19 జులై, 2023
19 జులై, 2023

Bitmoji ఒక కొత్త అవతార్ స్టైల్‌ను పరిచయం చేస్తోంది

ఈ రోజు, Bitmoji మ్యాజిక్‌ను మరింత ఆకర్షణీయమైన రూపంలో తీసుకొని వచ్చేందుకు 3D లో కొత్త అవతార్ స్టైల్‌ను పరిచయం చేయడానికి ఎంతో ఉత్సుకతతో ఉన్నాము.

మా డిజిటల్ గుర్తింపులు మాతో కలసి అభివృద్ధి చెందాలి. మీరు ఒక నూతన కేశాలంకరణ చేయించుకొంటున్నప్పుడు లేదా మీ స్టైల్‌ను మారుస్తున్నప్పుడు, మీ అవతార్ కూడా దానితో మారుతుంది. 15 సంవత్సరాలుగా, Bitmoji మా కమ్యూనిటీ తమనుతాము ఆన్‌లైన్‌లో ప్రాతినిధ్యం వహించేందుకు మార్గం చూపుతూ, ప్రపంచవ్యాప్తంగా 1.7 బిలియన్ అవతారాలు సృష్టించబడ్డాయి.

ఈఈ రోజు, Bitmoji మ్యాజిక్‌ను మరింత ఆకర్షణీయమైన రూపంలో తీసుకొని వచ్చేందుకు 3D లో కొత్త అవతార్ స్టైల్‌ను పరిచయం చేయడానికి ఎంతో ఉత్సుకతతో ఉన్నాము. ఇది రాబోయే వారాల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబడుతుంది!

కొత్త అవతార్ స్టైల్, మెరుగుపరచబడిన జుట్టు అల్లిక, ముఖం యొక్క షేడింగ్, శరీరంలోని ఇతర భాగాల లక్షణాలు కలిగివుంటుంది. మీ Bitmoji, వారు ఆశ్చర్యపోయినప్పుడు, బోల్డ్‌గా ఉండే చిరునవ్వు, మరింత ఆకర్షణీయంగా ఉండే ముఖం కలిగివుండటంతోపాటు, మరింత చమత్కారమైన, భిన్నమైన భావాలను వ్యక్తపరచవచ్చు. దీనికితోడు, మరింత దగర్గగా కనపడేందుకు జూమ్ మరియు రొటేట్ ఫీచర్లను ఉపయోగించి, మీరు మీ అవతార్‌ను 3Dలోకి మార్చుకోవడానికి ఉన్నతీకరించబడిన ఎడిటింగ్ వంటి ఫీచర్లతో మీ Bitmoji మరింత కట్టిపడేసేలా ఉంచేలా మార్పులు చేశాము.

Bitmoji ప్రపంచంలోకి నిజమైన వస్త్రాలను చొప్పించడంలో - చివరి కుట్టువరకు - ఎంతో శ్రద్ధ మరియు కళా నైపుణ్యాలు కూడా ఉపయోగించబడినాయి. ఈ కొత్త అవతార్‌తో, డిజిటల్ దుస్తులు మరింత వాస్తవంగా కనిపిస్తూ, మీరు Snapchatపై వాస్తవ ప్రపంచంలో కనిపించే విధంగా, మీ వ్యక్తిగత శైలి మరింత ఉత్తమంగా కనిపించేందుకు మీకు దోహదం చేస్తుంది.

కార్టూన్-ప్రేరిత మరియు సృజనాత్మక స్టోరీ టెల్లింగ్ విధానంలో ఎవరైనా ఆన్‌లైన్‌లో కమ్యూనికేట్ చేయడాన్ని Bitmoji సాధ్యం చేస్తుంది మరియు 3Dలో అత్యుత్తమంగా కస్టమైజ్ చేయబడిన అవతార్, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న మా కమ్యూనిటీని మరింత ఉత్తమంగా ప్రాతినిధ్యం వహించేందుకు అవకాశం కల్పిస్తుంది. ఉన్నతీకరించబడిఅన మీ Bitmojiతో మీరు మిమ్మల్ని ఎలా వ్యక్తీకరించుకొంటారో చూసేందుకు మేమింకా నిరీక్షించలేము!

వార్తలకు తిరిగి వెల్దాం