2014 LA Hacks Keynote

The following keynote was delivered by Evan Spiegel, CEO of Snapchat, during LA Hacks at Pauley Pavilion on April 11, 2014.
ఈ క్రింది ముఖ్య సందేశము 2014, ఏప్రిల్ 11 వ తేదీన పాలీ పెవిలియన్ వద్ద LA హ్యాక్స్ సందర్భంగా Snapchat CEO ఇవాన్ స్పీజెల్ అందించారు.
ఈ సాయంత్రం మీ సమయం మరియు శ్రద్ధకు నేను కృతజ్ఞుత తెలియజేస్తున్నాను. రూపకల్పనచేయడానికి ఇక్కడ ఒక్కటిగా కలిసిన అనేకమంది యువజనులను చూడటం ఎంతో అద్భుతంగా ఉంది. నాతో సహా మిమ్మల్ని నేను నిజంగా అభినందిస్తున్నాను.
విజయానికి కీలకాంశాల గురించి వ్యక్తులు నన్ను తరచుగా అడుగుతుంటారు మరియు నేను ఎల్లప్పుడూ నాపట్ల కొంత ఉత్సాహంగా ఉండేవాడిని.
అయితే ఇటీవల కాలం వరకు నేను సమాధానం కనుగొనలేదు. హాంగ్‌కాంగ్ దేవాలయంలో ఒక తెలివైన ముసలాయన నా చేతిని చూపించుకున్నందుకు నేను అదృష్టవంతుణ్ణి. నాకు పెళ్ళవుతుందనీ మరియు 30 సంవత్సరాల వయసు వచ్చేలోపు కొడుకు పుడతాడనీ చెప్పడంతో పాటు అదనంగా నాకు ఆయన విజయానికి మూడు సూత్రాలు చెప్పాడు.
అవి ఈ క్రింది విధంగా ఉన్నాయి:
1. కష్టపడి పనిచేయడం
2. సమర్థత
3. మానవ సంబంధాలు
ఒక శుక్రవారం రోజున రాత్రి పది గంటల సమయములో, తరువాత 36 గంటల పాటు కలిసి పనిచేయాలనే ఉద్దేశ్యముతో మీరందరూ ఇక్కడ ఉన్నారంటే - కష్టపడి పనిచేయడం లేదా సమర్థత గురించి వివరించి చెప్పడం అవసరమని నేను అనుకోను. మీకు స్పష్టంగా అటువంటి అస్త్రాలున్నాయి.
కాబట్టి, ఈ రాత్రివేళ నేను దృష్టి సారించబోతున్నదేమిటంటే, మానవ సంబంధాలు, బిజినెస్ కార్డులు మార్చుకోవడం లేదా LinkedIn పై ఒకరినొకరు జోడించుకోవడం వంటిది కాదు, ఐతే కాలంతోపాటు ఏర్పడేవి, లోతైన, పట్టుదలతో కూడిన మరియు స్ఫూర్తిదాయక సంభాషణలతో ఏర్పడేవి.
