Snap Partner Summit | The Future of Lenses

Today, we’re making it easier to find the right Lenses at the right time. Just press and hold on your camera screen to Scan the world around you.
దాదాపుగా నాలుగు సంవత్సరాల క్రితం మేం Lenses ప్రవేశపెట్టాం: అది మీ సెల్ఫీని చూడటానికి సంపూర్ణంగా ఒక కొత్త మార్గం!
స్వీయ వ్యక్తీకరణ కోసం మేం తయారు చేసిన మొదటి Lenses. తర్వాత వచ్చినవి ప్రపంచశ్రేణి Lenses:3D స్టిక్‌లు, Bitmoji మరియు డాన్సింగ్ హాట్ డాగ్స్ మీ చుట్టూ ప్రపంచాన్ని ఆక్రమించాయి. అత్యంత ఇటీవల మేం Snappables ఆవిష్కరించాము — అవి మీ ముఖంతో మీరు ఆడగల గేములు.
కేవలం ఒక్క సంవత్సరంలోనే, మా కమ్యూనిటీచే 400,000 కు పైగా Lenses రూపొందించబడ్డాయి, ప్రజలు ఆ Lensesతో 15 బిలియన్ సార్లుపైగా ప్లే చేశారు! *Lens రూపకర్తలు తమ పనిని ప్రదర్శించడానికి మరియు వారి వీక్షకుల గురించి మరింత తెలుసుకోవడానికి మేం క్రియేటర్ ప్రొఫైల్స్ ప్రవేశపెడుతున్నాం.
అవి కేవలం మీ ప్రపంచాన్ని మాత్రమే ఫిల్టర్ చేయవు కాబట్టి మేము వాటిని Lenses అంటాము. ఏదైనా కొత్తదాంట్లో మీరు లీనమైపోవడానికి అవి మీకు వీలు కలిగిస్తాయి. భవిష్యత్తులో ఒక రోజున ఇటువంటి అనుభవాలు మీ చుట్టూ, మాట్లాడడానికి, రూపొందించడానికి, నేర్చుకోవడానికి మరియు ఆడేందుకు కొత్త మార్గాలతో ప్రపంచం అంతటా విస్తరిస్తాయని మేం విశ్వసిస్తాం.
ఇవాళ, సరియైన Lenses సరియైన సమయములో కనుక్కోవడానికి మేం సులభతరం చేస్తున్నాము.
AR బార్ మరియు స్కాన్
Snap ఫ్లాట్‌ఫారంపై కొత్త, యూనిఫైడ్ లెన్స్ అనుభవాన్ని మరియు అదనంగా దృఢమైన కెమెరా సెర్చ్ సామర్థ్యాలను కూడా ప్రవేశపెడుతోంది. “AR బార్” మరియు “స్కాన్”లు అతి త్వరలోనే Snapచాటర్స్‌కు అందించబడతాయి.
Snapచాటర్స్ ఇంతకు ముందు ఎన్నడూ లేనివిధంగా Snapchatపై లెన్స్‌లు మరియు కెమెరా సెర్చ్ అనుభవాన్ని కనుగొనడానికి మరియు నావిగేట్ చేయడాన్ని మరింత సులభతరం చేయడానికి AR బార్ డిజైన్ చేయబడింది. AR బార్‌తో, మొట్టమొదటిసారిగా, Snapచాటర్స్ అన్నింటిని ఒకే ప్రదేశంలో సృష్టించగలరు, స్కాన్, బ్రౌజ్ మరియు ఎక్స్‌ప్లోర్ చేయగలరు.
AR బార్‌లో కొత్త స్కాన్ బటన్ కూడా ఉంటుంది, ఇది సందర్భోచితంగా సంబంధిత లెన్స్‌లు మరియు కెమెరా-ఆధారిత అనుభవాలను కేవలం ఒక్కసారి తట్టడం ద్వారా అందించేందుకు రూపొందించబడింది.
స్కాన్‌తో, లెన్స్ స్టూడియో ద్వారా Snap పబ్లిక్ కమ్యూనిటీ ద్వారా సృష్టించిన వాటితో సహా సంబంధిత లెన్స్‌లు, కెమెరా వీక్షణలో కనిపించే దాని ఆధారంగా Snapచాటర్స్ కొరకు డైనమిక్‌గా అందిస్తుంది.
