Introducing Our Story

Snapchat has always been about sharing your point of view. That’s why our application opens straight into the camera. It’s the fastest way to share little moments with our friends – to let them know where we are or how we feel right now. We built Our Story so that Snapchatters who are at the same event location can contribute Snaps to the same Story.
Snapchat ఎల్లప్పుడూ మీ అభిప్రాయాన్ని పంచుకోవడానికేే ఉంది. అందుకే మా అప్లికేషన్ నేరుగా మీ కెమెరాలో తెరుచుకుంటుంది. మన స్నేహితులతో చిన్న చిన్న క్షణాలను పంచుకోవడానికి - మనం ఎక్కడ ఉన్నామో లేదా ఇప్పటికిప్పుడు మనకు ఏమి అనిపిస్తుందో వారికి తెలియజేయడానికి ఇది అతివేగవంతమైన మార్గము.
మేము నా స్టోరిని ప్రవేశపెట్టినప్పుడు, ఆ క్షణాలను కలిపి ఒక కథనముగా కూర్చడం అనేది ఎంత శక్తివంతంగా ఉంటుందో మేము ఎప్పుడూ ఊహించనే లేదు. మా స్నేహితులతో అరమరికలు లేని రోజును వీక్షించడానికి మేము ఇష్టపడతాము.
ఐతే నా స్టోరీ ఎల్లప్పుడూ ఒక ఏకైక, వ్యక్తిగత అనుభవాన్ని తెలియజేస్తూ వచ్చింది. అనేకమైన విభిన్న అభిప్రాయాల దృష్ట్యా - ఒక కమ్యూనిటీ దృక్పథమును అందించే దాన్ని నిర్మించాలని మేము అనుకున్నాము. ఏమైతేనేమి, మా స్నేహితులు తరచుగా అదే విషయాలను పూర్తిగా విభిన్న మార్గాల్లో చూశారు.
తద్వారా అదే ఈవెంట్ లొకేషన్ లో ఉన్న Snapచాటర్లు అదే స్టోరీకి Snapస్ కు దోహదపడగలిగేలా మేము అవర్ స్టోరి ని నిర్మించాము. ఒకవేళ ఒక ఈవెంట్‌ కు మీరు చేరుకోలేకపోతే, అవర్ స్టోరిని చూడడం వల్ల మీరు సరిగ్గా అక్కడే ఉన్నట్లుగా అనిపిస్తుంది! దీనిని ఉపయోగించడం చాలా సులభం.
మేము ఈ వారాంతములో ఎలక్ట్రిక్ డైజీ కార్నివల్‌లో మొదటిసారిగా అవర్ స్టోరి ని అందుబాటులో తీసుకొస్తున్నాం (ఇంకా మేము Snapchat మరియు Insomniac కొరకు ఉచిత Wi-Fi అందిస్తున్నాము!)..
ఒకవేళ మీరు ఎలక్ట్రిక్ డైజీ కార్నివాల్‌లో ఉంటే, కేవలం “మా EDC స్టోరీకి” ఒక Snap జోడించండి, అది మీ “...కి పంపండి” పేజీపై కనిపిస్తుంది. మీరు వాస్తవంగా ఆ ఈవెంట్‌లో ఉన్నట్లుగా Snapchat కు తెలియడానికి గాను మీరు మీ లొకేషన్ సర్వీస్‌లను ఆన్ చేయాల్సి ఉంటుంది. మేము మీ లొకేషన్‌ని భద్రపరచం.
ఒకవేళ మీరు ఎలెక్ట్రిక్ డైజీ కార్నివాల్ చేరుకోలేకపోతే, వరస Snapస్ ల ద్వారా ఈవెంట్‌ని -లైవ్-గా చూడడానికి Snapchat పై EDCLive ను జోడించండి! అవర్ స్టోరి ఎక్కువ సేపు పట్టినా లేదా ఏవైనా చట్టవ్యతిరేకమైన Snapస్ మనం చూసినా, సాధ్యమైనంత వరకు అత్యుత్తమ అనుభవాన్ని ఇవ్వడానికై మేం EDCLiveని సరిచేస్తాము.
అవర్ స్టోరి ఇప్పటికే మీ ఫోన్ పై ఉన్న అప్లికేషన్‌లో ఒక భాగం – అప్‌డేట్ చేయాల్సిన అవసరం ఏమి లేదు. సంతోషంగా స్నాపింగ్ చేయండి!
Back To News