Why We’re Standing with Apple

Over 100 million people use Snapchat every day because they feel free to have fun and express themselves. We take the security and privacy of all that self expression seriously. That’s why we’ve filed a legal brief today supporting Apple in its dispute with the FBI.
ప్రజలు వినోదం పొందడానికి మరియు తమకు తాము వ్యక్తీకరించడానికి స్వేచ్ఛను పొందుతున్నారు కాబట్టి 100 మిలియన్ మందికి పైగా Snapchat ఉపయోగిస్తున్నారు. ఆ స్వీయ వ్యక్తీకరణలన్నింటి భద్రత మరియు గోప్యతను మేము చాలా తీవ్రంగా పరిగణిస్తాం. అందుకనే FBI తో ఉన్న వివాదములో Appleకు మద్దతుగా మేం ఈరోజున ఒక చట్టబద్ధమైన వివరణను దాఖలు చేశాం.
ఈ వివాదం యొక్క కేంద్ర బిందువుగా, శాన్ బెర్నార్డినో ఉగ్రదాడి వెనుక ఉన్న ఉగ్రవాదుల్లో ఒకరైన సయ్యద్ రిజ్వాన్ ఫారూక్‌కు లింక్ చేసిన లాక్ చేయబడ్డ ఒక iPhone ఉంది. Apple నుండి ఇంజనీరింగ్ సాయం లేనిదే FBI iPhoneని లాక్ చేయలేదు, కాబట్టి ఆ ఫోన్‌లోనికి ఒక "బ్యాక్ డోర్" ఏర్పరచడానికి కొత్త iOS కోడ్ రాయాల్సిందిగా Appleకు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
అంటే దాని అర్థం సింగిల్ ఫెడరల్ న్యాయమూర్తి తమ స్వంత సాఫ్ట్‌వేర్‌ని హ్యాక్ చేయడానికి Apple ఇంజనీర్‌లను బలవంతం చేశారు. ఇంతకు ముందు ఎన్నడూ ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీలు తమ స్వంత ఉత్పత్తులను ఎలా డిజైన్ లేదా (విప్పదీయడం) చేయాలనే విస్త్రృత అధికారాలను ప్రదర్శించలేదు.
అయితే ఈ ఆందోళనలు ఏదైనా ఒక్క కంపెనీ తన ఉత్పత్తులను రూపొందించడానికి తనకు ఉన్న స్వేచ్ఛకు అతీతంగా వెళ్ళాయి. ఈ ఆదేశముతో గల నిజమైన ప్రమాదము ఏమిటంటే, మీ సమాచారం మరియు కమ్యూనికేషన్ల భద్రతకు అది కలిగించే ఆటంకం. ఇక్కడ Snapchat వద్ద, ప్రజలు తమకు తాము స్వేచ్ఛగా భావించుకోవడానికి సహాయపడే మార్గములో వారి కంటెంట్‌ని మాకు పంపించడానికి విశ్వసిస్తారు. కోర్టు గనక అకస్మాత్తుగా, ఎప్పుడైనా సరే పంపించబడిన ప్రతి Snapని భద్రపరచడానికి గాను మా ఉత్పత్తులను తిరిగి రూపకల్పన చేయాలని ఆదేశిస్తే, మా సర్వీస్ ఇదే విధంగా ఉండదు. అందుకనే మేము Apple తో నిలుస్తున్నాము.
శాన్ బెర్నార్డినోలో పాల్పడిన మాటల్లో చెప్పలేని ఘోరాన్ని ఖండిస్తున్నామని మేం చాలా స్పష్టంగా చెప్పదలచుకున్నాము, బాధితులు మరియు వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాం. ఉగ్రవాదులు లేదా మరెవరైనా నేరస్థుల పట్ల Snapchatకు ఏ మాత్రమూ జాలి లేదు. సాయం కోసం మాకు చట్టబద్ధమైన అభ్యర్థనలు అందినప్పుడు చట్టాన్ని అమలుచేసే యంత్రాంగానికి సహకరించడం ద్వారా మేం దానిని నిరూపిస్తాం. 2015 మొదటి ఆరు నెలల్లోనే, మేము 750 కి పైగా తాఖీదులు, కోర్టు ఉత్తర్వులు, సెర్చ్ వారెంట్లు, మరియు ఇతర చట్టబద్ధ అభ్యర్థనలను ప్రాసెస్ చేశాం. వివరాలన్నింటినీ మీరు మా పారదర్శకత నివేదికలో చూడవచ్చు.
