
2024 న్యూఫ్రంట్స్ వద్ద "మోర్ Snapchat" లైవ్
ప్రకటనకర్తలకు నూతన పరిష్కారాలు మరియు కార్యక్రమాల ప్రకటన
Snapchat అనేది సాంప్రదాయ సామాజిక మాధ్యమాలకు భిన్నంగా, మరియు నిజమైన ఫ్రెండ్స్ మరియు కుటుంబంతో కమ్యూనికేట్ చేసే ప్రదేశంలా ఉండాలనే ఉద్దేశ్యంతో నిర్మించబడింది. సంబంధాలతో నడిచే ఈ వేదిక, ఆనందంగా, చురుగ్గా ఉండే, నిరంతరం పెరిగిపోతున్న మా 422 మిలియన్ల రోజూవారీ క్రియాశీల వినియోగదారులకు ఒక సకారాత్మక వాతావరణాన్ని సృష్టించడంతోపాటు, బ్రాండ్లు మరియు ప్రకటనకర్తలకు మరింత ఉత్తమమయిన ఫలితాలు అందించగలవు.
ఈ రోజు, Snap, భాగస్వాములకు Snapchat మేజిక్‌కు జీవం కల్పించేలా మరియు Snapchat భిన్నమైన మరియు నిరంతరం పెరుగుతున్న ఆడియన్స్‌తో కనెక్ట్ అయ్యేలా ప్రకటనకర్తలాకు నూతన పరిష్కారాలు, కార్యక్రమాలు మరియు కంటెంట్ భాగస్వామ్యాలు ప్రటించేందుకు "మోర్ Snapchat" తో IAB న్యూఫ్రంట్స్‌కు తిరిగి వెళుతోంది. సృజనాత్మక మల్టీమీడియా ప్రొజెక్షన్ మ్యాపింగ్ టెక్నాలజీని వినియోగించుకోవడంద్వారా, చరిత్రాత్మక Cipriani 25ని మేము, Snapchat స్ఫూర్తి, సచేతన మరియు ఆనందకరమైన అందించే ఒక అద్భుత అనుభవాన్ని ఇచ్చే ప్రపంచంగా తిరిగి సృష్టించాము.

AR ఎక్స్‌టెన్షన్లు
ఎక్స్‌టెన్షన్లతో, Snapchatters యాడ్స్ ఆస్వాదించే విధానాన్ని మెరుగుపరచడం, డైనమిక్ ప్రొడక్ట్ యాడ్, Snapయాడ్స్, కలెక్షన్ యాడ్స్, వాణిజ్య ప్రకటనలు మరియు స్పాట్‍లైట్ యాడ్స్‌తోపాటు ప్రకటనకర్తలు AR లెన్సెస్ మరియు ఫిల్టర్లను నేరుగా మా అన్ని యాడ్ ఫార్మట్లలో సంధానించడానికి తోడ్పాటు అందిస్తాము. ప్రకటనకర్తలు తమ ఉత్పత్తులను మరియు IPని ప్రదర్శించడం మరియు తమ బ్రాండెడ్ ప్రపంచాన్ని వారి ప్రకటనలద్వారా ఆగ్మెంటేడ్ రియాలిటీని ఉపయోగించి Snapchattersతో షేర్ చేసుకోవచ్చు.

నూతన AR మరియు ML టూల్స్
AR అస్సెట్ సృష్టిని మరింత వేగం మరియు సులభతరం చేసేందుకు మేము మెషీన్ లెర్నింగ్ మరియు ఆటోమేషన్‌లో పెట్టుబడి పెడుతున్నాము. ప్రస్తుతం మేము, AR ట్రై-ఆన్ అస్సెట్స్ ను సరిగా బద్ధీకరించేందుకు మరియు బ్రాండ్లను 2D ఉత్పత్తి కేటలాగ్‌లను ట్రై-ఆన్ అనుభవాలుగా మార్చేందుకు తీసుకొనే సమయాన్ని తగ్గించగలిగాము. ఇంకా, ML ఫేస్ ఎఫెక్ట్స్‌తో బ్రాండ్లు, కస్టమ్-ఉత్పాదిత లెన్సెస్ అనుమతించే జనరేటివ్ AI సాంకేతికతో బ్రాండెడ్ AR యాడ్స్ సృష్టించగలుగుతారు. ఈ కొత్త సామర్థ్యం, బ్రాండ్లు ఒక భిన్నమైన మెషీన్ లెర్నింగ్ మోడల్‌ను త్వరగా జనరేట్ చేసుకొనేందుకు, అసలైన ముఖ పభావాలను సృష్టించేందుకు, మరియు Snapchattersకు సెల్ఫీ అనుభవాన్ని జనరేట్ చేసేందుకు వీలు కల్పిస్తుంది.
