వింతైన దుష్ప్రభావాలను కలిగించింది (నకిలీ వార్తల లాగా) మరియు కేవలం మనకు మనం వ్యక్తీకరించడం కాకుండా మన స్నేహితుల కోసం నిర్వర్తించాలని మనం భావించేలా చేసింది.

కొత్త Snapchat మీడియా నుండి సోషల్‌ని వేరు చేస్తుంది. అంటే దీని అర్థం, మీ స్నేహితుల నుండి Chats మరియు స్టోరీస్ Snapchat ఎడమవైపున ఉంటాయి, పబ్లిషర్‌లు, క్రియేటర్‌లు, మరియు కమ్యూనిటీ నుండి స్టోరీస్ కుడి వైపున ఉంటాయి.

Snapchat మరింత వ్యక్తిగతమైనదిగా అనిపించేలా మేం కాస్త కొత్తదనాన్ని కనుగొన్నాము: అదే డైనమిక్ Friends పేజీ. కెమెరాకు ఎడమవైపున ఉండే కొత్త స్నేహితుల పేజీ మీ స్నేహితులతో మీరు కమ్యూనికేట్ చేసే పద్ధతి ఆధారంగా వారిని ప్రదర్శిస్తుంది.

మీరు స్నేహితులతో మాట్లాడాలనుకున్నప్పుడు, మాట్లాడాలనుకుంటున్న వారిని కనుక్కోవడానికి సులభతరం చేసే మరింత అధునాతనమైన ప్రాణస్నేహితుల అల్గారిధంగా దానిని అనుకోవచ్చు. సరైన వ్యక్తిని కనుక్కోవడానికి మన చాట్స్ గుండా అంతులేకుండా స్క్రోలింగ్ చేసిన నిరాశాజనకమైన అనుభవాన్ని చవిచూశాము - ఇప్పుడు మీ స్నేహితులు మీరు మాట్లాడాలనుకుంటున్న క్రమపద్ధతిలో జాబితా చేయబడతారు. మీ స్నేహితులను ప్రదర్శించడానికై ఉత్తమ పద్ధతిని తెలుసుకోవడానికి ఫ్రెండ్స్ పేజీకి కొంత సమయం పట్టవచ్చు, అయితే ఫలితాలు మాత్రం తగ్గట్టుగా ఉంటాయి!

కెమెరాకు కుడి వైపున ఉన్న కొత్త డిస్కవరీ పేజీలో పబ్లిషర్‌లు, క్రియేటర్‌లు మరియు కమ్యూనిటీ నుంచి స్టోరీస్ ఉంటాయి. మీ సబ్‌స్క్రిప్షన్లు పై భాగములో ఉంటాయి, తదుపరి మీరు చూడడానికి ఆసక్తి ఉండే ఇతర స్టోరీస్ ఉంటాయి. కొంత కాలానికి, Discover మీకోసం ప్రత్యేకంగా వ్యక్తిగతీకరించబడుతుంది. Discover పై స్టోరీస్ అల్గారిధం వారీగా వ్యక్తిగతీకృతం చేయగా, పేజీపై ప్రోత్సహించబడే ప్రతి విషయాన్నీ మా క్యూరేటర్లు సమీక్షించి ఆమోదిస్తారు. మానవ సమీక్ష మరియు యాంత్రిక వ్యక్తిగతీకరణ సమతుల్యత మొబైల్‌పై ఉత్తమ కంటెంట్ అనుభవాన్ని ఇస్తుందని మేం నమ్ముతున్నాం.

మరియు, ఎప్పటి లాగానే, ఒక క్షణాన్ని స్నేహితులతో పంచుకోవడానికి అత్యంత వేగవంతం చేస్తూ Cameraకు Snapchat ఓపెన్ అవుతుంది.

మీడియా నుండి సోషల్‌ని వేరు చేయడం అనేది - నేడు ఇంటర్నెట్‌కు వ్యాపించిన అనేక సమస్యలను ప్రస్తావిస్తూనే, స్నేహితులతో కమ్యూనికేట్ చేసుకునే ఉత్తమ మార్గాన్ని నిర్మించుకోవడానికి మరియు కంటెంట్ వీక్షించడానికీ మాకు ఉత్తమమైన మార్గాన్ని ఇచ్చింది.

ఈ మార్పులను మేం అనుభవించినంతగా మీరూ ఆనందిస్తారని మేము ఆశిస్తున్నాము - ఇది ఒక సరికొత్త Snapchat!

సంతోషంగా స్నాపింగ్ చేయండి!

వార్తలకు తిరిగి వెళ్లు