ఎడిటర్ గమనిక: Snapకు CEO అయిన ఇవాన్ స్పీగెల్ల్, మే 17న క్రింది మెమోను బృంద సభ్యులందరికీ పంపించారు.
జట్టు,
ఈ రోజు మేము మా రెండవ వార్షిక సిటిజెన్Snap నివేదికను విడుదల చేస్తున్నాం. ఈ నివేదిక మా వ్యాపారాన్ని మా సిబ్బందికి, మా Snapchat సమాజానికి, మా భాగస్వాములకు మరియు మేము భాగమైయున్న సువిశాల ప్రపంచం పట్ల బాధ్యతాయుతంగా ఉండేలా మా వ్యాపారాన్ని నడపడంపై దృష్టిని సారించడానికి మేము చేసే పర్యావరణ, సామాజిక మరియు పాలక (ESG) పరమైన ప్రయత్నాలను గురించి తెలియజేస్తుంది.
ఇది Snapకు ముఖ్యమైన పని. ఆరోగ్యకరమైన సురక్షిత సమాజాన్ని నిర్మించడం దిశగా వ్యాపారాలు పని చేయడం ఓ నైతిక ఆవశ్యకత, మరియు ఇది మా సేవలను అనుదినం ఉపయోగించే వందల లక్షల Snapchat వినియోగదారులకు ముఖ్యం అని మేము అవగాహన కలిగి ఉన్నాము.
మా సిటిజన్Snap నివేదిక 2020 సంవత్సరమంతటిలో ప్రపంచ మహమ్మారి సమయంలో మా Snapchat వినియోగదారులకు తెలియజేయడానికి మరియు అవగాహన కల్పించి ఓటింగ్ ద్వారా గళమెత్తేలా చేయడం కోసం మరియు భిన్న స్వరాలను మరియు గాథలను వెలుగులోనికి తీసుకు రావడం కోసం మేము సల్పిన కృషితో పాటుగా మా సమాజాలకు, భాగస్వాములకు మద్దతుగా నిలవడానికి మేము చేసిన పనికి సంబంధించిన సమగ్ర అవలోకనాన్ని అందిస్తుంది. మా ఉత్పత్తులు మరియు ప్లాట్‌ఫామ్‌లలో గోప్యత, భద్రత మరియు నైతికతను పెంపొందించడంలో మా నిబద్ధతను మరింత ధృఢం చేసుకుంటూనే మరింత భిన్నత్వాన్ని, సమీకృత స్వభావంతో జాతి వివక్షతకు వ్యతిరేకమైన సంస్థగా తీర్చిదిద్దేలా ముందుకు సాగుతూ ఇదంతా చేసాము.
అవసరమైనంత వేగం మరియు ఔన్నత్యంతో మా వంతు తోడ్పాటును అందించడానికి మా నివేదిక ఒక ఆశయంతో కూడిన మూడు-భాగాల వాతావరణ విధానాన్ని కూడా ప్రారంభించింది. మేము ఇప్పుడు భూత, భవిష్యత్, వర్తమాన కాలాల్లో కార్బన్ తటస్థ సంస్థగా అవతరించామని తెలియజేయడానికి గర్విస్తున్నాము. సైన్స్-ఆధారిత ఉద్గారాలను తగ్గించే లక్ష్యాలను స్వీకరించి, అట్టి కార్యక్రమాన్ని ప్రపంచ వ్యాప్తంగా నడిపే సంస్థచే మా లక్ష్యాలకు ఆమోదం పొందాము, ఈ విధంగా చేయడం వలన ఇలా చేసిన కొన్ని సంస్థల సరసన మమ్మల్ని చేర్చింది. మరియు ప్రపంచ వ్యాప్తంగా మా కార్యాలయాలన్నన్నింటి కొరకు 100% పునరుత్పాదక విద్యుచ్ఛక్తిని కొనుగోలు చేయడానికి కట్టుబడి ఉన్నాం. ఈ నిబద్ధత ఆరంభం మాత్రమే. మేము మా వాతావరణ కార్యక్రమాలను అత్యుత్తమ విధానాలతో ఎప్పటికప్పుడు మార్పు చేస్తూనే ఉంటాము, మరియు ఒక్క సంవత్సరం కాలంలోనే నెట్ జీరో కమిట్‌మెంట్‌కు తీసుకువచ్చే ప్రక్రియను ప్రారంభిస్తున్నాం.