523 ప్రోగ్రామ్ మరియు ఎన్సెంబుల్
మేము మా 523 సృష్టికర్త యాక్సెలరేటర్ ప్రోగ్రాంను ఆరంభించేందుకు, అవార్డ్ పొందిన నటి, రచయిత, మరియు నిర్మాత ఇస్సా రే మరియు ఆమె బ్రాండెడ్ ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీ ఎన్సెంబుల్‌తో భాగస్వామ్యంలో పనిచేస్తాము, తద్వారా బ్రాండ్లు, 523 భాగస్వాములతో కలవవచ్చు మరియు కంటెంట్ ఉత్పత్తి చేయవచ్చు. ఎన్సెంబుల్, తక్కువగా ప్రాతినిధ్యం వహించిన కమ్యూనిటీలనుండి ఉన్న సృష్టికర్తల స్టోరీలకు ప్రాచుర్యం కల్పించాలనే మా ప్రధానోద్దేశ్యాన్ని పంచుకొంటుంది. మేము కలిసి, ఈ సంవత్సరపు 523మంది ఉన్నత శ్రేణి టెల్లర్స్‌కు సాధికారత కల్పిస్తూ, బ్రాండ్లు వారితో నేరుగా సహకారమందించే అవకాశాలను అందించనున్నాము.
క్రీడా భాగస్వామ్యాలు మరియు కార్యక్రమాలు
క్రీడలలోని కొన్న ప్రముఖ కార్యక్రమాలలో మేము ఎన్నో స్పాన్సర్‌షిప్‌లను ప్రకటించాము. NBC యూనివర్సల్ పారిస్ ఒలింపిక్ గేమ్స్‌కు, మా ప్రపంచాన్ని వేసవికాల స్థాయికి తీసుకొని వచ్చేందుకు Snap, NBC యూనివర్సల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకొంది. మొట్టమొదటిసారిగా, కొత్త వ్యాఖ్యానాలు అందించడానికి, విభిన్నమైన తమ స్వరాలలో ఎంతో ఉత్సాహభరితమైన కార్యక్రమాలకు మరింత ఉత్సుకత నింపేందుకు లివ్వీ డన్నె, హారీ జౌర్సీ వంటి మా ప్రముఖ సృష్టికర్తలు రిపోర్ట్ చేయనున్నారు.
మా అంతర్గత AR బృందం సృష్టించిన, ఆర్కాడియాతో కొన్ని నూతన AR అనుభవాలు కూడా ఉంటాయి, దీనివల్ల మా కమ్యూనిటీ NBC కవరేజ్‌లో మునిగిపోవడంతోపాటు, NBCనుండి పారిస్‌లోని అత్యుత్తమ ప్రదర్శనలు ఉండే రోజూవారీ షోలు కూడా ఉంటాయి. వీటిద్వారా ప్రజలు గేమ్స్‌కోసం ఎలా కలసికట్టుగా ఉంటారో అని చూసేందుకు మేమింకా నిరీక్షించలేము.
మా కమ్యూనిటీకి స్టోరీలు మరియు స్పాట్‍లైట్ నుండి అధికార కంటెంట్ అందించేందుకు, మేము సుదీర్ఘకాలంగా WNBA, NBA, మరియు NFLలతో కలిగివున్న మా భాగస్వామ్యాలను కూడా కొనసాగిస్తున్నాము.
దీనికితోడు, డాగ్ సర్ఫింగ్, తీవ్రమైన ఐరనింగ్, నీళ్ళసీసా ఫ్లిప్ చేయడం, మరెన్నో సాంప్రదాయేతర క్రీడలను కవర్ చేసే ఒక స్పోర్ట్ ఛానల్ Snap స్పోర్ట్స్ నెట్‌వర్క్‌ను ప్రారంభిస్తున్నాము. Snap స్పోర్ట్స్ నెట్‌వర్క్ అనేది ఒక కొత్త రకమైన కంటెంట్ కార్యక్రమం, దీనిలో బ్రాండ్లు స్పాన్సర్‌షిప్ ద్వారా మరియు ఉత్పత్తులను సమీకృతం చేయడంద్వారా దీనిని ఉపయోగించుకోవచ్చు. యూజర్-ఉత్పాదకంగా ఉండే ఈ మిశ్రిత కంటెంట్, Snap స్టార్స్, మరియు AR అప్లికేషన్స్‌చే వ్రాయబడే కంటెంట్‌తో ఉండటంవల్ల, Snap స్పోర్ట్స్ నెట్‌వర్క్, మా కమ్యూనిటీకి ఈ అనుభవంలో ఒక చురుకైన పాత్ర పోషించే అవకాశాలను సృష్టిస్తుంది. ఉత్సాహభారితమైన ఈ క్షణాల్లో భాగమయ్యేందుకు e.l.f. మరియు Taco Bellలను భాగస్వాములుగా ప్రకటించేందుకు మేము ఉత్సుకతతో ఉన్నాము.

