మీ తరువాతి స్కైప్ చాట్‌లో Snap ద్వారా శక్తిమంతం చేయబడిన లెన్సెస్‌తో మిమ్మల్ని మీరు వ్యక్తపరచండి.
Snap కెమెరా కిట్ స్కైప్‌కు Snap కెమెరా కిట్ స్కైప్‌కు మరింత ఆహ్లాదాన్ని, సృజనాత్మకతను జతచేస్తుంది.

మా Snapchat కమ్యూనిటీ వారికి ఇష్టమయిన వ్యక్తులతో తమను తాము వ్యక్తపరచడానికి, ఆహ్లాదకరమైన సంభాషణలను కొనసాగించడంలో లెన్సెస్ మద్దతిస్తుంది. ఇది సుమారుగా ప్రతి ముగ్గురిలో ఇద్దరు Snapchatters ప్రతిరోజూ AR ఉపయోగించడాన్ని సూచిస్తుంది.
ఈ రోజునుండి ప్రారంభిస్తూ, లెన్సెస్ మాయాజాలాన్ని స్కైప్‌కు జోడిస్తున్నాము, దీనివల్ల 80 మిలియన్లకుపైగా ఉన్న నెలవారీ క్రియాశీల స్కైప్ వినియోగదారుల కమ్యూనిటీ, ఫ్రెండ్స్ మరియు కుటుంబంతో జరిపే వారి సంభాషణలకు లెన్సెస్ చేర్చగలుగుతారు. ఎంచుకోవడానికి ఉన్న డజన్లకొద్దీ ఉన్న లెన్సెస్‌తో, ఇప్పుడు చాట్స్‌ను మరింత పర్సనలైజ్ చేయడంతోపాటు, మెరుస్తుండే గడ్డం పెట్టుకోవడంనుండి, డిస్కో గ్లాసులు ధరించడం లేదా అతిమామూలుగా మీ హృదయంనుండి ప్రేమను వర్షింపజేయడంవరకు ఎన్నో ఎంపికలు లభ్యం.

Snap యొక్క ఈ AR టూల్స్ ఈ కొత్త కలయికను శక్తిమంతం చేస్తున్నాయి. లెన్సెస్, మా AR ఆథరింగ్ టూల్ Lens Studio ద్వారా సృష్టించబడతాయి మరియు ఇవి మా కెమెరా కిట్ SDK ద్వారా స్కైప్‌పై అందుబాటులో ఉంటాయి. ఇవి భాగస్వాములు తమ స్వంత యాప్స్ మరియు వెబ్‌సైట్లలో పంపిణీ చేయడానికి అనుమతిస్తాయి. Lens Studio మరియు కెమెరా కిట్‌లు, మైక్రోసాఫ్ట్ టీమ్స్, స్విఫ్ట్‌కీ, మైక్రోసాఫ్ట్ ఫ్లిప్‌లలో కూడా AR అనుభవాలను అందిస్తాయి.
రాబోయే నెలల్లో స్కైప్ తమ లైబ్రరీని లెన్సెస్ చేర్చడంద్వారా, స్కైప్ వినియోగదారులు తమ హాలిడేస్ మరింత సంబరంగా జరుపుకొనేందుకు, ఆధునిక పోకడలను అనుసరించడంలో తోడ్పడతాయి.
స్కైప్‌పై లెన్సెస్ ఎలా ప్రారంభించాలో ఇక్కడ చూడండి:
స్కైప్ మొబైల్ యాప్‍లో, మీరు చాట్ చేయదలచుకొన్న ఒక కాంటాక్ట్ ఎంచుకోండి లేదా ఇప్పటికే ఉన్న సంభాషణను తెరవండి. మీ స్క్రీన్ క్రిందివైపు కుడిభాగంలోని కెమెరా ఐకాన్‌పై ట్యాప్ చేయండి.
అందుబాటులో ఉండే అన్ని ఫన్ లెన్సెస్ చూసేందుకు బటన్ కుడి వైపు ఉండే స్మైలింగ్ మొఖంపై ట్యాప్ చేయండి, అప్పుడు ఆ క్షణానికి ఖచ్చితంగా సరిపోయే లెన్స్ ఎంచుకోండి.
లెన్స్ ఉపయోగించి ఫోటో వీడియో లేదా తీసుకోండి, ఇప్పుడు స్క్రీన్ కుడి వైపు క్రింద ఉండే సెండ్ ఐకాన్ ఎంచుకోండి.