05 ఏప్రిల్, 2024
05 ఏప్రిల్, 2024

అత్యుత్తమ ఫ్రెండ్స్ , స్ట్రీక్స్, మరియు సౌర వ్యవస్థ

గత వారం రోజుల పాటు, Snapchat పైన అత్యుత్తమ ఫ్రెండ్స్ , స్ట్రీక్స్, మరియు సౌర వ్యవస్థ ఫీచర్ల గురించిన ఆందోళనలను మేము విన్నాము. ఫీచర్‌లు ఎలా పని చేస్తాయో అనేదాని గురించి కొంత అయోమయం ఉన్నప్పటికీ, మా కమ్యూనిటీ యొక్క శ్రేయస్సు పైన ఈ ఫీచర్‌లు కలిగి ఉండే ప్రభావం గురించి ఆందోళనలు ఉన్నాయనేది నిస్సందేహంగా సుస్పష్టమైన విషయం. ఈ ఫీచర్లు ఎలా పనిచేస్తాయో, మేము వాటిని ఎందుకు నిర్మించామో, మరియు ముందుకు వెక్ళ్ళడానికి మేము ఏమి ప్రణాళిక చేసుకుంటున్నామో మేము వివరించాలనుకుంటున్నాము.

అత్యుత్తమ ఫ్రెండ్స్ అనేది ఒక ప్రైవేటు ఫీచర్, అది వ్యక్తులు ఒక రోలింగ్ కాలవ్యవధిలో ఎక్కువ తరచుగా మాట్లాడుకునే వ్యక్తులను చూపుతుంది. ప్రజలు సాధారణంగా మా సేవ పైన పెద్ద సంఖ్యలో కాంటాక్టులు కలిగి ఉన్నప్పటికీ, Snapchat పైన వారు ఫ్రెండ్స్ యొక్క గ్రూప్ తో మాట్లాడుతూ వారి సమయాన్ని చాలా ఎక్కువగా గడుపుతుంటారు కాబట్టి ఇది వారికి ఒక అనుకూలమైన ఫీచర్ అయి ఉంది. మీరు అత్యంత తరచుగా మాట్లాడుతున్న ఫ్రెండ్స్ ని మీ సంప్రదింపు జాబితా యొక్క అగ్రభాగంలో ఉంచడం ద్వారా మీరు ఒక Snap పంపించాలనుకున్నప్పుడు కనుక్కోవడం వారికి సులభమవుతుంది. ఆ వ్యక్తులు మీ చాట్ ఇన్‌బాక్స్‌లో కనుగొనడానికి సులభం అయ్యేలా ఒక హృదయం లేదా ఒక స్మైలీ ముఖాన్ని జోడించడం ద్వారా ఆ స్నేహాలను సూచించడానికి మేము ఇమోజీలను కూడా ఉపయోగిస్తాము. ఈ ఎమోజీలు ఇతరులకు కనిపించవు.

మీరు Snapchat పైన మీ ఫ్రెండ్స్ ఒకరితో ముందుకు వెనుకకు ఒక Snap ని వరుసగా ఎన్ని రోజులు పంపించారు అనేందుకు స్ట్రీక్స్ అనేవి ఒక ప్రైవేటు ప్రాతినిధ్యంగా ఉంటాయి. వ్యక్తులు తాము శ్రద్ధ వహించే వ్యక్తులతో సంప్రదింపులో ఉండటానికి ఒక ఆహ్లాదకరమైన రిమైండర్ గా స్ట్రీక్స్ నిర్వహించుకోవడానికి ఆనందిస్తారు. అనేక సంవత్సరాలుగా, స్ట్రీక్స్ తమ స్నేహాలను ప్రపంచవ్యాప్తంగా మరియు సమయ మండలాల వ్యాప్తంగా మద్దతు ఇస్తున్న మంచి మరియు చెడు ద్వారా ఆ మార్గాలపై ప్రతిస్పందించిన వ్యక్తుల నుండి మేము హృదయపూర్వకమైన గమనికలను అందుకున్నాము. తమ స్ట్రీక్ ను నిర్వహించడానికి గాను Snap పట్ల ప్రతిస్పందించడానికి కొన్నిసార్లు ఒత్తిడి భావించినట్లుగా మా కమ్యూనిటీ నుండి మేము ఫీడ్ బాక్ అందుకున్నప్పుడు, కోల్పోయిన స్ట్రీక్స్ ని త్వరగా పునరుద్ధరించడానికి మేము దీనిని సులభం చేశాము.

