ఈ రోజున, ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా -- స్నేహితులు ధ్యానాలను మరియు మనోభరిత వ్యాయామాలను అభ్యసించగల, మరియు పరస్పరం Snapchat ద్వారా కలుసుకోగల ఒక స్వేచ్ఛాపూరిత వాతావరణము అయిన మా Headspace Mini ద్వారా రెండు కొత్త ఇన్-యాప్ ధ్యానములను విడుదల చేయడానికై మేము Headspace తో జట్టు కడుతున్నాము.
ఉత్సుకత, క్రుంగుబాటు మరియు ఇతర మానసిక సవాళ్ళ ఆతిథ్యం నుండి సతమతమవుతున్న Snapchatters కు మెరుగ్గా మద్దతు ఇవ్వడానికి గాను, గత సంవత్సరం నిర్వహించబడిన పరిశోధన ద్వారా మా కమ్యూనిటీ ఈ సమస్యలను ఎలా అనుభవించిందో తెలుసుకొని మేము Headspace Mini ని అభివృద్ధి చేశాము. Snapchatters లో అధికభాగం మంది ఒత్తిడి మరియు ఉత్సుకత యొక్క భావనలను అనుభవించినట్లుగానూ, మరియు వృత్తినిపుణులకంటే లేదా వారి తల్లిదండ్రులకంటే సైతమూ ఎక్కువగా వారికి సహాయం ఎప్పుడు అవసరమో గుర్తించిన వారిలో వారి స్నేహితులు మొదటి వ్యక్తులుగా ఉన్నట్లుగానూ మేము కనుగొన్నాము. తమ స్నేహితులతో నేరుగా ఉపయోగించడానికి, రోజులో అనేకసార్లు ఇదివరకే కమ్యూనికేట్ చేసుకుంటున్న అదే స్థలములోనే మేము వారికి కొత్త నివారక సంక్షేమ సాధనాలను ఇవ్వాలనుకున్నాము.
ఇప్పుడు, కోవిడ్-19 మహమ్మారిలో పడిన అనేక నెలల్లో, మరియు వాస్తవంగా బడి సంవత్సర ప్రారంభానికి లేదా ఇంటినుండి పనిచేయడం కొనసాగించడానికి Snapchatters ఉద్యుక్తులవుతున్న వేళ, ఈ సంక్షోభం వారిని ఎలా ప్రభావితం చేస్తుందో మెరుగైన స్పృహ కలిగించాలని మేము అనుకున్నాము.
యుఎస్, యుకె మరియు ఫ్రాన్స్ వ్యాప్తంగా చిన్నవాళ్ళు ఒత్తిడి మరియు అనిశ్చితిని ఎలా అనుభవిస్తున్నారనే విషయం గురించి తెలుసుకోవడానికి మేము GroupSolver చే ఒక సర్వే నిర్వహింపజేశాము. ఆ విపణుల్లో ప్రతిదానిలోనూ, కోవిడ్-19 ఒక ప్రాథమిక కారణంగా అనేకమంది Snapchatters ఎక్కువవుతున్న ఒత్తిడిని అనుభవిస్తున్నట్లుగా ఫలితాలు చూపుతున్నాయి:
Snapchatters గత సంవత్సరం కంటే ఎక్కువ ఒత్తిడిని అనుభవిస్తున్నారు మరియు మరింత తరచుగా ఒత్తిడిని అనుభవిస్తున్నారు -- యుఎస్ లో 73% Snapchatters గత వారములో ఒత్తిడికి లోనైనట్లు చెబుతున్నారు, ఆ తదుపరి యుకె లో 68% మరియు ఫ్రాన్స్ లో 60% ఉంది.