మేము Snapchat వద్ద చేసేది, నేను మా హైస్కూల్‌లో, రోడ్డు కూడలిలో నేర్చుకున్నది, ఆ తదుపరి తిరిగి ఓజాయ్ ఫౌండేషన్- ప్రాక్టీస్ కౌన్సిల్ నుండి అరువు తెచ్చుకున్నదానిని పంచుకోవాలని నేను అనుకున్నాను. మీలో కొందరికి అది మితిమీరిన సెంటిమెంట్‌లా అనిపించవచ్చు, ఐతే అది నిజంగా మనకు ముఖ్యమైనది. అంటే, వారానికి ఒకసారి, సుమారు ఒక గంట పాటు, 10 మంది లేదా అంతకు మించిన టీము సభ్యులు కలుసుకొని తాము ఎలా భావిస్తున్నాం అనేదాని గురించి మాట్లాడుకుంటారు. విజయానికి మూడు మూల సూత్రాలు ఉన్నట్లే, కౌన్సిల్‌కి కూడా మూడు నియమాలున్నాయి. మొదటిది, ఎల్లప్పుడూ హృదయం నుండి మాట్లాడడం, రెండోది, తప్పనిసరిగా వినే బాధ్యత, మరి మూడోది కౌన్సిల్‌లో జరిగే ప్రతిది కౌన్సిల్‌లోనే ఉండాలి. ఈ నిర్దిష్టమైన సమ్మేళనము, మాకు ఏమనిపిస్తోంది అని వ్యక్తీకరించడానికి మాత్రమే కాకుండా, ఇతరుల మనోభావాలను అర్థం చేసుకోవడం మరియు విశ్లేషించడం నేర్చుకోవడానికి కూడా అద్భుతంగా ఉపయోగపడిందని మేము కనుగొన్నాము.
మీరు మీ స్టోరీస్ పంచుకోవాలని అనుకున్నప్పుడు శ్రద్ధగా వినే ఒక వ్యక్తిని మీరు ఇష్టపడ్డారు మీకు తెలుసా, మరియు ఆ వ్యక్తి చెప్పేది వినడానికి మీరు ఎక్కువగా కోరుకునేవారు, అతణ్ణి నేను చేర్చుకుంటానని ఒక స్నేహితుడు నాకు చెప్పాడు.
కాబట్టి, హృదయం నుండి మాట్లాడడం లేదా ఆలోచనాత్మకంగా వినడం ప్రాముఖ్యతను తగ్గించకుండా, కౌన్సిల్‌లో జరిగేది కౌన్సిల్ లోనే ఉంటే ఏమి జరుగుతుందనే భావన గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. కౌన్సిల్ జరుగుతున్నప్పుడు వెలిబుచ్చే మనోభావాలను బహిరంగంగా పంచుకోకుండా చూసుకోవడం మనకు మనం నిస్సహాయులుగా చేసుకునే ఒక చోటును కల్పిస్తుంది. అది, మన లోతైన, అత్యంత విశిష్టమైన ఆలోచనలు పంచుకోవడానికి మనకు వీలు కలిగిస్తుంది - వేరే సందర్భములోనైతే ఆ ఆలోచనలు మరియు మనోభావాలను సులభంగా అపార్థం చేసుకోవచ్చు. మరింత సులువుగా చెప్పాలంటే: మనం కౌన్సిల్ యొక్క గోప్యతను గౌరవిస్తాము.
దురదృష్టవశాత్తూ, గోప్యతను తరచుగా రహస్యతగా పేర్కొంటుంటారు, నిస్సెన్‌బామ్ ఎత్తి చూపినట్లుగా, గోప్యత అనేది వాస్తవంగా సందర్భాన్ని అర్థం చేసుకోవడంపై దృష్టి పెడుతుంది. ఏమి చెప్పబడిందనేది కాదు - ఎక్కడ చెప్పబడింది మరియు ఎవరికి అనేది ముఖ్యం. మనము వేర్వేరు విషయాలను వేర్వేరు వ్యక్తులతో వేర్వేరు సందర్భాలలో పంచుకునేటప్పుడు ఏర్పడిన సాన్నిహిత్యం నుండి ఆనందించడానికి మరియు నేర్చుకోవడానికి గోప్యత మనకు వీలు కలిగిస్తుంది.
