17 సెప్టెంబర్, 2024
17 సెప్టెంబర్, 2024

SPS 2024 | సృష్టికర్తల కోసం ఒక కమ్యూనిటీ నిర్మించేందుకు మరియు విజయం సాధించేందుకు సరిక్రొత్త మార్గాలు

సంబంధాలనేవి Snapchat పై ప్రతి అనుభవంలో ముఖ్యమైనది. అందువల్లే, సంబంధాలనేవి మా కంటెంట్ అనుభవం - మీరు Snaps చేస్తున్నా లేదా కమ్యూనిటీ సృష్టించిన వీడియోలను చూస్తున్నాయొక్క హృదయంవద్ద ఉండటం సహజం.

గత సంవత్సరంలో బహిరంగంగా పోస్ట్ చేసే సృష్టికర్తల సంఖ్య సృష్టికర్తలు తమ స్టోరీలకు సుమారు 10 బిలియన్ Snaps పోస్ట్ చేయడం, 6 ట్రిలియన్ వీక్షణలు పొందడంద్వారా మూడింతలకంటే ఎక్కువ రెట్లు పెరిగింది.1సృష్టికర్తలకు తమ స్నేహితులు మరియు అభిమానులతో సంబంధాలను నెరపేందుకు, Snaps సృష్టించేందుకు, తమలాగానే ఉంటూ బహుమతులు అందుకోవడాన్ని మరింత సులభతరం చేయడాన్ని మేము కొనసాగిస్తున్నాము.

సృష్టికర్తలు తమ కమ్యూనిటీని పెంచుకోవడానికి కొత్త సాధనాలు

సులభతరం చేయబడిన ఒక ప్రొఫైల్ డిజైన్, 16 మరియు అంతకంటే ఎక్కువ వయస్సున్న Snapchatters వారి వ్యక్తిగత మరియు పబ్లిక్ అక్కౌంట్లమధ్య మార్చు్కొనేందుకు వీలు కల్పిస్తుంది. ఒకవేళ వారు తమ నిజ స్నేహితులతో కనెక్ట్ అయితే - వ్యక్తిగతం. అదే ఒకవేళ వారు ఒక విస్తృత ఆడియన్స్ వద్దకు వెళ్ళేందుకు ఎంచుకొంటే - పబ్లిక్. 16 మరియు 17 సంవత్సరాల వయస్కులకోసం, అత్యధిక గోప్యతా సెట్టింగులు డిఫాల్ట్ గా ఉంటాయి.

సృష్టికర్తలు తమ పబ్లిక్ ప్రొఫైల్‍కు తమకిష్టమైన Snap పిన్ చేయడంద్వారా వారు సృష్టించిన Snaps కొత్త వీక్షకులు సులభంగా గుర్తించేందుకు తమ పబ్లిక్ ప్రొఫైల్‍ను మరింత కస్టమైజ్ చేసుకోవడానికి వీలవుతుంది.

మెమొరీస్ మరియు కెమెరా రోల్ నుండి ఫోటోలు మరియు వీడియోలను ఉపయోగించి ఉత్తమమైన Snaps సృష్టించేందుకు మరియు పంచుకోవడాన్ని టెంప్లేట్లు కూడా సులభతరం చేస్తాయి. మీరు సిద్ధంగా ఉన్నప్పుడు, మీ జీవితంలో ఒక్కసారే ఉండే విహారయాత్ర యొక్క రికాప్‍ను పోస్ట్ చేసేందుకు ఆ క్షణంలోనే ఉండండి. టెంప్లేట్లు అన్నీ ఉత్తమ మరియు ఇప్పుడే వెలుగులోకి వస్తున్న కళాకారుల సంగీతంతో సౌండ్‍ట్రాక్ చేయబడతాయి.

ప్రతిరోజూ, Snapchatపై సృష్టికర్తలు మరియు వారి అభిమానుల మధ్య దాదాపు 15 బిలియన్ పరస్పర సంభాషణలు చోటుచేసుకొంటాయి.2

రిప్లైస్ మరియు కోటింగ్ ఫీచర్‍తో, Snapchatters, ఒక సృష్టికర్త యొక్క Snapపై వారికే నేరుగా సమాధానమివ్వవచ్చు లేదా బహిరంగాంగా వ్యాఖ్యానించవచ్చు. ఇక సృష్టికర్తలు తమ వీక్షకులతో మరింతగా మిళితమయ్యేందుకు అవకాశం కల్పిస్తూ, ఆ సందేశాన్ని ఒక ఫోటో లేదా వీడియో సమాధానంగా మార్చుకోవచ్చు.

సృష్టికర్తలు విజయం సాధించేందుకు మరిన్ని మార్గాలు

మా Snap Star Collab Studio, సృష్టికర్తలు మరియు బ్రాండ్ల మధ్య భాగస్వామ్యాన్ని వేగవంతం చేసేందుకు మద్దతిస్తుంది. మా ప్రాధాన్యమిచ్చే భాగస్వాములు మరియు నూతన స్వయం-సేవ సాధనాల ద్వారా సృష్టికర్తలు తాము ఉన్న స్థితిని మరియు జనాభా డేటాను బ్రాండ్లకు చూపించేందుకు ఎంచుకోవచ్చు. దీనితోపాటే, త్వరలోనే వారు Snapchatపై ఏ అడ్వర్టైజర్‍‍తోనైనా ఈ సమాచారాన్ని నేరుగా పంచుకోవడానికి వీలు కలుగుతుంది.

సృష్టికర్తలు, తమ సరైన స్టోరీస్ మరియు స్పాట్‌లైట్ అన్నింటికీ బహుమతి గెలుచుకోవచ్చు. అలాగే, లెన్సెస్ మరియు సౌండ్స్ వంటి మా పూర్తిస్థాయి సృజనాత్మక సాధనాలు, స్వీయ-భావప్రకటనతో ఆడియన్స్ నిర్మించుకొనేందుకు ఎన్నో అవకాశాలు ఉండే ఒక వాతావరణ వ్యవస్థ ఏర్పడేందుకు ఎంతో మద్దతిచ్చాయి.

మీరు ఏమి సృష్టిస్తారనే దాని గురించి మేము ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం!

వార్తలకు తిరిగి వెల్దాం

1 Snap Inc. అంతర్గత డేటా - జూన్ 30, 2024 నాటిది

2 Snap Inc. అంతర్గత డేటా - Q2 2024 ఆదాయాలు

1 Snap Inc. అంతర్గత డేటా - జూన్ 30, 2024 నాటిది

2 Snap Inc. అంతర్గత డేటా - Q2 2024 ఆదాయాలు