19 సెప్టెంబర్, 2023
19 సెప్టెంబర్, 2023

ప్రపంచవ్యాప్తంగా ఉన్న AR డెవలపర్లకు లెన్స్ ఫెస్ట్ హోస్ట్ చేస్తోంది

నవంబర్ 9, 2023 న లైవ్ స్ట్రీమ్ చేయబడే ఈ కార్యక్రమం సృష్టికర్తలు, డెవలపర్లు మరియు భాగస్వాములను, ఆగ్మెంటేడ్ రియాలిటీ టెక్నాలజీ వార్షిక సంబరాలకు ఒక్కచోటికి తెస్తుంది

ఈ రోజు మేము నవంబర్ 9, 2023 న Snap ఆరవ వార్షిక లెన్స్ ఫెస్ట్ లైవ్ స్ట్రీమ్ చేయబడుతుందని ప్రకటిస్తున్నాము. రోజంతా జరిగే వివిధ ప్రకటనలు, వర్చువల్ సెషన్లు, నెట్‌వర్కింగ్ మరియు మరెన్నో కార్యక్రమాలలో పాల్గొనవలసిందిగా, డెవలపర్లు, భాగస్వాములు మరియు సృష్టికర్తలను మేము ఆహ్వానిస్తున్నాము. దీనికి రిజిస్ట్రేషన్ ar.snap.com/lens-fest వద్ద తెరువబడింది.

మా సరిహద్దులను చెరిపివేసే, ఆగ్మెంటేడ్ రియాలిటీ ద్వారా సంభవించే సాధ్యాలను పునర్నిర్వచించగలిగే ఎంతోమంది విజనరీలు, ఆవిష్కర్తలు, మరియు స్వాప్నికుల యొక్క Snap AR కమ్యూనిటీని ఒక్కచోట చేర్చగలిగే అవకాశం కలిగినందుకు మరియు తద్వారా వ్యాపారాలను నిర్మించేందుకు మేమెంతో ఉత్సుకతతో ఉన్నాము.

దీనితోపాటు, డెవలపర్లను వారి సృజనాత్మక ఆవిష్కరణలకు లెన్స్ ఫెస్ట్ అవార్డ్స్ కై నామినేషన్లు సబ్మిట్ చేయమని కూడా మేము ప్రోత్సహిస్తున్నాము. మా కమ్యూనిటీని సంబరాలు చేసుకోవడానికి, Snap AR ప్లాట్‍ఫామ్‍పై కొత్తగా ఏం రాబోతోందో వెల్లడించడానికి మేము ఇంకా నిరీక్షించలేము.

వార్తలకు తిరిగి వెల్దాం