01 మే, 2024
01 మే, 2024

మా కొత్త లుక్స్, ఫిక్స్ టైపోలు, రిమైండర్లు మరియు మరెన్నింటినో ప్రయత్నించండి

ప్రతి రోజు, Snapchatters, తమ ఫ్రెండ్స్‌తో దృశ్యమాధ్యమంద్వారా కమ్యూనికేట్ చేయడానికి సగటున 5 బిలియన్లకు పైగా Snapsను సృష్టిస్తారు. తీరికలేకుండా ఉండే జీవితాలు మరియు షెడ్యూల్స్ నుండి ఒక క్రమపద్ధతిలో My AI ఉపయోగించేందుకు అనువుగా ఉండేలా మా Snapchatters మరింత త్వరగా కనెక్ట్ అయేందుకు, తమను తాము నూతన మార్గాల్లో వ్యక్తపరచేందుకు సహకరించేలా మేము కొత్త ఫీచర్లను చేర్చాము:

  • ఎడిట్ చేయగలిగే చాట్స్ - మీరు ఏదైనా తప్పు టైప్ చేసినా లేదా ఏదైనా మీ స్ఫురణకు రాకపోతే, మీ సందేశాన్ని మీ ఫ్రెండ్ తిరిగి సమాధానం ఇవ్వడానికి ముందు దానిని పంపిన 5 నిమిషాలవరకు ఎడిట్ చేసుకోవచ్చు! త్వరలో అందుబాటులోకి రాబోయే ఈ ఫీచర్ మొదటగా Snapchat+ చందాదారులకు అందుబాటులో ఉంటుంది.

  • ఎమోజీ రియాక్షన్లు-'22 నుండి Snapchatters, చాట్‌కు, వారు 😂బిగ్గరగా నవ్వుతున్నారా లేదా ఒక ఫ్రెండ్‌ను🔥ఉత్సాహభరితం చేస్తున్నారా అనేదాన్ని తమ Bitmojiతో ప్రతిస్పందించే అవకాశం కలిగివుండేవారు. ఇప్పుడు, మీ మనస్సులో ఉన్నదానిని ఏ ఎమోజీతో స్పందించండి.

  • My AI రిమైండర్లు - రాబోయే గడువు గురించి మీరు గుర్తుపెట్టుకోవాల్సి వచ్చినా, లేదా ఒక వారాంతానికి కౌంట్‌డౌన్ ప్రారంభించాలనుకొన్నా, ప్రత్యక్ష చాట్‍లలో లేదా మీ ఫ్రెండ్‌తో జరిపే సంభాషణలోనైనా ఒక రిమైండర్ కోసం కేవలం My AI ను అడగండి! కేవలం ఒక సత్వర సందేశంతో, మీరు ఏ ఒక్క క్షణాన్ని కోల్పోకుండా ఉండేందుకు, My AI ఒక ఇన్-యాప్ కౌంట్‌డౌన్ సెటప్ చేస్తుంది.

  • మ్యాప్ రియాక్షన్లు - తమ లోకేషన్ తమ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోదలచుకొనే ఐఛ్ఛికాన్ని ఎందుకొన్న వారికి, తక్షణమే సంభాషణలను ప్రారంభించడానికి Snap మ్యాప్ నుండి మేము ఒక కొత్త మార్గాన్ని కూడా చేర్చబోతున్నాము! ఉదయాన్నే మీరు వెళుతున్నప్పుడు ఒకరికొకరు తారసపడ్డప్పుడు ఒక తరంగాన్ని లేదా మీ ఫ్రెండ్ తన గమ్యస్థానానికి సురక్షితంగా చేరుకున్నప్పుడు హృదయం గుర్తు పంపండి.

Snapchatపై, మా కమ్యూనిటీ తమను తాము ఎన్నో విధాలుగా - సంభాషణలు, కెమెరాలోని లెన్సెస్ ద్వారా మరియు దుస్తులద్వారా కూడా వ్యక్తపరుస్తారు! మా సరికొత్త AI-ఆధారిత ఫోచర్లతో, మా కమ్యూనిటీ ఇప్పుడు:

  • కస్టమ్ Bitmoji లుక్స్ సృష్టించండి - ఒక చిన్న వివరణ మరియు AI నుండి కొద్ది సహాయంతో, Snapchatters తమ Bitmojiకి తమ స్వంత డిజిటల్ దుస్తులను రూపొందించవచ్చు. "శక్తివంతమైన గ్రాఫిటీ" లేదా "స్కల్ ఫ్లవర్" వంటి భిన్నమైన నమూనాలను సృష్టించండి మరియు ఎడిట్ చేసేందుకు మీ ఫేవరెట్‌పై ట్యాప్ చేయడంద్వారా మీ దుస్తులు ఎలా మారిపోతాయో చూడండి.

  • వాటిని మరింత AI ఆధారిత లెన్సెస్ ద్వారా వ్యక్తపరచండి - ఒక సులభమైన Snapతో, AI లెన్స్‌తో‌ 90ల కాలానికి వెనక్కు వెళ్ళడాన్ని కనుగొనండి.

సంతోషంగా స్నాపింగ్ చేయండి!


వార్తలకు తిరిగి వెల్దాం