2014 AXS Partner Summit Keynote

The following keynote was delivered by Evan Spiegel, CEO of Snapchat, at the AXS Partner Summit on January 25, 2014.
మన చరిత్రలో వాస్తవానికి ఈ కాలాన్ని "మరింత వ్యక్తిగత కంప్యూటర్ల శకం" అని పిలవాల్సి ఉన్నప్పుడు "వ్యక్తిగత కంప్యూటర్-అనంతర శకం" అని పిలవడం కొంతవరకూ అసాధారణమని నేను ఎప్పుడూ అనుకునేవాణ్ణి.
మిస్టర్ మ్యాకెన్‌తోష్ అనే పేరు గల గొప్ప వ్యక్తి కధను నిన్న నేను చదివాను. నిన్నటికి 30 సంవత్సరాల క్రితం ఆవిష్కరించిన మ్యాకెన్‌తోష్ కంప్యూటర్ లోపల నివసించడానికి స్టీవ్ జాబ్స్ రూపొందించిన ఒక వ్యక్తి. అతడు క్రిందికి లాగే మెనూ వెనుక దాగి ఉండి లేదా ఒక ఐకాన్ వెనుకనుండి వచ్చిపోతూ చాలా తరచుగా ప్రత్యక్షమయ్యేవాడు - అతడు నిజమైన మనిషి కాదని అతి త్వరగా మరియు తడబాటు లేకుండా దాదాపుగా మీరందరూ అనుకునే ఉంటారు.
కంప్యూటర్‌కు ఒక మనిషిని జతచేయడం అనే స్టీవ్ ఆలోచన ఆయన వృత్తిజీవితంలో చాలా త్వరగా జరిగిందని నిన్నటి వరకూ నేను గ్రహించలేదు. అయితే, ఆ కాలంలో, ఇంజినీర్‌లకు 128 కిలోబైట్‌ల మెమరీ మాత్రమే నిర్బంధం కారణంగా మిస్టర్ మ్యాకెన్‌తోష్ లేకుండానే మ్యాకెన్‌తోష్ కంప్యూటర్‌లు విడుదల చేసేలా బలవంతం చేయబడ్డాయి. మనిషిని మెషీన్‌కు నిజంగా అనుసంధానం చేయడానికి స్టీవ్ వృత్తిజీవితంలో మరీ ఎక్కువ కాలం పట్టలేదు - 2007, జూన్ 29 నాడు iPhone ఆవిష్కరణ జరిగింది.
గతంలో, కారు, ఇల్లు, బండి వంటి భౌతిక ప్రదేశాల్లో కంప్యూటర్లను ఉంచడానికి సాంకేతిక ఇబ్బందులు ఎదురయ్యేవి. iPhone కంప్యూటర్‌ని కేవలం ఒక విశిష్టమైన ఒక ఫోన్ నెంబరుకు కట్టిపడేసింది – అంటే మీకు.
మరీ ఎక్కువ కాలం క్రిందట కాదు మరి, కమ్యూనికేషన్ అనేది లొకేషన్ ఆధారితంగా ఉండేది. మనం కలిసి ఒకే గదిలో ఉండే వాళ్ళం, ఆ పరిస్థితిలో మనం ముఖా-ముఖీ మాట్లాడుకునేవాళ్ళం, లేదా మనం ఒకరి నుండి మరొకరు దూరంగా ప్రపంచవ్యాప్తంగా ఉండే వాళ్ళం, ఆ పరిస్థితిలో నేను మీ ఆఫీసుకు కాల్ చేసే వాణ్ణి లేదా మీ ఇంటికి ఒక ఉత్తరం పంపించేవాణ్ణి. మరీ ఇటీవలనే మాత్రమే మనం కంప్యుటేషన్ మరియు కమ్యూనికేషన్ ఆవశ్యకత కోసం వ్యక్తిగత గుర్తింపులకు ఫోన్ నెంబర్‌లను జోడించడాన్ని ఇటీవలే ప్రారంభించాం.
