Privacy by Design

Protecting privacy is a very important part of accomplishing our mission: empowering people to express themselves, live in the moment, learn about the world, and have fun together. For us, that’s about the freedom to be you — regardless of who you are, who you’ve been, or who you’re going to be.
మా ధ్యేయము: ప్రజలు తమకు తాముగా భావ వ్యక్తీకరణ చేయడానికి, ఆ క్షణంలో నివసించడానికి, ప్రపంచం గురించి తెలుసుకోవడానికి, మరియు కలిసిమెలిసి వినోదించడానికి వారిని సాధికారపరచడాన్ని నెరవేర్చుకొనుటలో గోప్యతను రక్షించడం చాలా ముఖ్యమైన భాగము, మాకైతే అది, — మీరు ఎవరు, మీరు ఎవరిగా ఉంటున్నారు, లేదా మీరు ఎవరుగా ఉండబోతున్నారు అనేదానితో సంబంధం లేకుండా మీరు స్వేచ్ఛగా ఉండటం.
అందువల్లనే — నిజజీవితం ఎప్పుడూ రికార్డ్ చేయలేం అనే భావనతో మేం Snapchatతో అశాశ్వత మీడియా ఆలోచన ప్రవేశపెట్టాం. ఇది గోప్యత మరియు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను సక్రియం చేస్తుంది. మీరు ఎవరైనా కొత్త వారిని కలిసినప్పుడు, వారు గడచిన ఐదు సంవత్సరాల మీ జీవిత వ్యక్తిగత రికార్డును ఔపోసన పట్టడం మరియు విశ్లేషించడం గురించి మీరు చింతించాల్సిన అవసరం లేదు.
గోప్యత మరియు ఏ సమాచారమును పంచుకోవాలనే మీ హక్కు మనం చేసే ప్రతి పనిలోనూ ఉంటుంది. మరి అందుకనే, సాధారణ డేటా పరిరక్షణ నిబంధనలు (GDPR): అవి, డేటాని కనిష్టం చేయడం, తక్కువ కాలం నిలిపి ఉంచే వ్యవధి, అనామధేయత, మరియు భద్రత. సూత్రాలను సహజంగానే Snap పొందుపరిచింది.
ఉదాహరణకు, మేం కొత్త Snapchat ఫీచర్ నిర్మించడానికి ముందే, గోప్యత న్యాయవాదులు మరియు ఇంజనీర్‌ల ప్రత్యేక బృందం ఈ క్రిందివాటిని నెలకొల్పడానికి మా డిజైనర్లతో సన్నిహితంగా పని చేసింది:
  • మేం డేటాను ఎంత కాలం ఉంచుతాం
  • Snapchatters వారి డేటాకు హక్కులను ఎలా వీక్షించవచ్చు, ప్రాప్తి చేయవచ్చు మరియు అమలు చేయవచ్చు
  • సేకరించబడ్డ డేటాను ఏవిధంగా కనిష్టం చేయవచ్చు
  • సేకరించిన డేటా దాని కోసం ఉద్దేశించినది తప్ప మరేదైనా ఉపయోగించబడదని ఎలా నిర్ధారించాలి
మేం సమాచారాన్ని సేకరించేటప్పుడు, మేం ఉపయోగించే డేటా రకం గురించి ఆలోచనాయుక్తంగా ఉండేందుకు ప్రయత్నిస్తాము. ఉదాహరణకు, మేము మీ జాతి, లైంగికత్వము లేదా రాజకీయ అనుబంధం గురించి సమాచారము సేకరించము మరియు మీ గురించిన స్వీయ గుర్తింపు సమాచారమును ప్రకటనకర్తలు లేదా మూడో పక్షాలతో పంచుకోము.
మేము సేకరించే కొంత సమాచారములో, మీరు ఎక్కడ Snapchat ఓపెన్ చేస్తారు మరియు Discover లో మీరు ఏమి వీక్షిస్తారనే అంశాలు ఉంటాయి. మీకు లొకేషన్-నిర్దిష్టమైన అనుభవాలు, అదే విధంగా "జీవనశైలి విభాగాలు" లేదా "కంటెంట్ ఆసక్తి ట్యాగ్స్" ఇవ్వడానికి ఇది మాకు సహాయపడుతుంది. ఈ ఆసక్తి విభాగాలు, మీకోసమే వ్యక్తిగతీకరించిన కంటెంట్ మీకు ఇవ్వడంలో మాకు మరియు మా ప్రకటనకర్తలకు సహాయపడతాయి.
అత్యంత ముఖ్యంగా, మీరు మాకు అందించే సమాచారముపై మీకు నియంత్రణ ఉండాలని మేము కోరుకుంటాము. మీరు ఉంచబడిన ఆసక్తి విభాగాలపై మీకు సంపూర్ణ నియంత్రణ ఉంటుంది - వాటన్నింటి మీరు వద్దని ఎంచుకోవచ్చు. మీ లొకేషన్ డేటాను మేము ఉపయోగించకూడదని మీరు కోరుకుంటే, మీరు మీ లొకేషన్ అనుమతులను ఆఫ్ చేయవచ్చు. చివరగా, మొదటి మరియు మూడో-పక్షం వీక్షకుల డేటా మరియు మా సర్వర్ల ఆవలి చర్య ఆధారంగా లక్ష్యం చేసుకున్న ప్రకటనలన్నింటి పైకీ ఎంచుకునే స్వేచ్ఛ మీకు ఉంది. మీరు ఈ అనుమతులు అన్నింటినీ Snapchat సెట్టింగ్స్ లో చూడవచ్చు.
మీ డేటా ఎలా ఉపయోగించబడుతోంది అనే సంపూర్ణ అవగాహన విషయానికి వచ్చినప్పుడు, ఒక్క బ్లాగ్ పోస్టు ఎప్పటికీ దానిని కవర్ చేయదని మాకు తెలుసు. కాబట్టి మీకు సమగ్రమైన వివరణ ఇవ్వడానికి గాను సులువైన మరియు అర్థం చేసుకోవడానికి సులభంగా ఉండే భాషలో మేము మా గోప్యతా కేంద్రంని ఇటీవలనే అప్‌డేట్ చేశాము. మీకు ఏవైనా ఇతర ప్రశ్నలు ఉంటే, ఇక్కడఈ లింక్ ద్వారా మమ్మల్ని చేరుకోవడానికి సందేహించవద్దు.
సంతోషంగా స్నాపింగ్ చేయండి!
Back To News