ఒత్తిడికి అతి ప్రధానమైన కారణము కోవిడ్-19 (యుఎస్ Snapchatters లో 85%, యుకె లో 87% మరియు ఫ్రాన్స్ లో 80%), ఆ తదుపరి ఆర్థిక వ్యవహారాలు (యుఎస్ లో 81%, యుకె లో 77% మరియు ఫ్రాన్స్ లో 76%) మరియు పని/కెరీర్ సంబంధిత ఒత్తిడులు (యుఎస్ లో 80%, యుకె మరియు ఫ్రాన్స్ లో 77%). ఎన్నికలు/రాజకీయాలు కూడా యుఎస్ Snapchatters ఒత్తిడికి ఒక గణనీయమైన మూలము -- అది తమ ఒత్తిడి స్థాయి పెరగడానికి దోహదపడుతోందని 60% మంది చెబుతున్నారు.
యుఎస్ లోని Gen Z Snapchatters (13-24) కొరకు, ఒత్తిడికి బడి ప్రధానమైన మూలము (13-24 కొరకు 75% మరియు 13-17 కొరకు 91%), తమ జతగాళ్ళతో సామాజికీకరణ లోపముతో, మరియు కోవిడ్-19 ఇబ్బందుల కారణంగా తమ చదువులో వెనుకబడడం అనేవి ప్రధాన సమస్యలు.
యుఎస్ Snapchatters ఈ ఒత్తిడిని తమ భావోద్వేగ మరియు భౌతిక సంక్షేమంపై తీసుకున్న ఒక లెక్కగా చెబుతున్నారు -- 60% మంది ఉత్సుకతతో ఉన్నట్లు, 60% మంది అలసిపోయినట్లు మరియు 59% పూర్తయిపోయినట్లుగా. దగ్గర దగ్గర 50% మంది అవిశ్రాంతతను మరియు 43% మంది తలనొప్పులు ఎక్కువవుతున్నట్లుగానూ తెలియజేశారు.
ఒత్తిడి నుండి కోలుకోవడానికి ధ్యానమును ఉపయోగించేవారుగా యుఎస్ లో సుమారు మూడో వంతు Snapchatters ని మరియు యుకె మరియు ఫ్రాన్స్ లో ఐదో వంతును లెక్కలోనికి తీసుకొని, మేము నేరుగా కొత్త Headspace మార్గదర్శక ధ్యానములను ఈ క్రిందివాటితో సహా కొన్ని సమస్యల ప్రస్తావనకు యోచిస్తున్నాము:
“దయను ఎంచుకోండి” - మనం ప్రపంచములో ఎలా చూపించుకుని మరియు ఇతరుల్ని మనం ఎలా చూస్తామో మార్చగల దయాగుణాన్ని అభ్యసించడంపై దృష్టి సారించే ఒక స్వల్పకాలిక ధ్యానము. గందరగోళం, అయోమయం మరియు వివాదం మధ్యలో, మన మనస్సు స్థితిని మార్చడానికి మరియు దయగల చోటుకు కదలడానికి ఈ ధ్యానము రూపొందించబడింది.
“టేక్ ఆన్ ది స్కూల్ ఇయర్” - బడిలో అనిశ్చితి గుండా నడవడంపై దృష్టి సారిస్తూ మినీ ధ్యాన కార్యక్రమము. విద్యార్థులు తరగతి గదికి తిరిగి వచ్చినా లేదా ఇంకా ఇంట్లోనే ఉన్నా, వారికి చింత, ఉత్సుకత లేదా స్నేహితుల నుండి సంధానత లేకపోవడం సైతమూ ఉండవచ్చు. మీ శ్వాసతో కనెక్ట్ కావడానికి మరియు అనిశ్చితిని వదిలించుకోవడానికి ఒక విశ్రాంతి స్థలమును కనుగొనడానికి ఈ ధ్యానము రూపొందించబడింది.
మా కమ్యూనిటీ యొక్క ఆరోగ్యము మరియు సంతోషమునకు మద్దతు ఇవ్వడంలో Snapchat ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తుందని మేము నమ్ముతున్నాము. Here For You వంటి మా మానసిక ఆరోగ్య వనరులకు అదనంగా, ఈ ప్రయత్నాలను వృద్ధి చేయడానికి మరియు Snapchatters స్నేహితుల నుండి మద్దతు పొంది కనెక్ట్ అయ్యేలా సాధికారపరచడం కొనసాగించడానికి మేము ఎదురు చూస్తున్నాము.