కుండేరా ఇలా వ్రాస్తారు, “ప్రైవేటుగా మనం మన స్నేహితుల్ని చెడుగా అంటాం మరియు మొరటు భాష వాడతాం; అంటే జనంలో కంటే మనం ప్రైవేటుగా విభిన్నంగా వ్యవహరించడం అనేది ప్రతి ఒక్కరి అత్యంత ప్రస్ఫుటమైన అనుభవం, అది వ్యక్తి జీవిత సహజ నైజము; ఆసక్తిగా చూస్తే, ఈ సహజమైన వాస్తవం తెలియకుండానే, గుర్తించుకుండానే, పారదర్శక అద్దాల ఇంటి యొక్క కవితా స్వప్నాల్లా ఎప్పటికీ అస్పష్టంగా నిలిచి ఉంటుంది, ఇతరులందరిపైనా వ్యక్తి సమర్థించుకోవాల్సిన విలువగా అది అరుదుగా అర్థం చేసుకోబడుతుంది."
అమెరికాలో, ఇంటర్నెట్ రాకముందు, మన బహిరంగ మరియు వ్యక్తిగత జీవితాల మధ్య వ్యత్యాసము మామూలుగా మన భౌతిక స్థలము - మన పని మరియు మన నివాసం మధ్య ఉండేది. మనం మన స్నేహితులు మరియు కుటుంబముతో కమ్యూనికేట్ చేసుకునే సందర్భము స్పష్టంగా ఉండేది. పనిలో, మనం వృత్తి నిపుణులం, మరి ఇంట్లో మనం భార్యభర్తలు, కొడుకులు, కూతుళ్లు.
వారి వ్యక్తిగత జీవితాల్లో గణనీయమైన ఆసక్తిని జనరేట్ చేయగల పబ్లిక్ పర్సనాలిటీస్ అయిన సెలబ్రిటీల కంటే పబ్లిక్ మరియు ప్రైవేట్ వ్యక్తీకరణ మధ్య ఉండే తేడాను చాలా తక్కువ మంది అర్ధం చేసుకుంటారు. ఒక వ్యక్తి గోప్యతకు భంగం కలిగినప్పుడు, ఒక వ్యక్తి పంచుకునే సందర్భము కూలిపోయినప్పుడు, బహిరంగము మరియు ప్రైవేటు స్పష్టంగా విభిన్నంగా ఉంటాయి.
ఇటీవల ఒక ఎయిర్‌పోర్టు గుండా నడుచుకుంటూ వెళుతున్నప్పుడు, మార్లిన్ మన్రో "చివరి స్క్రాప్ బుక్"ని వెల్లడించేందుకు వాగ్ధానం చేస్తున్నఒక న్యూస్‌వీక్ ప్రత్యేక సంచిక నన్ను ఆకట్టుకుంది. నిజంగానే, ఒక పాత్రికేయుడు, ఆమె ఒక ఫోటోగ్రాఫర్ మరియు స్నేహితుడి కోసం క్రియేట్ చేసిన స్క్రాప్‌బుక్‌ని కనుగొన్నాడు.
ఆ పాత్రికేయుడు స్క్రాప్‌బుక్ గురించి ఇలా రాశాడు, "ఈమె సహజంగా ఉంటూ, గజిబిజి జుట్టు కలిగియున్న మరియు తన గురించి ఎవరు ఏమనుకుంటారు లేదా వాళ్ళు ఆమెను ఎలా చూడవచ్చు అని ఆలోచించని మార్లిన్. ఆమె చిత్రాల కూర్పును గమనించలేదు. ఆమె పిక్చర్లలో ఆమె ఏమి చేస్తున్నదో అని చూస్తోంది. ఆమెకు తమాషాగా ఉండటం ఇష్టం."
పేజీల్లో మార్లిన్ ఆలోచనలు మరియు భావాలను బొమ్మల ప్రక్కన ఉంచుతూ వర్ణభరితంగా ఉన్నాయి. ప్రొడక్షన్ గేర్ చుట్టూ ఉన్న బాత్‌రోబ్‌లో ఆమె స్వంత ఫోటో ప్రక్కన, ఆమె ఇలా రాస్తారు, "ఒక అమ్మాయి పనిచేస్తున్నప్పుడు ఆమెకు గోప్యత ఉండదు." తన స్క్రాప్‌బుక్‌ని ఫోటోగ్రాఫర్ స్నేహితుడితో పంచుకోవడానికి ఒక ప్రైవేట్ స్థలం అని మార్లిన్ భావించింది. ఆమె బహిరంగ వ్యక్తిత్వములో అది భాగము కాదు.
