ఈ రోజు మేం మా కంపెనీ పేరును Snap Inc.గా మారుస్తున్నాం.
నేను మరియు బాబీ, Snapchat గా మారిన చిన్న యాప్ Picabooపై పనిచేయడం మొదలుపెట్టి ఐదేళ్ళయింది – Snapchat మీద విస్తరణ కొనసాగించి ఇంకా స్టోరీస్, మెమరీస్, లెన్స్ మరియు ఇంకా మరెన్నో ఉత్పత్తులను రూపొందించిన ఒక అద్భుతమైన టీమ్ నిర్మించడం పట్ల మేం ఎంతో అదృష్టవంతులం!
మేము అప్పుడే మొదలుపెట్టినప్పుడు మా కంపెనీ Snapchat Inc., పేరు పెట్టాలనే స్పృహ కలిగింది, ఎందుకంటే Snapchat మా ఏకైక ప్రొడక్ట్‌గా ఉంది ఉండింది! ఇప్పుడు మేము Spectacles వంటి ఇతర ఉత్పత్తిని రూపొందిస్తున్నందున, ఒక ఉత్పత్తికి అతీతంగా వెళ్ళే ఒక పేరు మాకు కావాల్సి ఉంది – ఐతే మా టీము మరియు బ్రాండు సుపరిచితం మరియు వినోదాన్ని కోల్పోకూడదు.
మేము “చాట్” డ్రాప్ చేసి Snap Inc తో వెళ్ళాలని నిర్ణయించుకున్నాము!
మా పేరును మార్చడంలో కూడా మరొక ప్రయోజనం ఉంది: మా ప్రొడక్ట్ కోసం మీరు సర్చ్ చేసినప్పుడు విసుగు పుట్టే కంపెనీ సమాచారం మరియు ఆర్థిక విశ్లేషణకు బదులు సంబంధిత ఉత్పాదన సమాచారం కనుక్కోవడం సులభంగా ఉంటుంది. మీరు వినోదం కలిగించే దానికై Snapchat లేదా Spectacles సర్చ్ చేయవచ్చు మరియు వాల్ స్ట్రీట్ సమాచారం కోరేవారి కోసం Snap Inc.ని వదిలేయవచ్చు :)
Snapchat మరియు Spectacles తో మీ అనుభవాన్ని ఈ మార్పు మెరుగుపరుస్తుందనీ, మీకు ఇంకా మీ స్నేహితుల కోసం గొప్ప కొత్త ప్రొడక్ట్‌లు తయారు చేయడాన్ని కొనసాగించడానికి మాకు వీలు కల్పించే నిర్మాణాన్ని ఏర్పరుస్తుందని మేం ఆశిస్తున్నాం!