సౌర వ్యవస్థ అనేది Snapchat+ సబ్స్క్రిప్షన్ తో మాత్రమే అందుబాటులో ఉండే ఒక ఐచ్ఛికమైన మరియు ప్రైవేట్ ఫీచర్ అయి ఉంది మరియు సగటున మా కమ్యూనిటీ యొక్క 0.25% కంటే తక్కువ మందిచే ప్రతి రోజు ఉపయోగించబడుతూ ఉంది. మా సౌర వ్యవస్థలో ఒక గ్రహం మీద మీ ఫ్రెండ్‌ని సూర్యునిగా మరియు మీ Bitmoji అవతార్ ని చూపించడం ద్వారా మీ ఫ్రెండ్స్ లో ఒకరు మీతో ఎంత తరచుగా కమ్యూనికేట్ చేస్తారో ఇది ప్రదర్శించి చూపుతుంది. ఇది ఏ ఇతర ఫ్రెండ్స్ ని చూపించడం లేదు, ఇది ఒక సంఖ్యాపరమైన ర్యాంకింగ్ కాదు, మరియు ఇది మరెవరికీ కనిపించదు. తమ స్నేహాల గురించి మరింత తెలుసుకోవాలని వారు కోరుకుంటున్నారని మేము Snapchat కమ్యూనిటీ నుండి ఫీడ్ బాక్ అందుకున్నాము కాబట్టి మేము సౌర వ్యవస్థను నిర్మించాము. ఆన్‌లైన్ సంభాషణలు తరచుగా ముఖా-ముఖీ సంభాషణల సందర్భంగా కనిపించే అదే సందర్భం మరియు సామాజిక సంకేతాలను లోపిస్తాయి, మరియు సౌర వ్యవస్థ వంటి ఫీచర్‌లు అదనపు అవగాహన మరియు సందర్భాన్ని అందించడానికి సహాయపడతాయి.

సౌర వ్యవస్థ ఫీచర్‌ను ఉపయోగించే Snapchat+ చందాదారుల నుండి మేము విపరీతమైన ఫీడ్ బాక్ అందుకున్నాము, అయితే మీరు ఎవరో ఒకరికి సన్నిహితంగా ఉన్నారని తెలుసుకోవడం మంచి భావనగా అనిపించినప్పటికీ, మీరు ఉండాలనుకుంటున్న విధంగా అంత సన్నిహితమైన ఫ్రెండ్ లాగా మీరు లేరనే విషయాన్ని తెలుసుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుందని మేము అర్థం చేసుకున్నాము. సౌర వ్యవస్థ ఆ అనుభూతిని మరింత క్షీణింపజేయగలుగుతుందనే విషయాన్ని మేము విని, అర్థం చేసుకున్నాము, మరియు దానిని మేము నివారించాలనుకుంటున్నాము.

మేము సౌర వ్యవస్థ ఫీచరును డీఫాల్ట్ గా ఆఫ్ చేయబోతున్నాము, తద్వారా మరింత ఎక్కువ స్నేహం గ్రాహ్యతలను కోరుకునే Snapchat+ చందాదారులు దానిని మరింత ముందస్తు చొరవతో ఆన్ చేసుకోవచ్చు, మరియు కోరుకోని వారు దానిని చూడవలసిన అవసరం ఎప్పటికీ ఉండదు. దీనిని ఉపయోగించకూడదని అనుకునే వారిని ఇబ్బంది పెట్టకుండా, దానిని ఉపయోగించే అనేక మంది కోరుకునే ఫీచర్‌ను అందించడం మధ్య ఇది సరైన సమతుల్యతను సాధిస్తుందని మేము ఆశిస్తున్నాము. ఫీచర్‌ను తదుపరిగా మదింపు చేయడానికి మరియు మా కమ్యూనిటీ కోసం మేము దానిని మెరుగుపరచగలగడానికి అదనపు మార్గాలు ఉన్నాయా లేదో నిర్ధారించడానికి కూడా మేము సమయం తీసుకుంటాము.

స్మార్ట్‌ఫోన్ సాంకేతికత యొక్క ప్రభావం విషయానికి వచ్చినప్పుడు మేము లెక్కించుకునే ఒక ముఖ్యమైన క్షణంలో ఉన్నామనేది చాలా సుస్పష్టం. మేము మా ఫ్రెండ్స్ నుండి భౌతికంగా విడిపోయినప్పుడు వారితో ఆన్‌లైన్‌లో సంప్రదింపులో ఉండగలగటానికి మరియు వారితో సంబంధబాంధవ్యాలను ఏర్పరచుకోవడానికి లెక్కలేనన్ని ప్రయోజనాలు ఉన్నాయని మేము నమ్ముతున్నాము మరియు సాధ్యమైన చోటల్లా ఆన్‌లైన్ కమ్యూనికేషన్ యొక్క సంభావ్య ప్రతికూలతలను తగ్గించడానికి మేము కట్టుబడి ఉన్నాము.

