23 మార్చి, 2023
23 మార్చి, 2023

AR ఎంటర్‌ప్రైజ్ సేవలను పరిచయం చేస్తున్నాము

Snap యొక్క కొత్త B2B సమర్పణ, అభివృద్ధి చెందిన వాస్తవికత టెక్నాలజీ కూర్పును నేరుగా వ్యాపారాల చేతులలోనికి తీసుకువస్తుంది
Snap అనేది, ప్రపంచ-శ్రేణి సాంకేతికతతో మరియు ప్రతిరోజూ మా AR తో సగటున 250 మిలియన్లకు పైగా ప్రజలు నిమగ్నమయ్యే ఆగ్మెంటేడ్ రియాలిటీలో ఒక దిగ్గజంగా ఉంది.
AR –డిజిటల్ కంటెంట్ వాస్తవ ప్రపంచంపై కప్పబడి ఉన్నదని మేము నమ్ముతాము - దాదాపుగా ప్రతి పరిశ్రమలోని వ్యాపారాలపై గణనీయంగా ప్రభావం చూపించబోయే లోతైన సాంకేతిక పోలిక మార్పిడికి ప్రాతినిధ్యం వహిస్తుంది, మరియు తద్వారా గెలుపొందే AR వ్యూహాన్ని అవలంబించే కంపెనీలు మరియు బ్రాండ్లు రాబోయే సంవత్సరాల్లో అర్ధవంతమైన పోటీ ప్రయోజనాన్ని పొందుతారు.
Snapchat యొక్క AR టెక్నాలజీల ద్వారా, మేము కేవలం వినోదం మరియు స్వీయ-వ్యక్తీకరణ నుండి, వినియోగదారులు మరియు వ్యాపారాల కోసం నిజమైన వినియోగము వరకూ జరిగే పరిణామక్రమాన్ని చూశాము. మరి, సహజంగానే, బ్రాండ్లు తమ వినియోగదారులతో Snapchat కి అతీతంగా మరియు తమ స్వంత యాప్స్ మరియు వెబ్‌సైట్‌ల ద్వారా సహా వివిధ వేదికల వ్యాప్తంగా నిమగ్నం కాగలిగి ఉండాలి.
ఈరోజున, మేము, వ్యాపారాలు తాము వినియోగదారులతో నిమగ్నం అయ్యే విధానాన్ని పరివర్తన చేస్తూ మరియు మెరుగైన వ్యాపార ఫలితాలను నడపడానికి గాను Snap యొక్క AR టెక్నాలజీ కూర్పును తమ స్వంత యాప్స్, వెబ్‌సైట్లు మరియు భౌతిక ప్రదేశాల లోనికి సమీకృతం చేసుకోవడానికి ఒక కొత్త మార్గం అయిన AR ఎంటర్‌ప్రైజ్ సర్వీసెస్ (ARES) ను పరిచయం చేయడానికి ఎంతగానో సంతోషిస్తున్నాము.
ARES కోసం మా మొదటి సమర్పణ షాపింగ్ సూట్, ఇది AR ట్రై-ఆన్, 3D వ్యూయర్, ఫిట్ ఫైండర్, మరియు మరెన్నింటినో - నేరుగా మర్చంట్స్ స్వంత యాప్స్ మరియు వెబ్సైట్లపై అందిస్తుంది. షాపింగ్ సూట్ ఈరోజున అందుబాటులో ఉంది, మరియు ప్రస్తుతం ఫ్యాషన్, దుస్తులు, అనుబంధ ఉపకరణాలు మరియు హోమ్ ఫర్నిషింగుల కోసం AR షాపింగ్ ని కలిగి ఉంది. ఈ కూర్పులో ఉండేవి:
  • అంకితమైన సేవలు మరియు మద్దతు: వ్యాపారాలు AR ఆస్తుల సృష్టి మరియు ఘనమైన సాంకేతిక అమలు మద్దతు కొరకు అంకితమైన సేవలను ఉపయోగించుకోవచ్చు. వ్యాపారాలు అంతిమ వినియోగదారు పనితీరు కోసం అనుకూలీకృతం చేయబడిన అధిక విశ్వసనీయ ఆస్తులను అందించడానికి గాను తమ యాజమాన్య ఫోటోగ్రామెట్రీ హార్డ్‌వేర్‌ మరియు మెషీన్ లెర్నింగ్ సృష్టి మార్గాలను ఉపయోగించుకొని తమ దుస్తులు, పాదరక్షలు, మరియు కళ్ళజోళ్ళ ఉత్పత్తుల డిజిటల్ వెర్షన్‌లను సృష్టించుకోవడానికి షాపింగ్ సూట్ యొక్క AR ఆస్తుల సృష్టి సేవలు సహాయపడతాయి.
  • ఆస్తులను మరియు సమీకృతాలను నిర్వహించడానికి ఎంటర్‌ప్రైజ్ సాధనాలు: వ్యాపారాలు AR ఆస్తులు మరియు సమీకృతాలను నిర్వహించి మరియు అనుకూలీకృతం చేసుకోవచ్చు, పనితీరు విశ్లేషణలను కొలత చేయవచ్చు మరియు అంకితమైన షాపింగ్ కూర్పు మద్దతును అందుకోవచ్చు.