స్మార్ట్ ఫోన్లు కేవలం మనిషిని మెషీన్ తో గుర్తించడానికి - మరియు మరింత వ్యక్తిగతమైన కంప్యూటర్ యుగాన్ని తీసుకురావడానికి చేసిన స్టీవ్ యొక్క ప్రయాణానికి పరాకాష్ట అని నేనంటాను.
Snapchat వద్ద మా పనికి సంబంధించి ప్రత్యేకంగా సముచితమనిపించే మరింత వ్యక్తిగతమైన కంప్యూటర్ యొక్క గుణగణాలు మూడు ఉన్నాయి:
1) ప్రతి చోటా ఇంటర్నెట్
2) వేగంగా + సులభంగా మీడియాను సృష్టించడం
3) అశాశ్వతత్వం
మేము 2011లో మొదటిసారి Snapchat పై పనిచేయడం ప్రారంభించినప్పుడు, అది కేవలం ఒక ఆటబొమ్మగా ఉండేది. అనేక రకాలుగా అది ఇప్పటికీ అంతే - ఐతే సామెత చెప్పినట్టు, "ఆటబొమ్మలు అవి కనిపించినంత అమాయకమేమీ కాదు". ఆటబొమ్మలు మరియు ఆటలు తీవ్రమైన ఉపాయాలకు నాంది ప్రస్తావనలు.”
ఒక ఆటబొమ్మను ఉపయోగించడానికి గల కారణాలను వివరించాల్సిన పనిలేదు – అది కేవలం వినోదం కొరకు, అంతే. అయితే ఒక ఆటబొమ్మను వాడటం నేర్చుకోవడానికి అద్భుతమైన అవకాశం.
మిత్రులారా, మనం నేర్చుకుంటున్నామా.
ప్రతి చోటా ఇంటర్నెట్ అంటే, ప్రపంచం ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ ప్రదేశాలుగా విడిపోవడం అనే మన పాత భావన ఇక ఏ మాత్రం సముచితమైనది కాదు. మనం ఆఫ్‌లైన్ ప్రపంచములో అనుభవాలతో జీవిస్తాము, ఆ అనుభవాలను రికార్డు చేస్తాము, మరి ఆ తర్వాత ఆ అనుభవాన్ని పున:సృష్టించడానికి మరియు దాని గురించి మాట్లాడుకునేందుకు వాటిని ఆన్‌లైన్‌లో పోస్ట్ చేయడం సంప్రదాయక సోషల్ మీడియాకు అవసరమైంది. ఉదాహరణకు, నేనొక విహారయాత్ర వెళతాను, అనేక ఫోటోలు తీసుకుంటాను, ఇంటికి తిరిగొస్తాను, మంచివాటిని ఏరుకుంటాను, వాటిని ఆన్‌లైన్‌లో పోస్ట్ చేస్తాను, వాటి గురించి స్నేహితులతో మాట్లాడతాను.
గుర్తింపుకు సంబంధించి ఈ సంప్రదాయ సోషల్ మీడియా అభిప్రాయం వాస్తవంగా విప్లవాత్మకం: మీరు పబ్లిష్ చేసిన అనుభవాల సారమే మీరు. లేనట్లయితే అది చిత్రాలుగా తెలుస్తుంది లేదా అది కూడా జరగదు.
లేదా Instagram విషయములోనైతే: అందమైన చిత్రాలు లేదా అది జరగలేదు మరియు మీరు ప్రశాంతంగా లేరు.
ప్రొఫైల్ ఈ భావన ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ బైనరీ అనుభవాన్ని అర్ధవంతం చేసింది. అది, ఆన్‌లైన్‌లో నేను ఎవరిని అని పునఃసృష్టించడానికి డిజైన్ చేయబడింది, తద్వారా, ఆ నిర్దిష్ట క్షణంలో నేను లాగ్-ఆన్ కాకపోయినప్పటికీ, వ్యక్తులు నాతో మాట్లాడగలుగుతారు.