మా వద్ద ఉన్న సమాచారాన్ని ప్రభుత్వానికి ఇవ్వడానికీ, ప్రస్తుతం ఎవ్వరికీ లేనటువంటి యాక్సెస్‌ని కలిగించడానికై మా ఉత్పత్తులను తిరిగి డిజైన్ చేయమని బలవంతం చేయడానికి మధ్య పెద్ద వ్యత్యాసం ఉంది. ఒకవేళ ఒక న్యాయమూర్తి Apple ని తన ఫోన్ లోనికి ఒక బ్యాక్ డోర్ ఏర్పరచమని ఆదేశించారంటే, మరొక న్యాయమూర్తి మా డేటా పరిరక్షణలను అతిక్రమించమని కూడా మమ్మల్ని ఆదేశించవచ్చు.
ఈ రూలింగ్ గురించి మమ్మల్ని నిజంగా ఇబ్బందిపెట్టే విషయం మరొకటుంది. ప్రభుత్వం ఈ విస్తృతమైన కొత్త అధికారముతో ముందుకు రావడానికి గల ఏకైక ఆధారం, 1789 లో చేయబడిన ఒక శాసనం. అది అక్షర దోషం కాదు. ఫోన్ల గురించి, స్మార్ట్ ఫోన్ల, అసలు ఊహించనైనా ఊహించలేని ఒక పాలకుల మండలి అయిన మొట్టమొదటి కాంగ్రెస్ ద్వారా 220 సంవత్సరాల క్రితం రాయబడిన ఒక చట్టము — న్యాయబద్ధమైన ఏకైక కొలమానముగా నిలిచి ప్రజాస్వామ్య ప్రక్రియను తప్పించుకోవటానికి ప్రభుత్వం సాహసోపేత నిర్ణయానికి కారణమైంది.
జాతీయ భద్రతలో నిరాకరించజాలని ముఖ్యమైన ప్రయోజనాలను, వ్యక్తిగత సమాచార గోప్యత మరియు భద్రతను పరిరక్షించుకోవడంలో అంతే సమానంగా ముఖ్యమైన ప్రయోజనాలతో ఎలా సమతుల్యం చేసుకోవాలనే దాని గురించి ఒక దేశముగా మనం ఒక ముఖ్యమైన చర్చ జరపాల్సిన అవసరం ఉంది. ఆ చర్చలను మేము స్వాగతిస్తాము. ఐతే ఈ విషయాలు మామూలుగా జరగాల్సిన పద్ధతిలో జరగాల్సి ఉంది: కాంగ్రెస్ కంటే ముందు ప్రజాస్వామ్యయుత అభిప్రాయాలను పంచుకోవడం ద్వారా. సాంకేతిక కంపెనీలపై ఏకైక న్యాయమూర్తి తీవ్రమైన కొత్త ఆదేశాలను విధించడానికి వీలు కలిగించడం ఈ ముఖ్యమైన సమస్యల పరిష్కారానికి సరియైన మార్గము కాదు.
తమ ఉత్పత్తులను తాము ఎలా రూపకల్పన చేయాలో ప్రభుత్వము వ్యాపార నిర్వాహకులకు చెప్పగలిగి ఉండాలా అనేదాని గురించి నిజాయితీతో కూడిన సంభాషణలు జరపడానికి చట్టాలు చేసేవారు, వ్యాపార నిర్వాహకులు, మరియు వినియోగదారులకు ఇది సరైన సమయము.
ఎవాన్ స్పీగెల్
Back To News