  • అనుభవాల డెలివరీ: వ్యాపారాలు ఆగుమెంటెడ్ రియాలిటీలో దుకాణదారులకు ఖచ్చితమైన ఫిట్ మరియు పరిమాణాల సిఫార్సులు, ట్రై-ఆన్ లేదా ప్రోడక్టుల వీక్షణను అందుకునే సామర్థ్యాన్ని కలుగజేస్తూ, మరియు 3D లో ఉత్పత్తులను సరిచూసుకుంటూ మా AR ట్రై-ఆన్, ఫిట్ ఫైండర్ మరియు ఇంటరాక్టివ్ 3D వ్యూయర్ టెక్నాలజీని తమ స్వంత యాప్స్ మరియు వెబ్‌సైట్‌ల లోనికి సమీకృతం చేసుకోవచ్చు.
ఈ సమర్పణ ద్వారా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న దుకాణదారులు సునిశ్చితితో సరియైన ఉత్పాదనను కనుక్కోవడానికి వారికి సహాయపడే అధునాతన సాధనాల కూర్పుతో మరింత నిమగ్నాత్మకమైన మరియు వ్యక్తిగతీకృతమైన ఆన్‌లైన్ షాపింగ్ అనుభవాన్ని ఆస్వాదిస్తారు.
300 మందికి పైగా కస్టమర్లు ఇప్పటికే షాపింగ్ సూట్ యొక్క కొన్ని సమ్మేళనాలను ఉపయోగిస్తున్నారు, మరియు మేము తొలి కస్టమర్ల నుండి ఇప్పటికే ఆశాజనకమైన ఫలితాలను చూస్తున్నాము:
  • మంచిగా ఉపయోగించబడిన AR ట్రై-ఆన్ మరియు సంభాషణాత్మక 3D వ్యూయర్ టెక్నాలజీ, కస్టమర్ల మొబైల్ ఉపకరణాలపై ఇన్-స్టోర్ షాపింగ్ అనుభవాన్ని మరియు కార్ట్-కు-జోడించులో 81% పెరుగుదల మరియు మొబైల్ ఉపకరణం వాడుకదారుల కొరకు మార్పిడిలో 67% పెరుగుదలను చూడడానికి, ఒక్కో సందర్శకుడికి రాబడిలో 59% పెరుగుదలకు దారి తీస్తూ (Snap Inc. అంతర్గత డేటా, మార్చ్ 15 - ఆగస్టు 15 2022).
  • ప్రిన్సెస్ పోలీ చేర్చుకోబడిన ఫిట్ ఫైండర్ మరియు AR ట్రై-ఆన్ ఫీచర్లు, టెక్నాలజీని ఉపయోగించని దుకాణదారుల కంటే 24% తగ్గిన రాబడి రేటును కలిగియున్న 7.5 మిలియన్లకు పైగా దుకాణదారుకును సిఫారసులను అందించడానికి (Snap Inc. అంతర్గత డేటా జూలై 1 2020 - అక్టోబర్ 31 2022).
  • ఫిట్ మరియు సైజింగ్ సిఫారసులు మరియు AR టై-ఆన్ ఫీచర్లను ఉపయోగించే దుకాణదారులకు గోబీ క్యాష్‌మియర్ యొక్క మార్పిడి రేటు, 4 గురు దుకాణాదారుల్లో 1 రికి వ్యక్తిగతీకృతమైన అనుభవాలను అందించడానికి సహాయపడుతూ 4X అధికంగా ఉండేది. (Snap Inc. అంతర్గత డేటా సెప్టెంబర్ 1 2022- అక్టోబర్ 31, 2022)
ఈ వెంచర్ Jill Popelkaనేతృత్వములో నడుస్తోంది, వారు AR ఎంటర్‌ప్రైజ్ సర్వీసెస్ హెడ్ గా Snap లో చేరారు, మరియు వ్యూహం, కస్టమర్ అనుభవం, అమ్మకాలు, ఉత్పాదన, ఉత్పత్తి మార్కెటింగ్, కస్టమర్ సపోర్ట్ మరియు సానుకూల వ్యవస్థ అభివృద్ధిని విస్తరించే ప్రపంచ బృందాన్ని నిర్మిస్తున్నారు.

మరింత ఎక్కువమంది కస్టమర్లు తమ వ్యాపారాన్ని పరివర్తన చేసుకోవడానికై వారిని AR కు దగ్గరగా తీసుకురావడానికీ మరియు AR ఎంటర్‌ప్రైజ్ సొల్యూషన్స్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కస్టమర్ల కొరకు షాపింగ్ ప్రయాణాన్ని మరింత నిమగ్నాత్మకం చేయడానికి మేము ఎదురుచూస్తున్నాము!