మా నివేదికకు మద్దతుగా, ఈరోజు మేము సవరించబడిన ప్రవర్తనా నియమావళిని కూడా ప్రవేశపెడుతున్నాం, [లింక్‌ను చేర్చండి]. కొత్త నియమావళి మా టీమ్ సభ్యులకు, అంతర్జాతీయ వ్యాపారంలోని మా వాటా దారులందరి కొరకు సరియైనదానిని చేయడం అంటే ఏమిటి అని విస్తృతంగా ఆలోచించడంలో మాకు సహాయపడటానికి రూపొందించిన నైతిక నిర్ణయాలు తీసుకునే ముసాయిదాని అందిస్తుంది. ఈ ముసాయిదా మా సంస్థ దయను కలిగి ఉండటానికి ఇచ్చే విలువ ఆధారంగా ఉంటుంది. దయను కలిగి వ్యాపారాన్ని నడపటం అంటే సత్యాన్ని వినడానికి మరియు మాట్లాడటానికి, మా చర్యల ప్రభావాన్ని అర్థం చేసుకోవడం కోసం సహానుభూతిని ఉపయోగించడానికి, మరియు మా వాటాదారులలో మాపై నమ్మకాన్ని పెంపొందించే చర్యలను ఎంచుకోవడానికి ధైర్యాన్ని కలిగి ఉన్నాం అని అర్ధం. ఈ నియమావళి, దుష్ప్రవర్తనను నివారించడమే కాకుండా, బాధ్యతాయుతమైన వ్యాపారాన్ని నడపడం యొక్క పరమార్ధంలో భాగంగా మా వాటాదారుల శ్రేయస్సును పెంపొందించే మార్గాలను కనుగొనడంలో కూడా సహాయపడుతుంది.
పోయిన సంవత్సరం, నేర్చుకోవడానికి, ఎదగడానికి మరియు పునరావృతం చేయడానికి మాకున్న కోరికను ప్రతిబింబించే “చిత్తు ముసాయిదా” అని మా సిటిజన్Snap నివేదిక గురించి వ్రాశాము. అది ఇప్పటికి, ఎప్పటికీ సత్యమే. మా ప్రారంభ రోజుల నుండి, మా ప్లాట్‌ఫామ్‌ను ఎలా నిర్మించాలి మరియు వ్యాపారాన్ని ఎలా నడపాలి అనే విషయాలలో మేము చాలా భిన్నమైన ఎంపికలను ఎంచుకుంటూ వచ్చాము. దీర్ఘకాలిక పయనంలో మేము మా ఏకాగ్రతను కోల్పోకుండా కాపాడుకున్నాం. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, మేము సాధించిన మరియు సాధించ లేకపోయిన అంశాల విషయంలో పారదర్శకతను కొనసాగిస్తాము. మరియు మేము సేవలందించే సమాజాల విశ్వాసాన్ని చూరగొనడంపై దృష్టిని కలిగి ఉండే నిర్ణయాలను తీసుకోవడాన్ని కొనసాగిస్తాము.
మా సిటిజన్Snap నివేదిక ప్రత్యేకించి ఎంతో క్లిష్టమైన సంవత్సరంలో, ఈ సంస్థలోని అనేక బృందాల కఠోర శ్రమ మరియు తపనను ప్రతిబింబిస్తుంది. మనం ఇంతవరకు చేరుకున్నందుకు నేను మీ అందరికీ ఎంతో కృతజ్ఞుడను -- మరియు ముందున్న పని నన్ను ఉత్తేజితం చేస్తుంది.
ఇవాన్