11 జూన్, 2020
11 జూన్, 2020

Snap పార్టనర్ సమ్మిట్: కొత్త Snap ఒరిజినల్స్

మొబైల్ కోసం రూపొందించిన షోలు Snap ఒరిజినల్స్‌తో ప్రారంభమయ్యాయి. ఈ రోజు, మేము ప్రత్యేకంగా Snapchat కోసం రూపొందించిన మా కొత్త షోల జాబితాను వెల్లడించడానికి సంతోషిస్తున్నాము! మొదటిసారిగా, Snap చాటర్లు ఈ షోలో భాగం కావచ్చు.

మేడ్- ఫర్-మొబైల్ షోలు Snap ఒరిజినల్స్‌తో ప్రారంభం అవుతాయి. ఇవాళ, Snapchat కొరకు ప్రత్యేకంగా తయారు చేయబడ్డ మా కొత్త షోలను వెల్లడించడం మాకు ఎంతో సంతోషంగా ఉంది!

యు.ఎస్‌.లోని Gen Z జనాభాలో సగానికి పైగా Snap ఒరిజినల్స్ చూస్తున్నారు*. Snap ఒరిజినల్స్‌ని అత్యంత ప్రత్యేకమైనవిగా మార్చడంలో కథలు చెప్పే విధానం మాత్రమే కాదు, మా కమ్యూనిటీ నుంచి విస్త్రృతశ్రేణి అభిరుచులు, అనుభవాలు మరియు స్వరాలు ప్రతిబింబించే రకాలు కూడా భాగం.

మొట్ట మొదటిసారిగా, Snapచాటర్స్ షోలో భాగం కాగలరు!

Snapchatపైన మాత్రమే సాధ్యమయ్యే లీనమయ్యే షోలు అందించడానికి మేం మా ప్రత్యేక ఆగ్మెంటెడ్ రియాలిటీ టెక్నాలజీలను ఉపయోగిస్తాం. మీరు ఇప్పుడు ‘‘మూవ్ ఇట్’’లో ప్రపంచంలోనే అత్యుత్తమైన కొంతమంది డ్యాన్సర్‌ల నుంచి లేటెస్ట్ డ్యాన్స్ మూవ్‌లు నేర్చుకోవచ్చు, ఇది మీ ప్రతి స్టెప్‌‌లో పురోగతికి Snap కస్టమ్ మోషన్ ట్రాకింగ్ లెన్స్‌లను ఉపయోగిస్తుంది.

మీ కొరకు వస్తున్నఅద్భుతమైన కొత్త ప్రదర్శనలను చూడండి:

అన్‌స్క్రిప్టెడ్

  • కోచ్ కెవ్ - (లాఫ్ అవుట్ లౌడ్) - ఆయన స్వంత అనుభవాల ద్వారా స్ఫూర్తిని పొంది, కెవిన్ హర్ట్ మీ కోచ్‌గా, బెస్ట్ ఫ్రెండ్‌గా మరియు మెంటార్‌గా ఇలా బహుళ పాత్రలను పోషిస్తారు, అత్యుత్తమ జీవితాన్ని జీవించాలని ఆకాంక్షించే ఎవరికోసమైనా ఆయన సానుకూలత మరియు జ్ఞానాన్ని రోజువారీగా పంచుకుంటారు.

  • ఫేక్ అప్ - (మిషన్ కంట్రోల్ మీడియా)- టాప్ ఆప్టికల్ ఇల్యూషన్ మేకప్ ఆర్టిస్ట్‌లు మీరు చూసిన ఆర్ట్ వర్క్ అని నమ్మేలా వారి స్వంత ముఖాల్లో పరివర్తన తీసుకొచ్చేందుకు పోరాడతారు. ప్రదర్శనల యొక్క ఇల్యూషన్‌లకు ప్రాణం పోసే కస్టమ్ లెన్స్‌లతో మీరు ప్రయత్నించేటప్పుడు మరియు ఆడేటప్పుడు ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా కళాకారుల పనిని అనుభూతి చెందండి.

  • మూవ్ ఇట్ - (స్టెల్లార్ స్టూడియోస్ మరియు లిటిల్ ఇంజిన్ ప్రొడక్షన్స్)- అతి పెద్ద డ్యాన్స్ ఇన్‌ఫ్లూయన్సర్‌లు, చార్ట్ -టాపింగ్ హిట్లు, మరియు Snapchat యొక్క AR కెమెరా ఫ్లాట్‌ఫాంని ఒక చోట సమకూరుస్తుంది, ఇది ప్రతిఒక్కరూ ఎలా డ్యాన్స్ చేయాలో నేర్పించే మరియు ప్రేరణ అందించే మొట్టమొదటి లీనమయ్యే ప్రదర్శన.

డాక్యుసిరీస్

  • రోడ్ ట్రిప్పిన్ - (బ్యూనిమ్/ముర్రే ప్రొడక్షన్స్)- ఆంథోని ఆండర్సన్ ద్వారా ప్రత్యేకంగా ప్రొడ్యూస్ చేయబడ్డ ఈ డాక్యూ సీరిస్‌లో, ప్రాణస్నేహితులైన రిక్కీ థామ్సన్ మరియు డెంజెల్ డియోన్‌లు తమ కంఫర్ట్ జోన్ నుంచి బయటపడి, అమెరికాలోని గ్రామీణ ప్రాంతాలకు రోడ్డు ట్రిప్‌కు వెళతారు మరియు కొన్నికొత్త క్రేజీ సాహసాలను పంచుకుంటారు.

