ఎన్నో సంవత్సరాలుగా, కచేరీలు మరియు ఉత్సవాలలో దృశ్య భావవ్యక్తీకరణకు ప్రపంచవ్యాప్తంగా వీడియో స్క్రీన్లే వేదికలుగా ఉన్నాయి. అవి కళాకారులు తమ కథలను చెప్పడానికి, సంగీతానికి జీవంపోయడానికి దోహదం చేశాయి. Snap యొక్క ఆగ్మెంటెడ్ వాస్తవికత, అభిమానులు కళాకారుల ప్రదర్శనను ఆస్వాదించే విధానాన్ని మార్చేందుకు గొప్పదైన ఒక సృజనాత్మకత నిండిన ఒక కొత్తదైన టూల్‌ను అందిస్తోంది.
ఈ రోజు మేము, వేదికలు మరియు స్క్రీన్లకు ఆవల ప్రదర్శనలను మరింత మెరుగుపరచేందుకు Live Nationతో బహుళ-సంవత్సర భాగస్వామ్యాన్ని ఎంతో ఉత్సుకతతో ప్రకటిస్తున్నాము - ఇది Snap Inc. యొక్క క్రియేటివ్ స్టూడియో ఆర్కాడియా నుండి సహకారంతో, కస్టమ్-నిర్మిత, ఎఆర్ లోతుగా దృష్టినిలిపేలా కళాకారులు మరియు అభిమానుల మధ్య ఒక సన్నిహితమైన సంబంధాన్ని ఏర్పరస్తుంది.
అభిమానులు AR అనుభవాలకై ఎంపికచేయబడిన కచేరీలవద్ద Snapchat కెమెరాలను తెరవవచ్చు, ఇవి ఒక ప్రదర్శనకు హాజరయిన అనుభూతిని నిరంతరం అందించడంతోపాటు, కళాకారుని సృజనాత్మక వేదికను ప్రేక్షకులలోకి విస్తరించి, భిన్నమైన మరియు మర్చిపోలేని మధురక్షణాలను సృష్టిస్తాయి. ఉత్సవాలకు హాజరైనవారు, ARను మర్చండైజ్‌కు, మిత్రులను కనుగొనేందుకు, ఉత్సవాలు జరిగే మైదానాల చుట్టుప్రక్కల ఉండే ప్రత్యేకమైన ప్రదేశాలను కనిపెట్టేందుకు ఉపయోగించవచ్చు.
రాబోయే సంవత్సరాలలో చికాగోలోని లొల్లాపాలూజా మరియు లండన్‌లోని వైర్‌లెస్ ఫెస్టివల్‌నుండి మియామీలోని రోలింగ్ లౌడ్ మరియు న్యూయార్క్‌లోని ది గవర్నర్స్ బాల్ వరకు ఉత్సవాలు, Snap AR చే ఉన్నతీకరించబడతాయి.
మొదటగా, 8 సంవత్సరాల క్రితం "అవర్ స్టోరీ"ని సృష్టించేందుకు మాకు సహాయంచేసిన ఎలక్ట్రిక్ డైసీ కార్నివాల్, అభిమానులు ఉత్సవాలను ఒక కొత్త లెన్స్ ద్వారా ఆస్వాదించేందుకు మా ఆగ్మెంటెడ్ వాస్తవికత టెక్నాలజీని ఉపయోగిస్తుంది. రాబోయే మే నెలలో జరగబోయే కార్యక్రమంతో, ఉత్సవాలకు వెళ్ళేవారు, ఇంతకుముందెప్పుడూ లేనంత కొత్తగా ఉండే సంగీత అనుభవాన్ని ఆస్వాదించవచ్చు.