మన స్నేహితులు, లేదా మన ‘‘ఆడియెన్స్’’ వినోదం కొరకు ఎలాంటి నేపథ్యం లేకుండా మన ఫీలింగ్స్‌ స్క్రాప్‌బుక్‌ని సృష్టించడానికి ఇంటర్నెట్ మనల్ని ప్రోత్సహిస్తుంది. మన మనోభావాలు సమాచారముగా వ్యక్తీకరించబడతాయి- అవి మన ఉనికిని వర్గీకరించడానికి మరియు ప్రొఫైల్ చేయడానికి ఉపయోగించబడతాయి.
ఇంటర్నెట్‌పై, సమాచారమును దాని చెల్లుబాటును నిర్ణయించే ప్రయత్నములో దాని ప్రజాదరణను బట్టి ఏర్పాటు చేస్తాము. ఒక వెబ్‌సైట్ అనేక ఇతర వెబ్‌సైట్‌ల ద్వారా రీఫర్ చేయనట్లయితే, అప్పుడది మరింత విలువైనదిగా లేదా కచ్చితమైనదిగా నిర్ధారించబడుతుంది. సోషల్ మీడియాపై వెలిబుచ్చిన మనోభావాలు ఒకే రీతిలో లెక్కింంచబడతాయి, ధృవీకరించబడతాయి మరియు పంపిణీ చేయబడతాయి. ప్రజాదరణ పొందిన వ్యక్తీకరణ అత్యంత విలువైన వ్యక్తీకరణ అవుతుంది.
సోషల్ మీడియా వ్యాపారాలు మన వ్యక్తిగత సంబంధాల్లో పెట్టుబడిదారీ విధాన దూకుడు విస్తరణను తెలియజేస్తాయి. ఒక "పర్సనల్ బ్రాండ్" పై పని చేయడానికై తమకు నచ్చిన వస్తువులను తయారు చేసే పనిలో ఉండమని మేం మా స్నేహితుల్ని అడిగాం- ప్రామాణికత అనేది స్థిరత్వ ఫలితం అని బ్రాండ్‌లు మాకు బోధించాయి. మనం మన "నిజమైన స్వీయత"ని గౌరవించాలి మరియు అదే స్వీయతను మన స్నేహితులందరికీ చూపాలి లేదంటే అపఖ్యాతి పాలయ్యే అవకాశం ఉంది.
అయితే మానవత్వము సత్యము లేదా అసత్యము కాజాలదు. మనకు ఎన్నో వైరుధ్యాలు ఉన్నాయి మరియు మనం మారతాము. అదే మానవ జీవిత ఆనందం. మనం బ్రాండ్‌లం కాదు, అది మన స్వభావములోనే లేదు.
పారదర్శక అద్దాల ఇల్లు అపోహను టెక్నాలజీ శాశ్వతం చేసింది, కీలకమైన ఆలోచనపై ప్రముఖ అభిప్రాయానికి విలువనిచ్చే సంస్కృతిని ఏర్పరచింది. మేం ఎక్కువ సమాచారం ఎక్కువ జ్ఞానానికి సమానమని నమ్మడానికి మాకు మేం అనుమతించాం. పెంపుదలగా, రోసెన్ వివరించినట్లుగా అటువంటి కాలములోమనం జీవించినప్పుడు, “మన స్నేహితులు మరియు సహోద్యోగులకు మొదట వెల్లడించిన సన్నిహిత వ్యక్తిగత సమాచారం బహిర్గతం కావచ్చు- తక్కువ అవగాహన ఉన్న పాఠకులు తప్పుగా అర్ధం చేసుకోవచ్చు.”
