కాస్త సరియైన విషయాన్ని పోస్ట్ చేయడానికి ప్రజలు ఒత్తిడికి గురవుతున్న అనుభూతిలో ఉన్న సమయంలో సోషల్ మీడియా ఉధృతంగా ఉన్నప్పుడు Snapchat రూపొందించబడింది. లైక్లు, వ్యాఖ్యలు మరియు అనుచరులతో వాడుకదారులు వేటాడుతుండగా సోషల్ మీడియా ప్రజాదరణ పొందిన పోటీగా మారుతూ ఉండినది.
అందుకు భిన్నంగా ఉండటానికి Snapchat రూపొందించబడింది. ప్రజలు లైక్ల కోసం పోటీ పడడానికి లేదా ఖచ్చితంగా ఉత్పత్తి చేయబడిన మరియు జాగ్రత్తగా రూపకల్పన చేయబడిన కంటెంట్ గుండా పూర్తిగా స్క్రోల్ చేయడానికి ఇది ఎప్పుడూ ఉద్దేశించబడలేదు. ఇది ఎల్లప్పుడూ నిజమైన సంబంధబాంధవ్యాలకు చోటుగా ఉంటోంది - సరదా, సంతోషం మరియు ప్రేమను వ్యాప్తి చేయడానికి.
ఫిబ్రవరిలో మేము మా బ్రాండ్ ప్రచారోద్యమాన్ని ప్రారంభించాము, అదే “తక్కువ సోషల్ మీడియా. ఎక్కువ Snapchat.” అక్కడ మేము, సాంప్రదాయక సోషల్ మీడియాకు బదులుగా Snapchat దేనిని ఏర్పరుస్తుందో ప్రపంచానికి చూపించాము. ఈ రోజు, మా ప్రచారోద్యమం, "తక్కువ లైక్లు-ఎక్కువ ప్రేమ" యొక్క తర్వాతి దశతో ప్రేమను వ్యాప్తి చేయడానికి ప్రజలు Snapchatని ఎలా ఉపయోగిస్తున్నారో అనేదాన్ని మేము ఎత్తి చూపిస్తున్నాము. ఎక్కువ ప్రేమ." దాన్ని సరిచూసుకోండి:
ఫ్రెండ్స్ మరియు కుటుంబంతో మెసేజింగ్ చేసుకోవడమే Snapchat యొక్క ప్రప్రథమ మరియు ఎల్లప్పటి ఉపయోగపు ఉదంతముగా ఉంటూ వస్తోంది. "తక్కువ లైక్లు. ఎక్కువ ప్రేమ." Snapsను పంపించే మరియు స్వీకరించే అనుభవాన్ని తట్టి లేపుతుంది మరియు ఒక టెక్స్ట్ పొందడం లేదా ఒక సామాజిక పోస్ట్ ని చూడటం కంటే ఇది ఎందుకు అంత ఎక్కువ సమృద్ధమైనదో చూపుతుంది. Snapchat పైన, మా అత్యంత సృజనాత్మక ఆలోచనలు, ప్రాపంచికమైన వివరాలు, మరియు మాకు అత్యంత సన్నిహితంగా ఉన్న వారితో అసంపూర్ణ క్షణాలను పంచుకునే విషయంలో మేము స్వేచ్ఛగా ఉన్నాము. అనుసంధానమైన అనుభూతిని చెందడానికి మరియు మీ జీవితంలో ఎక్కువ ప్రేమను కలిగి ఉండటానికి ఇది అత్యుత్తమ మార్గం.
అందుకనే, 25 కు పైగా దేశాలలో 75% మంది 13- 34 సంవత్సరాల వయస్సు గల వారితో సహా 800 మిలియన్లకు పైగా ప్రజలు, తమ ఫ్రెండ్స్ తో నేరుగా కమ్యూనికేట్ చేసుకోవడానికి Snapchat కు వస్తున్నారు. ఎక్కువ ప్రేమను అనుభూతి చెందడానికి మరియు ఎక్కువ ప్రేమను వ్యాప్తి చేయడానికి.
మనం ఎంత ఎక్కువ ప్రేమను అనుభూతి చెందితే, అంత ఎక్కువగా ఇస్తాము. Snapchatతో ప్రేమను వ్యాప్తి చేయండి.