ఈ రోజు మేము మేరీల్యాండ్ అటార్నీ జనరల్ ఆఫీసుతో ఒక ఒప్పందము కుదుర్చుకున్నాం - ఫెడరల్ ట్రేడ్ కమీషన్‌తో మా ఇటీవలి ఒప్పందంలాగా - అది మా వాడుకదారుల పాలసీకి ఇదివరకే ఉన్న Snapchat యొక్క ధృఢమైన నిబద్ధతను బలోపేతం చేస్తుంది. రెండు ఒప్పందాలలోనూ ఎంతో సారూప్యత ఉంది. తమ Snaps గ్రహీతలు Snaps భద్రపరచుకోవచ్చునని వాడుకదారులు ఎంత చక్కగా అర్థం చేసుకుంటారనేదానిపై పరిష్కారమైన ప్రతి పరిశోధనలూ చాలా మటుకు తెలియబరుస్తాయి. మరియు, Snapchat ఏదేని సమాఖ్య, రాష్ట్ర లేదా స్థానిక చట్టాల ఉల్లంఘనకు పాల్పడదని సమ్మతిస్తూ ప్రతి ఒప్పందమూ ముగిసింది.
రెండు ఒప్పందాల్లో ఉమ్మడిగా ఉండేది వేరేది ఉంది: Snapchat తనకుతానుగా మా యూజర్‌ల Snaps నిలుపుకుంటుందని అవి ఎప్పటికీ ఆరోపించవు, కనుక్కోవు లేదా సూచించవు. అది ముఖ్యమైన విషయం. మొదటి రోజు నుండీ, స్వీకర్తలందరూ Snapsని చూడటం పూర్తి కాగానే మా సేవల నుండి వాటిని తొలగిస్తామని మేం మా యూజర్‌లకు వాగ్దానం చేశాము. ఆ వాగ్దానాన్ని మేము ఎల్లప్పుడూ గౌరవించాము, మరియు దానిని FTC గానీ లేదా మేరీల్యాండ్ AG గానీ ఎప్పుడూ ప్రశ్నించలేదు.
దానికి బదులుగా, ఒక స్క్రీన్ షాట్ తీసుకోవడం ద్వారా గానీ లేదా మరొక పద్ధతి ఉపయోగించి గానీ స్వీకర్తలచే తమ Snaps సేవ్ చేయగలిగే స్థాయిలో చేయబడ్డాయని యూజర్‌లు పూర్తిగా అనుకోలేదని రెండు సంస్థలూ భావించాయి. ఆ సమస్య యోగ్యత ఏదైనప్పటికీ, అది ఇప్పటికి పాత వార్త అయింది. మేం వివరించినట్లుగా మేం మా ఒప్పందము చేసుకునేటప్పుడు, మేం చాలా కాలం క్రితం పునస్సమీక్షించిన గోప్యత పాలసీ మరియు ఇతర బహిరంగ ప్రకటనలను కచ్చితంగా స్పష్టం చేయడం ఏమిటంటే — వీక్షించబడిన Snaps అన్నింటినీ తన సర్వర్ల నుండి Snapchat తొలగిస్తుండగా — స్వీకర్తలు ఎల్లప్పుడూ వాటిని సేవ్ చేసుకోవచ్చు.
మా ఒప్పందము, 13 సంవత్సరాల లోపు పిల్లలు యాప్ ఉపయోగించకూడదనే మేరీల్యాండ్ AG యొక్క ఆందోళనను కూడా ప్రస్తావిస్తుంది. మరిముఖ్యంగా, మేరీల్యాండ్ AG ఈ ఒప్పందములో, Snapchat సేవా షరతులు ఎల్లప్పుడూ "యాప్ 13 సంవత్సరాలు లేదా అంతకు మించి వయసున్న వారి వాడకానికి ఉద్దేశించబడింది" అనే నిబంధనను గుర్తిస్తున్నారు. మరియు ఆ పరిమితి గౌరవించబడేలా చూసుకోవడానికి Snapchat అనేక నియంత్రణలను నెలకొల్పింది. ఈ నాటి ఒప్పందము కేవలం ఆ నియంత్రణలను అధికారికం చేస్తుంది.
FTCతో మేం చేసుకున్న ఒప్పందమును ప్రకటించినప్పుడు మేం చెప్పినట్లుగా, Snapchat వాడుకదారు గోప్యతను ప్రోత్సహించడానికి మరియు తాము ఎలా మరియు ఎవరితో కమ్యూనికేట్ చేయాలో అనేదానిపై Snapchatters కు నియంత్రణ ఇవ్వడానికి కట్టుబడి ఉంది — మరియు ఎల్లప్పుడూ ఉంటూ వస్తోంది.