Snap నేషన్
Snapchat పై నిజమైన సంబంధాల శక్తి మా కమ్యూనిటీ యొక్క వివిధ అభిరుచి అంశాల ద్వారా ఉంటుంది, మరియు ఒక అభిరుచిని పంచుకొనేందుకు Snapchatters అందరినీ ఒక చోట చేర్చేందుకు మేము ఒక కొత్త మార్గాన్ని ప్రవేశపెడుతున్నాము. Snap నేషన్ అనేది, లైవ్ నేషన్ మాత్రమే అందించే యాత్రలు మరియు పండుగల అనుభవాలకు Snapchatters యాక్సెస్ అందించేందుకు మేము లైవ్ నేషన్‌తో భాగస్వామ్యంలోని ఒక ఉత్సాహభరితమైన ఆవిర్భావం.
Snapchatters, తమకిష్టమైన తారలకు సంబంధించిన తెర-వెనుక దృశ్యాలను పూర్తిగా చూడటమేగాక, Snap నేషన్ పబ్లిక్ ప్రొఫైల్ ద్వారా ప్రత్యక్ష సంగీత అనుభవాల మ్యాజిక్ కూడా చూడవచ్చు. దీనికితోడు, Snapchatters, Snap స్టార్స్, అభిమానులు, మరియు కళాకారులు ఉండే లైవ్ నేషన్ కచేరీలను క్యూరేట్ చేయడంతోపాటు, Snapchat ఈ కార్యక్రమాల గురించి వారి దృక్కోణంలో అభిప్రాయాలను కూడా కవర్ చేస్తుంది.
USలోని ప్రకటనకర్తలు బ్రాండెడ్ కంటెంట్ ద్వారా సృష్టికర్త స్టోరీస్, Snap నేషన్ స్టోరీస్, AR లెన్సెస్, లైవ్ నేషన్ IP, మరియు మరెన్నింటిద్వారానో దీనిలో పాల్గొనగలుగుతారు. వచ్చే సంవత్సరం Snap నేషన్, దేశవ్యాప్తంగా 30 పండుగలు మరియు పర్యటనలను ప్రారంభించనుంది.

యాడ్ ప్లాట్‌ఫాం మెరుగుదలలు
మేము మా యాడ్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టే ఆలోచనను కొనసాగిస్తూ, మా అడ్వర్టైజింగ్ భాగస్వాములకు వారి లెక్కకు సరిపోయినంత ఫలితాలను అందించడంపై దృష్టిపెట్టాము. 2024, Q1 లో, మా 7-0 పిక్సెల్ పర్చేజ్ ఆప్టిమైజేషన్ మోడల్, మా పుర్వ్యవస్థీకరించబడిన కనవర్షన్ API (CAPI), సరికొత్త ప్రచార సాధనాలవంటివాటితో సహా అభివృద్ధి పధాన్ని కొనసాగిస్తూ, మన వేదికకు సరికొత్త హంగులు చేపడుతున్నందున, గత సంవత్సరంతో పోల్సిచూస్తే, మా ఆదాయం 21% పెరిగింది.
నేరుగా మేమందించే ప్రతిస్పందన పరిష్కారాలకు పెరిగిపోతున్న డిమాండ్ మాకు ప్రోత్సాహకరంగా ఉంది మరియు మా భాగస్వాములకు మరింత ప్రభావవంతమైన మరియు సమర్థవంతమైన వేదికనందించే మా కృషిని కొనసాగిస్తాము. మేము సాధిస్తున్న పురోగతి గురించి మరింత ఇక్కడ తెలుసుకోండి.
ఈ కొత్త అవకాశాలను అందరికీ ఆక్టివేట్ చేసేందుకు మేము మా అడ్వర్టైజింగ్, కంటెంట్, మరియు సృష్టికర్త భాగస్వాములతో కలసి పనిచేసేందుకు ఎదురు చూస్తున్నాము.