19 ఆగస్టు, 2024
19 ఆగస్టు, 2024

స్నేహితులతో ఆన్‌లైన్ కమ్యూనికేట్ చేసుకోవడం ఆస్ట్రేలియన్లకు సంతోషాన్ని తీసుకువస్తుందని కొత్త పరిశోధన వెల్లడిస్తోంది

మొట్టమొదటి నుండీ Snapchat సోషల్ మీడియా కు ఒక ప్రత్యామ్నాయంగా నిర్మించబడింది. అప్పటికప్పుడు ఆ క్షణంలో, మీ సన్నిహిత మిత్రులు మరియు కుటుంబానికి ఫోటో మరియు వీడియో సందేశాలను పంపడానికి ఒక సరదా మార్గంగా అది రూపొందించబడింది. మీరు నిజమైనవారుగా ఉండి మీకు మీరు వ్యక్తపరచుకోవడానికి ఒక ప్రదేశంగా ఇది సృష్టించబడింది. Snapchat యొక్క ఒక నంబర్ వన్ వాడుక ఉదంతం (మరియు ఎల్లప్పుడూ) స్నేహితులతో మెసేజింగ్ అయి ఉంది.

తాము భౌతికంగా దూరంగా ఉన్నప్పుడు సైతమూ మిత్రులు మరియు కుటుంబంతో సన్నిహితంగా ఉండటానికి Snapchat సహాయపడుతుందని మా కమ్యూనిటీ తరచుగా మాకు చెబుతుంది. ఆరోగ్యం మరియు సంతోషాన్ని నిర్వహించుకోవడానికి ఈ సంబంధాలు ఎంత ముఖ్యమైనవో మాకు తెలుసు.

చికాగో విశ్వవిద్యాలయంలో నేషనల్ ఒపీనియన్ రీసెర్చ్ సెంటర్ (NORC) గత సంవత్సరం చేసిన పరిశోధనను అనుసరించి, ఆస్ట్రేలియాలో Snapchat, స్నేహాలు మరియు భావోద్వేగ ఆరోగ్యానికి ఎలా మద్దతిస్తుందో మేము మరింత అన్వేషించాలనుకుంటున్నాము, అక్కడ ప్రతి నెలా 8 మిలియన్ల మంది ఆసీస్ కమ్యూనిటీ Snapchat కి వస్తారు.

Snapchat ఉపయోగించడం ఎలా మా కమ్యూనిటీని సమర్థత గా ప్రభావితం చేస్తుందో బాగా అర్థం చేసుకోవడానికి గాను, ఆస్ట్రేలియన్ యుక్తవయస్కులు (13-17 వయస్సు) మరియు పెద్దల (18+ వయస్సు) మధ్య సంబంధాలు మరియు శ్రేయస్సు లో ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ పోషించే పాత్ర లోనికి పరిశోధన నిర్వహించడానికి మేము YouGov ను ఏర్పాటు చేశాము. పరిశోధన ఈ క్రింది విషయాలను కనుగొన్నది:

  • కుటుంబం మరియు సన్నిహిత మిత్రులతో నేరుగా మెసేజింగ్ చేసినప్పుడు ఆస్ట్రేలియన్లు సంతోషంగా ఉంటారు. తమకు విభిన్న సోషల్ మీడియా లేదా మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ ఫీచర్లు వ్యక్తిగతంగా ఎంత ముఖ్యమైనవో అని ఆస్ట్రేలియన్లను అడిగినప్పుడు, ప్రత్యక్ష మెసేజింగ్ మరియు కమ్యూనికేషన్ టాప్ లో నిలిచాయి. ఈ ఫీచర్లు అత్యంత ముఖ్యమైనవిగా కనిపించాయి మరియు ప్రజలు సంతోషించే అవకాశాన్ని కలిగి ఉన్నాయి. కుటుంబం మరియు సన్నిహిత స్నేహితులతో ప్రత్యక్ష మెసేజింగ్ చేసినప్పుడు యుక్తవయస్కులు 5 గురిలో 4 గురు మరియు పెద్దలు 4 గురిలో 3గురు సంతోషంగా ఉన్నట్లు చెప్పారు.

