Harmony Korine's Debut Short Film Shot on Spectacles 3 Explores Storytelling in 3D

Today, we unveiled Duck Duck by Harmony Korine, an experimental short film shot using Spectacles 3 to explore storytelling in 3D.
ఈ రోజున మేం Spectacles 3 ఉపయోగించి 3D లో కథ చెప్పడాన్ని అన్వేషించే హార్మోని కొరిన్ రూపొందించిన ప్రయోగాత్మక లఘుచిత్రం Duck Duckని విడుదల చేశాం. Snapsని 3D ఎఫెక్ట్‌లతో పరివర్తన చెందే సామర్థ్యాన్ని అన్-లాక్ చేస్తూ త్రీ-డైమెన్షనల్ ఫోటోలు మరియు వీడియోలను క్యాప్చర్ చేయగల డ్యూయల్ HD కెమెరాలు Spectacles 3లో ఉన్నాయి.
కిడ్స్, స్ప్రింగ్ బ్రేకర్స్ మరియు అత్యంత ఇటీవల బీచ్ బమ్ ద్వారా సుప్రసిద్ధులు, కల్ట్ చిత్ర నిర్మాత అయిన హార్మోని కొరిన్ Spectacles 3 ని ఒక సినిమా సంబంధిత సాధనంగా ప్రయోగం చేస్తూ, మరింత ఆకర్షణీయంగా కథను చెప్పడానికి త్రీ-డెమెన్షనల్ దృశ్యాల్లోనికి ఆగ్యుమెంటెడ్ రియాలిటీని చొప్పించారు.
Spectacles 3 ని ఉపయోగిస్తూ, హార్మోని కొరిన్- ఇప్పుడిప్పుడే వృద్ధి చెందుతున్న వేరబుల్ సినిమా విభాగాలు, ఆగ్యుమెంటెడ్ రియాలిటీ, లీనమయ్యే, యాదృచ్ఛికంగా కథను చెప్పేలా మియామీని డక్ డక్ లో ధ్వని మరియు రంగు యొక్క హద్దులేని డ్రీమ్‌స్కేప్‌లోనికి పరివర్తన చెందించారు. ఈ చలనచిత్రం యొక్క హైబ్రిడ్ రియాల్టీ, చిత్రం కోసం వృద్ధి చేసిన 3D ఎఫెక్టుల ద్వారా జీవం తీసుకురాబడింది, అది Snapchat పై Spectacles 3 యూజర్‌లకు లభ్యమవుతుంది.
“Spectacles 3 అనేది ఫిలిం, వివరణపై, ఏది యానిమేట్ చేయబడిందో మరియు ఏది నిజమైనదో అనేదానిపై నా దృక్పథాన్ని మార్చిన ఒక సంపూర్ణమైన విశిష్ట ఫార్మాట్,” అన్నారు హార్మోని కొరిన్. “మొదటి వ్యక్తి ధృక్కోణము మరియు 3D ఎఫెక్టులను సమ్మేళనం చేయడం ద్వారా, సన్‌గ్లాసెస్ తమ స్వంత హైపర్-పర్సనల్ విశ్వాన్ని ఆవాసంగా చేసుకున్నాయి, మరియు డక్ డక్ యొక్క బహు స్పృహాత్మక అనుభవ స్ఫూర్తికి సహాయపడ్డాయి - దానిని మీరు చూసినప్పుడు ఈ ప్రపంచం లోనికి మీరు నడవగలగడం లాగా.”
“హార్మోని కొరిన్ మరియు Spectacles రెండూ లీనమయ్యేలా కథా కథనం యొక్క సరిహద్దులను చెరిపివేసేందుకు సహాయపడుతున్నాయి,” అని అన్నారు Spectacles హార్డ్ వేర్ డైరెక్టర్ స్టీన్ స్ట్రాండ్. “మీ స్వంత రెండు కళ్ళలాగా లోతును గ్రాహ్యత చేసుకునే సమర్థతతో, ఈ కొత్త టెక్నాలజీ సృజనాత్మక కథా కథనము యొక్క భవిష్యత్తును ఎలా తెలియజేయగలదో చూపిస్తూ Spectacles 3, హార్మొనీ కొరీన్ విశిష్ట దార్శనికతకడక్ డక్‌కు జీవం పోస్తుంది.”
Gucci మద్దతుతో, డిసెంబర్ 4 న మియామీ బీచ్ లోని ఆర్ట్ బేసల్వద్ద ఒక ప్రైవేటు వేడుకలో డక్ డక్ ప్రీమియర్ ప్రదర్శించబడింది. Gucci తో హార్మొనీ కొరీన్ దీర్ఘకాలిక సంబంధ బాంధవ్యాలలో 2019 హాలిడే “గిఫ్ట్ గివింగ్” క్యాంపెయిన్ ఫోటోగ్రాఫింగ్‌ని, క్రూయిజ్ 2020 ప్రకటన ఉద్యమం, ప్రీ-ఫాల్ 2019 కలెక్షన్ లుక్ బుక్ మరియు పురుషులటైలరింగ్ ప్రకటన ఉద్యమం, అదే విధంగా ఒక పరిమిత ఎడిషన్ ఆర్ట్ బుక్, హార్మొనీ కొరీన్‌తో Gucci చేరి ఉన్నాయి. 2019 జూన్‌లో ‌, మిలాన్‌లోని Gucci హబ్‌లో హార్మొని కొరిన్‌కి అంకితం చేస్తూ Gucci పురుషుల ఫ్యాషన్ వీక్ సందర్భంగా, హర్మోని కొరిన్- ద క్రాక్-అప్ అనే ఒక సినిమాటిక్ ప్రదర్శనను నిర్వహించింది.
ఈ సమన్వయ చర్య ప్రకారము, హార్మొనీ కొరీన్ ద్వారా పరిమిత ఎడిషన్ Spectacles x Gucci రూపొందించడానికి హార్మొనీ కొరిన్ మరియు Gucci భాగస్వామ్యం వహించారు. ఆర్ట్ బేసల్ మియామీ బీచ్ 2019 కొరకు ప్రత్యేకంగా రూపొందించబడిన పరిమిత ఎడిషన్ Spectacles 3, హార్మొనీ కొరిన్‌చే స్ఫూర్తిని పొంది మరియు క్రియేటర్ల కొరకు Gucci తో డిజైన్ చేయబడింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న Snapchatters హార్మొనీ కొరీన్ గారి Spectacles x Gucci ని వర్చువల్ గా ఇక్కడ ప్రయత్నించవచ్చు.
డక్ డక్ ని www.spectacles.com పై చూడవచ్చు. హార్మొనీ కొరిన్ ఫిలిం మరియు పరిమిత ఎడిషన్ Spectacles x Gucci మొదటగా డిసెంబర్ 5 నుండి 8 వరకూ మియామీ ఆర్ట్ డిస్ట్రిక్ట్: 3930 NE 2వ అవెన్యూ, వీధి 200, మియామీ, FL 33137 మియామీ బీచ్ లోని మెలిన్ భవనములో జరిగే ఆర్ట్ బేసల్‌లో ప్రదర్శించబడుతుంది. సమాచారము మరియు ప్రదర్శన గంటలను ఇక్కడ చూడవచ్చు.
Back To News