అమెరికాలో మనం కలిగి ఉండే స్వీయ-వ్యక్తీకరణ అత్యంత ముఖ్యమైన రూపాలలో ఓటింగ్ ఒకటి. అందువల్ల, ఇవాళ జాతీయ ఓటర్ రిజిస్ట్రేషన్ దినంనాడు, మేము మా కమ్యూనిటీకి త్వరగా మరియు సులభంగా ఓటు రిజిస్టర్ చేసుకునే ఒక కొత్త మార్గాన్ని అందిస్తున్నాము - Snapchat లోనే TurboVote ద్వారా!
మీరు US లో 18 సంవత్సరాలు లేదా ఆపై వయసు కలిగి ఉంటే, మీ యూజర్ ప్రొఫైల్ పేజీపై రిజిస్టర్ చేసుకోవడానికి నేటి నుంచి మీకు ఒక లింక్ కనిపిస్తుంది. ‘Team Snapchat’ నుండి మీరు ఒక వీడియో సందేశం కూడా చూస్తారు, రిజిస్టర్ చేసుకోవడానికి మీ స్నేహితుల్ని ప్రోత్సహించేందుకు మీరు ఉపయోగించగల జాతీయవ్యాప్త ఫిల్టర్లు వంటి సరికొత్త క్రియేటివ్ టూల్స్ కూడా చూస్తారు. అంతేకాక, మన కమ్యూనిటీల వ్యాప్తంగా జరుగుతున్న మధ్యంతర ఎన్నికలు మరియు ఓటర్ రిజిస్ట్రేషన్ ప్రయత్నాల గురించి స్టోరీల కొరకు Discover చూడడం మరచిపోవద్దు!
సంతోషంగా ఓటింగ్ చేయండి!