Snapchatపై, ప్రతి ఒక్కరూ ఒక క్రియేటరే.
మీరు ఒక స్నేహితుడికి Snap పంపుతున్నా, మొత్తం కమ్యూనిటీతో పంచుకోవడానికి ఒక ఉల్లాసభరితమైన క్షణాన్ని క్యాప్చర్ చేస్తున్నా, లేదా Snap ఒరిజినల్‌లో నటిస్తున్నా, ప్రతి ఒక్కరూ తమని తాము వ్యక్తీకరించుకోవడానికి Snapchat అవకాశాలను కల్పిస్తుంది.
Spotlight గత సంవత్సరంలో ప్రారంభించినప్పటి నుంచి, మిలియన్‌ల కొలదీ ఆడియెన్స్‌తో మా కమ్యూనిటీ పంచుకున్న సృజనాత్మకతను చూసి మేం చాలా థ్రిల్ అయ్యాం. Spotlight అంతర్జాతీయంగా ప్రారంభించబడింది, మరియు ఇప్పటికే 125 మిలియన్‌ల కంటే నెలవారీ యాక్టివ్ యూజర్‌లను చేరుకుంది. వారి స్పృజనాత్మకు Snapchatterలకు రివార్డ్ ఇవ్వడానికి ప్రతి నెలా మేం మిలియన్‌లను ఆఫర్ చేయడాన్ని కొనసాగిస్తాం. ఇప్పటి వరకు, 5,400 మందికి పైగా క్రియేటర్‌లు $130 మిలియన్ డాలర్లకు పైగా సంపాదించారు!
మీరు ఇప్పుడు వెబ్ నుంచి నేరుగా Spotlightకు అప్‌లోడ్ చేయవచ్చు మరియు టాప్ పెర్ఫార్మింగ్ Snapsలను ఇక్కడ గమనించవచ్చు: Snapchat.com/Spotlight
ఇవాళ, మేం మీ సృజనాత్మక ఆలోచనలకు ప్రాణం పోయడానికి కొత్త టూల్స్ మరియు మానిటైజేషన్ అవకాశాలను ప్రకటిస్తున్నాం
Story Studio యాప్
ఈ ఏడాది తరువాత మేం Story Studioలాంఛ్ చేస్తాం, ఇది మొబైల్ కొరకు, మొబైల్‌పై- ప్రొఫెషనల్ కంటెంట్ రూపొందించే మరియు ఎడిట్ చేసే కొత్త యాప్. సృజనాత్మకంగా ఉండటానికి మరియు మరింత అధునాతమైన, ఆహ్లాదకరమైన వర్టికల్ వీడియోలను తయారు చేసి Snapchatపై – మరియు మరెక్కడైనా నేరుగా పంచుకోవడానికి ఇది అత్యంత వేగవంతమైన మరియు ఆహ్లాదకరమైన మార్గం. స్టోరీ Studio iOSపై అందరికి ఉచితంగా లభ్యమవుతుంది.
క్రియేటర్‌ల కొరకు రూపొందించిన Story Studio అధిక సామర్ధ్యం కలిగిన ఎడిటింగ్ టూల్స్ మరియు వారి ఫోన్‌లోనే ప్రతిదీ సౌకర్యవంతంగా ఎడిటింగ్ చేయాలని కోరుకునేవారి కొరకు కంటెంట్ సృష్టించడాన్ని మరియు ఎడిటింగ్‌ని సులభతరం చేస్తుంది. Snapchat యొక్క #Topics అంతటా ట్రెండింగ్‌లో ఉన్నఫీచర్ చేయబడ్డ ఇన్ సైట్స్, సౌండ్స్ మరియు లెన్స్ లు సృజనాత్మకతను ప్రేరేపించడానికి సహాయపడతాయి, మరియు Snapchat కమ్యూనిటీకి అనుగుణంగా కంటెంట్ ప్రతిబింబించేందుకు సహాయపడతాయి. ఫ్రేమ్ ఖచ్చితత్త్వం కలిగిన ట్రిమ్మింగ్, స్లైసింగ్ మరియు కట్టింగ్‌తో అంతరాయం లేకుండా ట్రాన్సిషన్‌లను అమలు చేయండి, సరైన క్యాప్షన్ లేదా స్టిక్కర్ పెట్టండి, Snap దృడమైన లైసెన్స్‌డ్ మ్యూజిక్ మరియు ఆడియో క్లిప్‌ల కేటలాగ్ నుంచి సౌండ్‌లతో సరైన పాటను జోడించండి, లేదా మీ తరువాత వీడియో సృష్టించడానికి ప్రతిఒక్కరూ మాట్లాడుతున్న లేటెస్ట్ Snapchat Lens ఉపయోగించండి.
మీరు పంచుకోవడానికి సిద్ధమయ్యేంత వరకు మీ ప్రాజెక్ట్‌లు సేవ్ చేయండి మరియు ఎడిట్ చేయండి, తరువాత సరళంగా తట్టడం ద్వారా మీ పూర్తయిన వీడియోని నేరుగా Snapchat కు పోస్ట్ చేయండి - అది మీ స్టోరీ లేదా స్పాట్‌లైట్ కావొచ్చు- లేదా మీ కెమెరా రోల్‌కు మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు లేదా మీ వీడియోని మరో ఇన్‌స్టాల్ చేయబడ్డ యాప్‌లో ఓపెన్ చేయవచ్చు.
గిఫ్టింగ్
మా కమ్యూనిటీ వారికి ఇష్టమైన క్రియేటర్‌లకు మద్దతు ఇవ్వడానికి అనుమతించే ఒక కొత్త ఫీచర్‌ని మేం ప్రవేశపెడుతున్నాం: గిఫ్టింగ్! స్టోరీ రిప్లైల ద్వారా బహుమతులు పంపబడతాయి, వారికి ఇష్టమైన క్రియేటర్‌ల కొరకు వారి ఫ్యాన్స్ మద్దతు చూపించడాన్ని, అలానే క్రియేటర్‌లు వారి ఫ్యాన్స్‌తో ఒక లోతైన సంబంధాన్ని ఏర్పరుచుకోవడాన్ని కూడా సులభతరం చేస్తుంది. ఒక సబ్‌స్క్రైబర్ తనకు ఇష్టమైన Snapని వారికి ఇష్టమైన Snap Starsనుంచి చూసినప్పుడు, బహుమతిని పంపడానికి వారు Snap టోకెన్‌లను ఉపయోగించవచ్చు మరియు సంభాషణను ప్రారంభించవచ్చు. Snap Starsలు Story రిప్లైల ద్వారా పొందే బహుమతుల నుంచి ఆదాయం వాటాను సంపాదిస్తారు. Snap Stars కస్టమ్ ఫిల్టరింగ్‌తో వారు అందుకునే సందేశాల యొక్క రకాలపై నియంత్రణ కలిగి ఉంటారు, అందువల్ల సంభాషణలు గౌరవంగా మరియు సరదాగా ఉంటాయి. స్టోరీస్ ద్వారా బహుమతులు ఇవ్వడం అనేది Android మరియు iOSపై ఈ ఏడాది తరువాత Snap Starsకు ప్రారంభించబడుతుంది.
మనందరం కలిసి, క్రియేటర్‌లు అభివృద్ధి చెందగల కమ్యూనిటీని మనం నిర్మిస్తున్నాం, మీరు తరువాత ఏమి సృష్టిస్తారనే దానిని చూడటానికి మేం ఎంతగానో ఎదురుచూస్తున్నాం!