సంపూర్ణంగా ఒక భిన్నమైన అనుభవాన్ని అందించడానికి Snapchat 'ప్రతిచోటా ఇంటర్నెట్' పై ఆధారపడుతుంది. మేం అనగా, మేము చెప్పిన లేదా చేసిన లేదా అనుభవించిన లేదా ప్రచురించిన ప్రతిదాని సారాంశం కాదు – మేము ఫలితము. మేం ఎవరంటే, ఈ రోజు, ఇప్పుడు, ఈ క్షణం మేంగా ఉన్న వాళ్ళం.
మేం ఇక ఏ మాత్రమూ "నిజమైన ప్రపంచాన్ని" ఒడిసిపట్టి దానిని ఆన్‌లైన్ లో పునఃసృష్టించాల్సిన పనిలేదు - మేం కేవలం బ్రతుకుతాం అదే సమయములో మాట్లాడుకుంటాం.
కమ్యూనికేషన్ మీడియా సృష్టిపై ఆధారపడుతుంది మరియు ఆ మీడియా సృష్టించిన మరియు పంపించిన వేగంచే నిర్బంధించబడుతుంది. అది మీ భావోద్వేగాలు, అనుభూతులు మరియు ఆలోచనలను ఉపన్యాసం, లేఖనం, లేదా ఫోటోగ్రఫీ వంటి మీడియా కంటెంట్‌లోనికి పొందుపరచడానికి సమయం తీసుకుంటుంది.
నిజంగా, మనుషులు ఎల్లప్పుడూ తమను తాము అర్థం చేసుకోవడానికి మరియు ఇతరులతో పంచుకోవడానికి మీడియాను ఉపయోగించారు. నేను రాబర్ట్ బర్న్స్ ఈ అనువాదముతో గేలియల్‌లోని ఒక మాట చెబుతాను, “ఓ దేవుడా కొంత శక్తిని మాకు కానుకగా ఇవ్వు, ఇతరులు మమ్మల్ని చూసే విధంగా మమ్మల్ని మేము చూసుకోవడానికి.”
నేను ఆ వాక్యం విన్నప్పుడు, నేనేమీ చేయలేకపోయాను కానీ స్వీయ- చిత్రాల గురించి ఆలోచించాను. లేదా మన మిలినీయల్స్ కోసం: సెల్ఫీ! మనల్ని ఇతరులు చూసే విధానములో అర్థం చేసుకోవడానికి స్వీయ చిత్రాలు మనకు సహాయపడతాయి - మనకు ఏమనిపిస్తోంది, మనం ఎక్కడున్నాం, మరియు మనం ఏమి చేస్తున్నాం అనేవాటిని అవి తెలియజేస్తాయి. అవి వాదనపరంగా స్వీయ-వ్యక్తీకరణ అత్యంత సుపరిచిత రూపం.
గతంలో, నిలువెత్తు స్వీయ చిత్రాలు పూర్తి కావడానికి అనేక వారాలు మరియు మిలియన్ల కొద్దీ కుంచెలూ పట్టేవి. వేగమైన + సులభమైన మీడియా సృష్టి ప్రపంచములో, సెల్ఫీ తక్షణ వస్తువు. అది ఇప్పటికిప్పుడు - మనమెవరు మరియు మనమెలా ఉన్నామనేది తెలియజేస్తుంది.
మరియు ఇప్పటి వరకూ, ఫోటోగ్రాఫిక్ ప్రక్రియ సంభాషణ కోసం ఎంతో నెమ్మదిగా ఉండేది. ఐతే వేగమైన + సులభమైన మీడియా సృష్టితో మనం ఫోటోలతో కమ్యూనికేట్ చేసుకోగలుగుతున్నాము, మనం సోషల్ మీడియాపై చేసినట్లుగా వాటి చుట్టూ మాత్రమే కమ్యూనికేట్ చేసుకోవడం కాదు. మనం మీడియా ద్వారా కమ్యూనికేట్ చేసుకోవడం మొదలుపెట్టినప్పుడు మనం వెలిగిపోతాం. అదొక తమాషా.