మనకు మనం వ్యక్తీకరించుకున్న ప్రతిసారి, మనం చెప్పే విషయాలు శాశ్వతంగా ఉండవచ్చు, ప్రజలందరికీ తెలియవచ్చనే అవగాహనతో అలా చేస్తాం. అధిక సంఖ్యలో ప్రేక్షకులను స్వీకరించే మార్గాల్లో మనకు మనం వ్యక్తీకరించుకోవడానికి ప్రోత్సహించబడతాం. ప్రజామోదానికి వ్యతిరేకంగా మనం మన వ్యక్తిత్వానికి కోల్పోతాం.
విజయవంతమైన నాయకులకు అనుచరులతో ఉన్నవారు అని నమ్మే ప్రజల తరాన్ని మనం అభివృద్ధిపరచామనేదే నా ఆందోళన. ఒక మాటపై నిలబడేవాళ్ళు, ఒకే దృష్టికోణం ఉన్నవాళ్ళు అత్యుత్తమ నాయకులు అని నేను నమ్ముతాను. ఆ దృష్టికోణాన్నే అభివృద్ధి చేయాలి, అది మాత్రమే కాదు, అయితే ప్రైవేటుగా, లేదా ప్రజామద్దతుని వెతకడంలో రిస్క్ సాధారణీకరించబడుతుంది.
ప్రోత్సాహం కోసం, నేను తరచుగా సోర్బొన్ లో రూజ్‌వెల్ట్‌తో మాట్లాడిన ఈ మాటలపై ఆధారపడతాను, ఆయన ఇలా ప్రకటించాడు, “ఇది పట్టించుకునే విమర్శకుడు కాదు; బలవంతుడు ఎలా పొరపాట్లు చేస్తాడో వాటిని ఎత్తి చూపే మనిషి కాదు, లేదా పనులు చేసేవాడు వాటిని బాగా చేయగలగడం కూడా కాదు. ఎవరి ముఖమైతే దుమ్ము, చెమట మరియు రక్తంతో తడిసిపోయి ఉంటుందో; ఎవరు ధైర్యంగా కష్టపడతారో; ఎవరు తప్పు చేస్తారో, ఎవరు మళ్లీ మళ్లీ వెనకబడతారో వాస్తవంగా వారికి, ఆ చోటులో ఉన్న వ్యక్తికి ఆ ఘనత చెందుతుంది, ఎందుకంటే లోపం మరియు వెనుకబాటుతనంలేనిదే కృషి లేదు; ఐతే వాస్తవానికి ఎవరు పాటుపడతారో వారుపనులు చేయగలుగుతారు; గొప్ప ఆనందోత్సాహాలు, గొప్ప అంకితభావాలు ఎవరికి తెలుసు; ఎవరు తనకు తాను ఒక విలువైన కారణంలో గడుపుతారో; ఎవరు అంతిమంగా అత్యధిక సాధన యొక్క తురుపుముక్కగురించి బాగా తెలుసుకుంటారో, అత్యంత దారుణంగా విఫలమైతే, కనీసం గొప్పగా సాహసించినప్పుడు విఫలమైతే, విజయం గానీ లేదా ఓటమిని గానీ ఎప్పటికీ చవిచూడరో వారు చల్లని మరియు దుర్బలమైనఆత్మలతో స్థానమును ఎప్పటికీ పొందరు.”
కార్యక్షేత్రంలోని మనుషులు తమ జీవితాల కోసం కాకుండా, తమ కుటుంబం కోసం కాకుండా, తమ దృష్టికోణం కోసం కాకుండా - ప్రేక్షకుల కోసం మరియు అభినందనల కోసం మరీ తరచుగా పోరాడుతుంటారో అటువంటి మనుషుల సమాజాన్ని మేము నిర్మించాము. మరి మనము, ప్రేక్షకులము, కార్యక్షేత్రంలో కూర్చొని, సంతోషంగా ఆనందించాము, త్రాగుతూ మరియు బాగా తింటూ - అయితే మనము సంతోషంగా ఉన్నామా?
