Snaps ఎలా నిల్వ చేస్తారు మరియు వాటిని ఎప్పుడు మరియు ఎలా తొలగిస్తారనే దానిపై ఇటీవల కొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పనులు ఎలా జరుగుతాయో చెప్పడంలో ముందుండడానికి మేము ఎల్లప్పుడూ ప్రయత్నించాము మరియు మా ఆచరణలకు మేము ఎటువంటి మార్పులూ చేయలేదు, కాబట్టి పనుల గురించి కాస్త ఎక్కువ వివరంగా చెప్పడం చక్కగా ఉంటుందని మేము భావించాము.
Snaps నిల్వ చేయడం
ఎవరైనా ఒక snap పంపిప్పుడు, అది మా సర్వర్లకు అప్‌లోడ్ చేయబడుతుంది, వారికి ఒక కొత్త snap వచ్చిందని స్వీకర్త(ల)కు ఒక నోటిఫికేషన్ పంపించబడుతుంది మరియు Snapchat యాప్ ఆ సందేశం కాపీని డౌన్లోడ్ చేస్తుంది. సందేశం నుండి చిత్రం లేదా వీడియో, పరికరం మెమరీలోని ఒక తాత్కాలిక ఫోల్డరులో నిల్వ అవుతుంది. ఇది, ఫ్లాట్‌ఫారం మరియు అది వీడియోనా లేదా చిత్రమా అనేదానిపై ఆధారపడి - కొన్నిసార్లు అంతర్గత మెమరీ, RAM లేదా SD కార్డు వంటి బాహ్య మెమరీ కావచ్చు.
మా సర్వర్ల నుండి Snaps తొలగింపు
ఒక snap వీక్షించబడి టైమర్ అయిపోతూ ఉంటే, యాప్ మా సర్వర్లకు తెలియ చేస్తుంది, అవి తిరిగి snap తెరవబడిందని పంపించినవారికి తెలియ చేస్తాయి. ఒక snap తన స్వీకర్తలందరిచే తెరిచినట్లుగా మనకు తెలియ చేయబడగానే, అది మా సర్వర్ల నుండి తొలగించబడుతుంది. ఒకవేళ snap 30 రోజుల వరకు తెరవనట్లయితే, అది కూడా మా సర్వర్ల నుండి తొలగించబడుతుంది.
స్వీకర్త పరికరం నుండి Snaps తొలగింపు
ఒక snap తెరచిన తర్వాత, దాని తాత్కాలిక కాపీ పరికరం స్టోరేజ్ నుండి తొలగించబడుతుంది. ఇది వెంటనే జరిగేలా మేం ప్రయత్నిస్తాం, కొన్నిసార్లు దీని ఒకటి లేదా రెండు నిమిషాలు పట్టవచ్చు. ఫోన్ ఫైల్ సిస్టమ్‌కు "డిలీట్" సూచన పంపించడం ద్వారా ఫైల్స్ తొలగించబడతాయి. ఇది కంప్యూటర్‌లు మరియు ఫోన్‌ల నుండి అంశాలను తొలగించే మామూలు పద్ధతి- మేం ప్రత్యేకంగా ఏమీ చేయం ( ‘‘తుడిచివేయడం’’ వంటివి).
అదనపు వివరాలు
పరికరంపై తెరవని ఒక snap భద్రపరిచినప్పుడు, Snapchat యాప్‌ని తప్పించుకోవడం మరియు ఫైల్స్ ని నేరుగా యాక్సెస్ చేసుకోవడం అసాధ్యమేమీ కాదు. మేం దీనికి మద్దతు ఇస్తాం లేదా ప్రోత్సహిస్తాం అని కాదు, చాలా సందర్భాల్లో ఫోన్‌ని బ్రేకింగ్ లేదా "రూటింగ్"చేయడం ద్వారా జరుగుతుంది మరియు దీని వల్ల వారెంటీ చెల్లుబాటు కాకుండా పోతుంది. మీరు ఒక snap ని సేవ్ చేయడానికి ప్రయత్నిస్తుంటే, మరొక కెమెరాతో స్క్రీన్‌షాట్ లేదా పిక్చర్ తీసుకోవడం సులభం (మరియు సురక్షితం).
అలానే, ఒకవేళ మీరు ఒక డ్రైవ్‌ని లేదా చూసిన CSI ఎపిసోడ్‌ని ఆకస్మికంగా డిలీట్ చేసిన తరువాత మీరు కోల్పోయిన డేటాని తిరిగి పొందడానికి ఎప్పుడైనా ప్రయత్నించినట్లయితే, తొలగించిన డేటాను సరియైన ఫోరెన్సిక్ టూల్స్ తో తిరిగి పొందడం కొన్నిసార్లు సాధ్యమవుతుందని మీకు తెలిసే ఉంటుంది. కాబట్టి ... మీకు తెలిసిందిగా...ఏవేని రహస్యాలు మీ సెల్ఫీల్లో ఉంచే ముందుగా దానిని మనసులో ఉంచుకోండి :)