
తాజా Snapchat+ డ్రాప్‌తో మీ స్వంత Snapchat తయారుచేయండి
యాప్ ఐకాన్స్, కస్టమ్ థీమ్స్, మరియు Bitmoji పెంపుడు జంతువులు మరియు కార్లవంటి కొత్త ఫీచర్లను Snap మ్యాప్‌పై పరిచయం చేస్తున్నాం
న్దాదాపు ఒక సంవత్సరంనుండి మా Snapchat+ సబ్‌స్క్రైబర్ కమ్యూనిటీ, ప్రత్యేకమైన ఫీచర్లనుపయోగించి యాప్‌ను కస్టమైజ్ చేసుకొని, దానిని తమ స్వంతంగా మార్చుకోవడాన్ని వీక్షించడం నిజంగా అద్భుతంగా ఉంది. ఈ నెల, మా తాజా డ్రాప్ ఆఫర్లు, మిమ్మల్ని వ్యక్తీకరించేందుకు మరిన్ని మార్గాలను అందిస్తూ, Snapchatను మీ నిజ ప్రతిబింబంగా చేస్తోంది.
కొత్త యాప్ ఐకాన్లు
మీ హోమ్ స్క్రీన్‌ను తాజాగా మరియు ఈ వేసవి, టై-డై, రాత్రిపూట బీచ్, మరియు పిక్సెలేటెడ్ స్టైల్స్‌కు సిద్ధంగా ఉంచడానికి, ఎంచుకొనేలా ఐదు కొత్త యాప్ ఐకాన్లు అందుబాటులో ఉన్నాయి.
యాప్స్ థీమ్స్
మీ Snapchat రూపాన్ని మీ మూడ్‌కు సరిపోయేలా ఉండేలా పూర్తిగా మార్చేందుకు ఒక మార్గం కోరుకొంటున్నారా? మీ నావిగేషన్ బార్, నోటిఫికేషన్లు, మరియు మరెన్నింటినో పూర్తిగా కస్టమైజ్ చేయవచ్చు. కాబట్టి, బుధవారాలలో మీరు తల నుండి కాళ్ళవరకు గులాబీలో ఉంటే, మీ Snapchat మీకు సరిపోయినట్లు ఉంటుంది, మీరు యాప్ తెరిచినప్పుడు ఇది మీకు నిజంగా కనిపిస్తుంది.
Bitmoji పెంపుడు జంతువులు మరియు కార్లు
మీరు మీ పెట్‌తో రోడ్డుపైకి వెళ్ళినట్లయితే, అవి మీవెంటే Snap మ్యాప్‌పై రైడ్‌కు మీతోపాటే వస్తాయి. మీరు స్టైల్‌గా రైడ్ చేసేందుకు, కుక్కపిల్లల నుండి చిలుకల వరకు మరియు ఐదు కార్లను ఎంచుకోవడానికి వీలుగా 10 Bitmojiలను మేము త్వరలో కలిగివుంటాము.
ఈ కొత్త ఫీచర్లు మీ శైలితో సరిపోయేలా మీ అనుభవాన్ని మరింత మెరుగుపరచేందుకు Snapchat+ అందించే అనేక మార్గాలకు అదనంగా ఉంటాయి.
కస్టమ్ చాట్ వాల్‌పేపర్స్ ఉపయోగించి, లైబ్రరీ నుండి, ముందుగానే తయారుచేసిన ఐఛ్ఛికాల నుండి, కెమెరా రోల్ నుండి చిత్రీకరించిన లేదా మీ స్వంత జెనరేటివ్ AIతో సృష్టించిన వాటిని ఉపయోగిస్తూ, మీ ఫ్రెండ్స్‌తో చాట్‌లను మీకనువుగా చేసుకోండి. దానికితోడు, మీరు మీ Bitmoji బ్యాక్‌గ్రౌండ్‌ను, ప్రత్యేకంగా ఎంపిక చేయబడిన వాల్‌పేపర్స్ నుండి లేదా జెనరేటివ్ AIను ఉపయోగించి మార్చుకోవచ్చు.
నెలకు $3.99తో లభ్యమయ్యే Snapchat+ను స్నాప్‌చాటర్లు ఎప్పుడైనా తమ ప్రొపైల్‌ను సందర్శించడంద్వారా ఎనేబుల్ చేసుకోవచ్చు.
హ్యాపీ Snapchat+ing!