కుండేరా ఇలా వ్రాస్తారు, "ఇది మరొక వ్యక్తి వ్యక్తిగత జీవితాన్ని బయటపెట్టే ఆచారం మరియు నియమం అయినప్పుడు, మనము వ్యక్తి మనుగడను లేదా అదృశ్యతను అత్యధికంగా పణంగా పెట్టే కాలంలోకి ప్రవేశిస్తున్నాము."
ఆ సమయం ఇప్పుడే అని నేను నమ్ముతున్నాను.
అధ్యక్షుడు కెన్నెడీ హత్య జరిగిన రోజున ఆయన ప్రసంగించాల్సిన ఉపన్యాసం చివరి పేరాగ్రాఫ్‌లోని మాటలతో నేను మీ నుండి సెలవు తీసుకుంటాను. ఆ రోజున కెన్నెడీ ఒక యుద్ధ కాలం సందర్భంగా ఉపన్యసించాల్సి ఉంది. ఈ రాత్రికి, మనం వ్యక్తి విధ్వంసాన్ని అడ్డుకోవడానికి జరిగే యుద్ధాన్ని ఎదుర్కొంటున్నట్లుగా వినమని నేను మిమ్మల్ని అడుగుతాను.
"మనం, ఈ దేశంలో, ఈ తరంలో, - ఎంపికచే కాకుండా విధి గతిచే ఉన్నాము - ప్రపంచ స్వేచ్ఛ గోడలపై కాపలాదారుగా. అందుకనే మేం అడుగుతాము, మనం మన అధికారము మరియు బాధ్యతలు విలువతో ఉండవచ్చు, జ్ఞానము మరియు నిగ్రహముతో మనం మన శక్తిని ప్రదర్శించవచ్చు, మన కాలంలోనే మనం సాధించవచ్చు, అన్ని వేళల్లోనూ ప్రాచీన దార్శనికత "భూమిపై శాంతి, మనుషుల పట్ల మంచి సంకల్పం"తో ఉండవచ్చు. అది ఎల్లప్పుడూ మన లక్ష్యంగా ఉండాలి, మన కార్యం యొక్క ధర్మము ఎల్లప్పుడూ మన శక్తిని అంతర్లీనంగా ఉంచుకోవాలి. ఎంతో కాలం క్రిందట రాయబడినట్లుగా: ""ప్రభువు నగరాన్ని కాపాడుకోకపోతే, కాపలాదారులు మేల్కొనే ఉంటారు కాని ఫలితం మాత్రం ఉండదు."
ఇతరులు బహిర్గతం కాకూడదని కోరుకునే విషయాలను బహిర్గతంచేయడమే హ్యాకింగ్ చేయాల్సిన పని అని చెప్పే వివక్షతను తుడిచివేయడానికి మనమందరం ఇక్కడ ఉన్నాము. ఈ వారాంతములో, చాలా ముఖ్యమైన ఈ సమయములో, ఇతరుల ఆలోచనలు, మనోభావాలు మరియు స్వప్నాలను గౌరవించే ఒక చోటును సృష్టించాలని నేను మీ అందరికీ సవాలు విసురుతున్నాను. పంచుకోవడం మరియు సృష్టించడంలో సౌకర్యత మరియు ఆనందాన్ని కనుక్కోవడానికి మనం ఇక్కడికి వచ్చాము - మనం మన భవిష్యత్ తరాల కొరకు, మానవ సంబంధాలు మరియు వ్యక్తిగత వ్యక్తీకరణను గోప్యతచే పరిరక్షించబడే విధంగా వారు కనుక్కోగలిగేలా ఆలోచనాత్మకంగా నిర్మించాల్సి ఉంది.
Back To News