Snap కొత్త Snap పార్టనర్స్‌ని కూడా ప్రవేశపెడుతోంది.
Photomath యొక్క భాగస్వామ్యంతో, కెమెరా లోపల కనిపించే సాధన చూడటానికి Snapచాటర్స్ Snapchat కెమెరాని ఒక గణిత సమీకరణాన్ని గురిపెట్టగలుగుతారు. అదనంగా, పార్టనర్ GIPHYతో కొత్త ఇంటిగ్రేషన్ Snapచాటర్స్ ఎవరైనా Snapchat కెమెరాలో వీక్షించే దాని ఆధారంగా అత్యంత సందర్భోచితమైన, డైనమిక్‌గా జనరేట్ చేయబడ్డ GIF లెన్స్‌లతో వారి Snaps అలకరించేందుకు ఆహ్వానిస్తుంది.
లెన్స్ స్టూడియో మరియు “ల్యాండ్‌మార్కర్‌లు”
Snap యొక్క లెన్స్ స్టూడియో Snapchatపై ఎవరైనా లెన్స్‌లు రూపొందించడం మరియు పంపిణీ చేయడానికి పబ్లిక్‌గా లభ్యమయ్యే డెస్క్‌టాప్ యాప్. లెన్స్ స్టూడియో క్రియేటర్‌ల కొరకు అత్యాధునిక కంప్యూటర్ విజన్ మరియు గ్రాఫిక్స్ టెక్నాలజీని సరలమైన టెంప్లెట్‌లుగా మార్చి అందిస్తుంది. లెన్స్ స్టూడియో మూలంగా Snap కమ్యూనిటీ ద్వారా 400,000కు పైగా లెన్స్‌లు సృష్టించబడ్డాయి, మరియు ఆ లెన్స్‌లు 15 బిలియన్‌లకు పైగాసార్లు ప్లే చేయబడ్డాయి.
నేడు, Snap హ్యాండ్ ట్రాకింగ్, బాడీ ట్రాకింగ్ మరియు పెట్ ట్రాకింగ్ కొరకు టెంప్లెట్‌లతో సహా లెన్స్ సృష్టించడానికి మరిన్ని సామర్థ్యాలను జోడించడానికి మరిన్ని సామర్థ్యాలను జోడించడానికి లెన్స్ స్టూడియోలను అప్‌డేట్ చేస్తోంది.
మొదటిసారిగా, Snap యొక్క సరికొత్త ల్యాండ్ మార్కర్ మరియు లెన్స్ అనుభవాల కొరకు లెన్స్ స్టూడియో టెంప్లెట్‌లను జోడిస్తోంది. ఈ లెన్స్‌లు ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధిచెందిన ల్యాండ్‌మార్క్‌లను రియల్ టైమ్ పరివర్తన చేయగల ఆగ్యుమెంటెడ్ రియాలిటీ అనుభవాన్ని అందిస్తాయి.
క్రియేటర్‌ల కొరకు వీటితో సహా ఐదు లొకేషన్‌లకు సంబంధించిన టెంప్లెట్‌లు లభ్యమవుతాయి: బకింగ్‌హామ్ ప్యాలెస్ (లండన్), యునైటెడ్ స్టేట్స్ క్యాపిటల్ బిల్డింగ్ (వాషింగ్టన్, డి.సి.), ఈఫిల్ టవర్ (పారిస్), ఫ్లాటిరాన్ బిల్డింగ్ (న్యూయార్క్ సిటీ), మరియు TCL చైనీస్ థియేటర్ (లాంస్ ఏంజిల్స్), ఇంకా మరిన్ని రాబోతున్నాయి.
ఈ భౌతిక ప్రదేశాలను సందర్శించే Snapచాటర్స్ ఇవాల్టి నుంచి ప్రారంభం అయ్యే ఈ ల్యాండ్ మార్క్-ఎనేబుల్ చేయబడ్డ లెన్స్‌లను అనుభూతి చెందగలుగుతారు.
Back To News