సెల్ఫీ Snapchat పై కమ్యూనికేషన్ ప్రాథమిక ప్రమాణం అనే భావన కలిగిస్తుంది, ఎందుకంటే అది స్వీయ-వ్యక్తీకరణగా డిజిటల్ మీడియా మరియు కమ్యూనికేషన్‌గా డిజిటల్ మీడియా మధ్య రూపాంతరాన్ని గుర్తు వేస్తుంది.
ఇది సంభాషణ మూలంలో అశాశ్వతత్వం ప్రాముఖ్యతను తెలియజేస్తుంది.
కంటెంట్ మీకు తీసుకువచ్చే అనుభూతిపై దృష్టి సారించే కంటెంట్‌ని Snapchat నిరాకరిస్తుంది, కానీ కంటెంట్ కనిపించే విధానాన్ని కాదు. ఇదొక సంప్రదాయక భావన, సంభాషణకు సమగ్రత మరియు సందర్భాన్ని పునరుద్ధరించే తీవ్రమైన పారదర్శకతకు సహజ స్పందన.
మనం ముఖాముఖీగా మాట్లాడేటప్పుడు మనకు ఉన్న ఆకాంక్షలను ప్రతిబింబించే సంభాషణ చుట్టూ Snapchat ఆకాంక్షలను ఏర్పరుస్తుంది.
అదీ Snapchat గురించి అంతా. కంటెంట్ చుట్టూ కాకుండా దాని ద్వారా మాట్లాడడం. స్నేహితులతో, కొత్తవారితో కాదు. గుర్తింపు ఇప్పటికి, ఈరోజుకు కట్టుబడి చేయబడింది. ఎదుగుదల, భావోద్వేగ ముప్పు, వ్యక్తీకరణ, పొరపాట్లకు చోటు, మీకు చోటు.
మరింత వ్యక్తిగతమైన కంప్యూటింగ్ శకం మరింత వ్యక్తిగతమైన కమ్యూనికేషన్‌కు సాంకేతిక మౌలిక సదుపాయాలను అందించింది. ఈ అద్భుతమైన రూపాంతరములో భాగం కావడం పట్ల మేము ఎంతో అదృష్టవంతులుగా భావిస్తున్నాము.
Snapchat హృదయం నుండి నిర్మించబడిన ఒక ఉత్పత్తి – మేం లాస్ ఏంజిల్స్ లో ఉండడానికి కారణం అదే. నేను తరచుగా టెక్నాలజీ కంపెనీలు, కంటెంట్ కంపెనీల మధ్య గల వివాదాల గురించి ప్రజలతో మాట్లాడుతుంటాను - నేను కనుగొన్న అతిపెద్ద సమస్యలలో ఏమిటంటే, తరచుగా టెక్నాలజీ కంపెనీలు సినిమాలను, సంగీతాన్ని మరియు టెలివిజన్‌ని సమాచారంగా చూస్తాయి. డైరెక్టర్లు, నిర్మాతలు, సంగీతకారులు, మరియు నటీనటులు వాటిని అనుభూతులుగా, వ్యక్తీకరణగా చూస్తారు. శోధించాల్సిన, కూర్చాల్సిన, మరియు వీక్షించాల్సిన పనిలేదు - ఐతే అనుభవించాలి.
Snapchat సమాచార బదిలీపై కాకుండా – సంభాషణ అనుభవముపై దృష్టి సారిస్తుంది. ఈ కమ్యూనిటీలో భాగంగా ఉన్నందుకు మేం ఎంతో సంతోషిస్తున్నాం.
ఈరోజు నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు మరియు మన ప్రయాణములో భాగమైనందుకు మీకు ధన్యవాదాలు. మీ అందరి గురించి తెలుసుకోవడానికి మా టీమ్ ఎదురు చూస్తోంది.
Back To News