375 మిలియన్ రోజువారీ యాక్టివ్ యూజర్‌లతో, Snapchat సౌండ్స్ ఆర్టిస్ట్‌లు మరియు క్రియేటర్‌లు వారి సంగీతాన్ని ప్రపంచవ్యాప్తంగా పంచుకునేందుకు ఒక శక్తివంతమైన డిస్ట్రిబ్యూషన్ టూల్‌ను అందిస్తుంది. కొత్త సంగీతాన్ని కనుగొనడానికి మరియు స్ట్రీమింగ్ సేవల్లో వినడానికి కళాకారులకు సౌండ్స్ ఒక ప్రభావవంతమైన మార్గాన్ని అందిస్తుంది. అదే సమయంలో ఫ్లాట్‌ఫారమ్‌లోని కంటెంట్‌ను స్నేహితులతో పంచుకోవడానికి మరింత ఆహ్లాదకరమైన మరియు అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుంది.
ఇవాళ, మేము యునైటెడ్ మాస్టర్స్ మరియు రెండు కొత్త యూరోపియన్ కలెక్షన్ సొసైటీలతో Snapchat కొత్త మ్యూజిక్ డీల్‌లతో సౌండ్ లైబ్రరీని విస్తరిస్తున్నట్లుగా ప్రకటించడానికి మేము ఎంతో సంతోషంగా ఉన్నాము. ఈ భాగస్వామ్యాలు Snapchat సౌండ్స్ లైబ్రరీకి స్థానిక కళాకారుల సంగీతాన్ని జోడిస్తుంది, సృజనాత్మక సాధనాల ద్వారా Snapchatterలు తమ సందేశాలు మరియు Snapల్లో లైసెన్స్ పొందిన సంగీతాన్ని వినూత్నంగా మరియు సులభంగా పొందుపరచడానికి మరిన్ని ఎంపికలను అందిస్తుంది.
ఈ నెలలో, సౌండ్స్‌లో దిగువ సంస్థల నుంచి లైసెన్స్ పొందిన సంగీతం లభ్యమవుతుంది:
నెదర్లాండ్: BUMA/STEMRA
స్విట్జర్లాండ్: SUISA (స్విస్ కోఆపరేటివ్ సొసైటీ ఆఫ్ మ్యూజిక్ ఆథర్స్ అండ్ పబ్లిషర్స్)
Snapchatకు ప్రస్తుతం యూనివర్సల్ మ్యూజిక్ గ్రూప్, యూనివర్సల్ మ్యూజిక్ పబ్లిషింగ్ గ్రూప్, సోనీ మ్యూజిక్ ఎంటర్‌టైన్‌మెంట్, సోనీ మ్యూజిక్ పబ్లిషింగ్, వార్నర్ మ్యూజిక్ గ్రూప్, వార్నర్ చాపెల్, కోబాల్ట్, డిస్ట్రోకిడ్, BMG, NMPA పబ్లిషర్ సభ్యులు, మెర్లిన్, ఎంపైర్ డిస్ట్రిబ్యూషన్, మరియు 9000లకు పైగా స్వతంత్ర మ్యూజిక్ పబ్లిషర్‌లు మరియు లేబుల్స్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ మరియు స్వతంత్ర రికార్డ్ లేబుల్స్ మరియు మ్యూజిక్ పబ్లిషర్‌లతో ఒప్పందాలు ఉన్నాయి.