  • ఫస్ట్ పర్సన్- (హ్యాష్‌ట్యాగ్ అవర్ స్టోరీస్) - మన భూమండలాన్ని సంరక్షించడానికి పోరాడుతున్న, సానుకూల మార్పును సృష్టిస్తున్న అసాధారణమైన యువ ఆవిష్కర్తల దృష్టికోణంలో Snapchat Spectaclesతో చెప్పిన స్టోరీలు.

  • క్వీన్ ఆఫ్ స్టైల్జ్- (గ్లాస్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్రూపు)- హాలీవుడ్‌లోని అత్యంత పెద్ద పేర్ల యొక్క ఆసక్తిని సంగ్రహించి, అలాగే అత్యంత గౌరవనీయులైన మరియు డిమాండింగ్ క్లయింట్‌లను లాక్ చేయడం లో ఏ హెయిర్‌స్టైలిస్ట్ టోక్యో స్టైల్జ్‌ కి సాటి రాడు.

  • లైఫ్ బై హారన్స్(21 స్ట్రీట్ క్రియేటివ్)- 22- సంవత్సరాల కే కౌబాయ్ కావాలని విధి రాసిపెట్టిన, ప్రపంచంలో అత్యుత్తమ బుల్ రైడర్ కావడం కొరకు సాగించిన అతడి జీవనమరణాల యాత్రను, మరియు గడిచిన 35 సంవత్సరాల్లో టైటిల్ గెలుచుకున్న మొదటి ఆఫ్రికన్-అమెరికన్ ఎజికీల్ మైకెల్‌ ను ఫాలో అవ్వండి.

స్క్రిప్టెడ్

  • ఫ్రాగ్‌టౌన్ - (అల్‌కాన్ టెలివిజన్ గ్రూపు)- క్యాథరిన్ హార్డ్‌వికెల్ ద్వారా డైరెక్ట్ చేయబడ్డ ఈ సీరిస్‌లో (ట్వైలైట్ట్, పదమూడు) ఈస్ట్ లాస్ ఏంజిల్స్‌లో ఫ్రాగ్‌టౌన్ స్కేట్‌పార్క్ వద్ద ఆల్ గర్ల్ క్రూతో సాన్నిహిత్యం కుదరడంతో తన కారులో నివసిస్తన్న ఒక తెలివితక్కువ స్కేటర్ రెండవ కుటుంబం లో కుదురుకుంటుంది.

  • యాక్షన్ రాయల్- (పోర్టల్ A)- త్వరలో రాబోతున్న ఈ థ్రిల్లర్‌లో, ఒక టీనేజర్ తన తండ్రి రుణాలను చెల్లించడం కొరకు ఒక అండర్‌గ్రౌండ్ ఎస్పోర్ట్స్ గ్యాంబ్లింగ్ రింగ్‌ని ప్రారంభిస్తాడు, అయితే అతడు మరియు జూద బాలమేధావి అయిన అతడి ప్రాణస్నేహితుడు అత్యంత ప్రమాదకరమైన జూదంలో ఒడ్డే పందెం ప్రపంచంలో చిక్కు కొన్నామని త్వరలో తెలుసుకుంటారు.

  • టోటల్ బ్యాడ్‌యాస్ రెజ్లింగ్- (కామెడీ బ్యాంగ్! బ్యాంగ్! ప్రొడక్షన్స్) - ఈ కామెడీలో, ఒక అమాయకమైన అయితే ఆకర్షణీయమైన యువ రెజ్లర్ రాత్రికి రాత్రి వైరల్ సెన్సేషన్ అవుతాడు, ఒక కాలం చెల్లిన ప్రో రెజ్లర్ అతడికి మెంటార్‌గా ఉండటానికి మరియు ఈ కొత్త పిల్లవాడికి ఆసరాగా తిరిగి స్పాట్‌లైట్‌కు రావడానికి స్ఫూర్తిని పొందతాడు.

దీనికి అదనంగా, మేం దిగువ Snap ఒరిజినల్స్‌ని రెన్యువల్ చేయనున్నాం. డెడ్ ఆఫ్ నైట్ హుక్డ్ యొక్క సౌజన్యంతో బేజ్‌లెవ్స్ ద్వారా, ఫేస్ ఫార్వార్డ్" NBC యూనివర్సల్ ద్వారా వారి స్వంత సెలబ్రిటీ మేక్‌వోర్ కొరకు ఎపిసోడ్‌ని అందించే సరికొత్త AR లెన్స్ అనుభవం, ‘‘నికితా అన్‌ఫిల్టర్డ్" ITV అమెరికా యొక్క సైరెన్స్ మీడియా ద్వారా, మరియు కాంప్లెక్స్ మళ్లీ Snap డాక్యుమెంటరీ ఫ్రాంచైజీని నిర్మిస్తారు, ‘‘వర్సెస్ ద వరల్డ్," ఇది ప్రఖ్యాత MMA ఫైటర్ కానర్ మెక్‌గ్రెగోర్ కథను చెబుతుంది.

మీరు వీటిని వెంటనే ఆలకిస్తారని వేచి చూస్తాం!

* Snap Inc. అంతర్గత డేటా డిసెంబర్ 2019-ఫిబ్రవరి 2020. Gen Z అంటే 13-24 ఏళ్ల వయస్సు ఉన్న వినియోగదారులుగా నిర్వచించబడుతుంది. యుఎస్ Gen Z జనాభా కొరకు యుఎస్ జనాభా లెక్కలు ఉపయోగించబడ్డాయి.

వార్తలకు తిరిగి వెళ్లు