Happy Holidays

The holidays are a great time to hang out with friends and spend time with family – it’s always better together! We couldn’t think of a better time to announce Groups, a new way to communicate with up to 16 friends on Snapchat.
స్నేహితులు మరియు కుటుంబాలతో కలిసి గడపానికి సెలవులు గొప్ప సమయం- ఎప్పుడూ కలిసి ఉండటం మెరుగ్గా ఉంటుంది! మేము Snapchat పై 16 మంది వరకూ సంభాషించుకోవడానికి, ఒక కొత్త మార్గమైన గ్రూపులను ప్రకటించడానికి మరింత మెరుగైన సమయం గురించి ఆలోచించలేకపోయాము.
ఒక Snap పంపించేటప్పుడు లేదా మీరు ఒక కొత్త చాట్ చేసేటప్పుడు గ్రూపులను ఏర్పరచుకోవచ్చు. మీ స్నేహితులు ఒక గ్రూప్ చాట్‌లో ఉన్నప్పుడు, చాట్ అడుగుభాగాన మేము వారి పేరును చూపిస్తాము. 1:1 చాట్ మొదలు పెట్టడానికి కేవలం వారి పేరును తట్టండి, మరియు తర్వాత సులభంగా ఒక్క స్వైప్‌లో గ్రూపుకు తిరిగి రండి! దీనిని మేం క్విక్ చాట్ అంటాం, మొత్తం గ్రూపును ఇబ్బంది పెట్టకుండా ఒక స్నేహితుడితో సంభాషణ కొనసాగించడానికి ఇది వేగవంతమైన మార్గము.
ఒక గ్రూపుకు పంపించిన చాట్‌లు డిఫాల్ట్‌గా 24 గంటల తర్వాత తొలగించబడతాయి. ఒక గ్రూపుకు పంపించబడిన Snapsని, పాల్గొన్న ఒక్కో వ్యక్తి ఒకసారి మాత్రమే ఓపెన్ చేసి మరియు రీప్లే చేయవచ్చు. ఒక Snap ఓపెన్ కాకుంటే, చాట్స్‌లానే అది 24 గంటల తర్వాత డిలీట్ చేయబడుతుంది.
మేం రెండు కొత్త క్రియేటివ్ టూల్స్ కూడా పరిచయం చేశాం – సిజర్స్ మరియు పెయింట్ బ్రష్. ప్రీవ్యూ స్క్రీన్‌పై ఒక Snap భాగాన్ని కత్తిరించి ఒక స్టిక్కర్‌గా మార్చడానికి సిజర్స్ ఉపయోగించండి! Memoriesలోని Snapsకి పెయింట్ బ్రష్ అప్లై చేయవచ్చు, ఒక Snapని కళాఖండముగా మార్చవచ్చు!
మీ మద్దతు పట్ల మేము ఎంతో కృతజ్ఞులము. మరొక అద్భుతమైన సంవత్సరం పట్ల ధన్యవాదాలు - మీ అందరికీ ప్రొడక్ట్‌లను రూపొందించడానికి మేం ఇష్టపడతాం! మీకు 2017 అద్భుతంగా జరగాలని ఆశిస్తున్నాము.
Back To News