  • సోషల్ మీడియా తో పోలిస్తే మెసేజింగ్ యాప్స్ వాడుతున్నప్పుడు ఆస్ట్రేలియన్లు మరింత ఎక్కువగా సంతోషించే అవకాశం ఉంది. కమ్యూనికేషన్ కోసం మెసేజింగ్ యాప్స్ ఉపయోగించేటప్పుడు, గణనీయంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఉపయోగించేవారు చెప్పినదానికంటే ఎక్కువ సంతోషించినట్లుగా పెద్దలు 5గురిలో 3గురు (63%) మరియు యుక్తవయస్కులు 10 మందిలో 9 మంది (86%) చెప్పారు.

  • మెసేజింగ్ యాప్స్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ కంటే భావోద్వేగ ఆరోగ్యానికి మద్దతునిచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. తమ అధీకృత స్వయముగా ఉండడానికి, సంబంధ బాంధవ్యాలను వృద్ధి చేసుకోవడానికి లేదా పోషించడానికి మరియు తప్పు అవగాహనలను నివారించడానికి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ కంటే మెరుగ్గా ఆస్ట్రేలియన్లు సుమారు 2-3 రెట్లు ఎక్కువగా మెసేజింగ్ యాప్స్ ను చూస్తారు. అదే సమయంలో, వ్యక్తులను మరింతగా ఆనందింపజేయడానికి లేదా ఇతరులకు తాము మంచిగా కనిపించేలా చేసుకునే కంటెంటును పోస్ట్ చేయడానికి ఒత్తిడి చేయబడేందుకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ కూడా మెసేజింగ్ ప్లాట్‌ఫామ్స్ కంటే ఎక్కువగా ఉంటాయి.

  • Snapchat స్నేహాలకు మద్దతునిస్తూ లోతుగా చేయడానికి సహాయపడుతుంది. వారానికి ఒకసారి లేదా అంతకు మించి Snapchat ని ఉపయోగించే పెద్దలు మరియు యుక్తవయస్కులు ఆస్ట్రేలియన్ పెద్దలు మరియు యుక్తవయసు వీక్షకులతో పోలిస్తే తమ సన్నిహితులతో తమకు ఉన్న సంబంధాల నాణ్యతతో మొత్తం మీద తాము చాలా సంతృప్తిగా ఉన్నామని చెప్పే అవకాశం ఉంది.

ఈ అధ్యయనం, Snapchat ఆస్ట్రేలియాలో స్నేహాలను పెంపొందించే మరియు శ్రేయస్సును పెంచే మార్గాల గురించి తాజా గ్రాహ్యతలను అందిస్తుంది. అనేక సంవత్సరాలుగా మా డిజైన్ ఎంపికలు బలమైన సంబంధాలను నిర్మించడంలో మరియు మరింత సంతోషాన్ని తీసుకురావడంలో సహాయపడుతున్నందుకు మేము గర్విస్తున్నాము. మీరు దిగువన YouGov యొక్క పూర్తి ఫలితాలను చదువుకోవచ్చు:

పద్ధతి:

ఈ పరిశోధన Snap చే ఏర్పాటు చేయబడింది మరియు YouGov చే అమలు చేయబడింది. n=1,000 ఆస్ట్రేలియన్ పెద్దలు (18+ వయస్సు) మరియు n=500 ఆస్ట్రేలియన్ యుక్తవయస్కులు (13-17 వయస్సు) యొక్క జాతీయవ్యాప్త నమూనాలో 2024 జూన్ 20 నుండి జూన్ 24 వరకూ ఆన్‌లైన్ లో ఇంటర్వ్యూలు నిర్వహించబడ్డాయి. ఈ సర్వేలో పాల్గొనడానికి ముందు 13-17 సంవత్సరాల మధ్య వయసు ఉన్న మైనర్ల కొరకు తల్లిదండ్రుల సమ్మతి అవసరమై ఉండినది. 2019 PEW ప్రాపంచిక వైఖరుల సర్వే ఆధారంగా గణాంకాలు సమతూకం చేయబడి ఆస్ట్రేలియన్ యుక్తవయస్కులు మరియు పెద్దలకు ప్రాతినిధ్యంగా ఉంచబడ్డాయి. 

వార్తలకు తిరిగి వెల్దాం