22 ఫిబ్రవరి, 2016
22 ఫిబ్రవరి, 2016

ఆన్-డిమాండ్ జియోఫిల్టర్లు

ఆన్-డిమాండ్ జియోఫిల్టర్లు మీ పార్టీ, వివాహం, వ్యాపారం లేదా మరేదైనా ప్రదేశం లేదా ఈవెంట్ కోసం జియోఫిల్టర్‌ను సృష్టించడానికి మరియు ప్రచురించడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి. మీ స్నేహితులు లేదా కస్టమర్‌లు ఎక్కడ ఉన్నా వారి Snapలను అలంకరించడంలో సహాయపడటానికి ఇది ఒక ఆహ్లాదకరమైన మార్గం!

జియోఫిల్టర్లు అనేవి మా Snapchat యొక్క ఇష్టమైన భాగాలలో ఒకటి. మేము Snapchat యొక్క సృజనాత్మకతచే ఉబ్బితబ్బిబ్బవుతూనే ఉన్నాము, మరియు మీ కళాత్మకమైన పని ద్వారా ఉద్భవించే ప్రతి చోటు యొక్క వ్యక్తిత్వాన్ని చూసేందుకు ఇష్టపడ్డాము. ఈ నాటికి, దాదాపుగా సగం మిలియన్ కమ్యూనిటీ జియోఫిల్టర్లు సమర్పించబడ్డాయి, మరియు ప్రతిరోజూ,వందలాది మిలియన్ల సార్లు వీక్షించబడుతున్న జియోఫిల్టర్లతో Snaps లీనమవుతూ ఉంది.

మేము మొదట్లో బహిరంగ ప్రదేశాల కోసం కమ్యూనిటీ జియోఫిల్టర్లు రూపొందించాము — ఐతే తమ బిజినెస్ లేదా స్వంత వేడుక కోసం ఒక జియోఫిల్టర్ కావాలనుకున్న Snapchatters నుండి వింటూనే వస్తున్నాము, కావున ఈ రోజు ఒక కొత్తదాన్ని ప్రకటిస్తున్నాము:

మీ పార్టీ, పెళ్ళి, బిజినెస్, లేదా ఏదైనా ఇతర చోటు లేదా వేడుక కోసం ఒక జియోఫిల్టర్ రూపొందించుకోవడానికి లేదా ప్రచురించడానికి ఆన్-డిమాండ్ జియో ఫిల్టర్లు మీకు వీలు కలిగిస్తాయి. ఇది, మీ స్నేహితులు లేదా కస్టమర్లు ఎక్కడున్నా సరే, తమ Snaps అలంకరించుకోవడానికి సహాయపడే ఒక వినోదాత్మక మార్గము.

ఇది ఎలా పనిచేస్తుంది:

  • రూపకల్పన- ఫిల్టర్‌ను సృష్టించడానికి మీకు ఇష్టమైన ఇమేజ్ ఎడిటర్‌ని ఉపయోగించండి. మీరు ప్రారంభించడానికి ఫోటోషాప్ మరియు ఇలస్ట్రేటర్‌కు అనుకూలంగా ఉండే కొన్ని టెంప్లేట్‌లను కూడా మేము అందించాము :)

  • మ్యాప్- మీ ఫిల్టర్ కనిపించే చోట జియోఫెన్స్ ఎంచుకోండి, ఆపై మీ జియోఫిల్టర్ అందుబాటులో ఉండాలని మీరు కోరుకునే సమయం మరియు తేదీలను ఎంచుకోండి.

  • కొనుగోలు- మీ జియోఫిల్టర్‌ను సమర్పించండి. మా టీమ్ దానిని వేగంగా సమీక్షిస్తుంది మరియు అంతా కూడా బాగా ఉందని భావించి, దానిని పని చేసే విధంగా చేస్తుంది.

మీరు ఒక వేడుక కొరకు లేదా ఒక గంటకు లేదా ముప్ఫై రోజుల మొత్తం బ్లాక్ కోసం సైతమూ ఆన్-డిమాండ్ జియోఫిల్టర్లను కొనుక్కోవచ్చు! ధర $5 తో మొదలవుతుంది, మరియు ఇతర అంశాలతో పాటుగా మీ జియోఫెన్స్ యొక్క సైజు మరియు మీరు ఎంచుకున్న కాలవ్యవధి వంటి కొన్ని అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు US, UK,మరియు కెనడాలో ఆన్-డిమాండ్ జియోఫిల్టర్లు లభ్యమవుతున్నాయి, మరిన్ని చోట్లకు త్వరలో వస్తున్నాయి!

ఇక్కడ మొదలుచేయండి https://www.snapchat.com/on-demand!

మరింత సమాచారం మరియు FAQ ల కోసం దయచేసి మా జియోఫిల్టర్స్ సపోర్ట్ సెంటర్దర్శించండి.

వార్తలకు తిరిగి వెళ్లు