Snapchat పై Snaps మరియు కథలను పదిలపరచడానికి మెమరీస్ ఒక కొత్త మార్గం. ఇది, కెమెరా స్క్రీన్‌కి దిగువన జీవించే మీ ఇష్టమైన క్షణాల వ్యక్తిగత కలెక్షన్. మెమరీస్ తెరవడానికి కెమెరా నుండి కేవలం పైకి స్వైప్ చేయండి!
“dog” లేదా “Hawaii” వంటి ముఖ్యపదాలను టైప్ చేయడం ద్వారా మీరు ఎదురుచూస్తున్న Snap లేదా స్టోరీని కేవలం కొద్ది సెకండ్లలోనే చాలా తేలికగా కనుగొనవచ్చు — ఈ విధంగా మీరు సర్చింగ్‌లో తక్కువ సమయం మరియు మీ మెమరీస్ ఆనందించడంలో ఎక్కువ సమయం గడపవచ్చు.
మీరు తీసుకున్న Snaps నుండి కొత్త స్టోరీస్ క్రియేట్ చేయడానికి మీరు మెమరీస్ ఉపయోగించవచ్చు, లేదా ఒక సుదీర్ఘ కథనానికి విభిన్న స్టోరీస్ కలపవచ్చు! కొన్ని పాత Snapsని కనుక్కోవడం మరియు వాటిని ఒక కొత్త స్టోరీలోనికి కూర్పు చేయడం ద్వారా ఒక వార్షికోత్సవం లేదా పుట్టినరోజును జరుపుకోవడం భలే తమాషాగా ఉంటుంది :)
మెమరీస్ నుండి మీ స్నేహితులకు Snaps పంపించడానికి, లేదా వాటిని మీ స్టోరీలోనికి పోస్ట్ చేయడానికి సైతం మేం ఒక కొత్త మార్గాన్ని సృష్టించాం. మీరు ఒక Snap పోస్ట్ చేస్తే మీ స్టోరీకి మీరు ఒకరోజు కంటే ఎక్కువ తీసుకుంటారు, అది చుట్టూ ఒక ఫ్రేముతో కనిపిస్తుంది, కాబట్టి ప్రతిఒక్కరూ అది గతం నుండి అని తెలుసుకుంటారు.
Snapచాటర్స్ తాము ఒక్కటిగా కలుసుకొని సమావేశమైనప్పుడు తమ మెమరీస్‌ని స్నేహితులకు చూపిస్తూ సౌకర్యంగా భావిస్తారని మేం గ్రహించాం, అందువల్ల Snaps మరియు స్టోరీస్‌ని నా కంటికి మాత్రమేకు తరలించడాన్ని మేం సులభం చేశాం — Snap క్షణం కేవలం నీ కోసమే అని ఒక స్నేహితుడు తడబడే అసహ్య క్షణాలను నివారించాము.
మెమరీస్ Snapchat ద్వారా బ్యాకప్ చేయబడింది. కొత్త స్టోరీ చేయడానికి లేదా నా కంటికి మాత్రమేకి చేర్చడానికి తప్ప మీ కెమెరా రోల్ నుండి మేం ఎలాంటి ఫోటోలు లేదా వీడియోలను బ్యాకప్ చేయం. అటువంటి సందర్భంలో, మీరు ఉపయోగించిన ఫోటో లేదా వీడియోను మాత్రమే మేం బ్యాకప్ చేస్తాు.
మేం వచ్చే నెల గానీ లేదా ఆ తర్వాత గానీ ప్రత్యేకంగా మెమరీస్‌ని ప్రవేశపెడతాం — మా సర్వీస్ కొరకు ఇదొక పెద్ద మార్పు కాబట్టి ప్రతిదీ కూడా సజావుగా జరగాలని మేం కోరుకుంటున్నాం! మీరు ఉపయోగించడానికి మెమరీస్ సిద్ధంగా ఉన్నప్పుడు మీకు టీమ్ Snapchat నుండి ఒక చాట్ వస్తుంది.