ఆన్‌లైన్ సంభాషణలు వాస్తవ ప్రపంచపు సంభాషణలతో సమానంగా అనిపించడానికి మేము Snapchat ని నిర్మించాము. అందుకనే ప్రజలు Snaps ద్వారా తమను దృశ్యమానంగా వ్యక్తీకరిస్తారు, ఎందుకంటే ఒక పిక్చర్ వెయ్యి పదాలను చెబుతుంది. ప్రజలకు ముఖా-ముఖీ సంభాషణ లాగా మరింత సౌకర్యవంతంగా అనిపించేలా సహాయం చేయడానికి మేము డీఫాల్ట్ గా సందేశాలను తొలగిస్తాము. మాకు బహిరంగ ఫ్రెండ్ జాబితాలు లేదా ప్రజా ఇష్టాలు లేవు, తద్వారా Snapchat తానొక బహిరంగ ప్రజాదరణ పోటీ లాగా భావించడం లేదు. మేము కంటెంట్ ని మధ్యస్థంగా ఉంచుతాము తద్వారా ప్రజలు తాము చూడకూడదనుకుంటున్న విషయాలకు బహిర్గతం కారు.

ప్రజలు సంప్రదాయక సోషల్ మీడియాతో పోలిస్తే సేవ ఉపయోగించేటప్పుడు Snapchat తమను మరింత సంతోషంగా, కనెక్ట్ అయ్యేలా మరియు సృజనాత్మకత అనుభూతి చెందేలా చేస్తున్నాయని ఎందుకు మాకు చెబుతున్నారో కారణం ఈ డిజైన్ ఎంపికలు అని మేము నమ్ముతున్నాము. 1 అందుకనే Snapchat నంబర్ వన్ అత్యంత సంతోషకరమైన వేదికగా ర్యాంక్ చేయబడిందని కూడా మేము నమ్ముతున్నాము. 2

మా సేవ తో సానుకూల సమర్థత చేయడానికి మేము చాలా తీవ్రంగా కట్టుబడి ఉన్నాము. సన్నిహిత స్నేహాలను సానుకూలపరచడానికి మరియు వాటికి మద్దతు ఇవ్వడానికి మరియు వాటి సంబరాలు జరుపుకోవడానికి Snapchat రూపొందించబడింది. ఈ మార్పులు సరైన దిశలో ఒక ముందడుగు అని మేము ఆశిస్తున్నాము, మరియు మేము సేవను రూపొందించేటప్పుడు మేము మా కమ్యూనిటీ నుండి ఫీడ్ బాక్ వినడం కొనసాగిస్తాము.

సంతోషంగా స్నాపింగ్ చేయండి,

టీం Snapchat

వార్తలకు తిరిగి వెల్దాం

1

మూలం: 2023 ఆల్టర్ ఏజెంట్స్ అధ్యయనం. Snap Inc. చే ఏర్పాటు చేయబడినది

2

మూలం: Wakefield, J.R.H., Sani, F., Madhok, V. et al. గ్రూప్ గుర్తింపు మరియు అంతర- సాంస్కృతిక సమాజపు నమూనాలో జీవితంతో సంతృప్తి మధ్య సంబంధబాంధవ్యం. జె హ్యాపినెస్ స్టడ్ 18, 785-807 (2017). https://doi.org/10.1007/s10902-016-9735-z; 2021 Snap Inc. చే ఏర్పాటు చేయబడిన కొనుగోలు అధ్యయనానికి Goodques మార్గం.

1

మూలం: 2023 ఆల్టర్ ఏజెంట్స్ అధ్యయనం. Snap Inc. చే ఏర్పాటు చేయబడినది

2

మూలం: Wakefield, J.R.H., Sani, F., Madhok, V. et al. గ్రూప్ గుర్తింపు మరియు అంతర- సాంస్కృతిక సమాజపు నమూనాలో జీవితంతో సంతృప్తి మధ్య సంబంధబాంధవ్యం. జె హ్యాపినెస్ స్టడ్ 18, 785-807 (2017). https://doi.org/10.1007/s10902-016-9735-z; 2021 Snap Inc. చే ఏర్పాటు చేయబడిన కొనుగోలు అధ్యయనానికి Goodques మార్గం.